/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz హిందువులు ఆజాన్ మరియు నమాజ్ సమయంలో పూజలు చేయడం మానేయాలి... హిందువులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కొత్త ఆదేశం. Raghu ram reddy
హిందువులు ఆజాన్ మరియు నమాజ్ సమయంలో పూజలు చేయడం మానేయాలి... హిందువులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కొత్త ఆదేశం.

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత హిందువుల పరిస్థితి మరింత దిగజారింది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం నిష్క్రమించిన తర్వాత, మొదట హిందువులపై దాడి జరిగింది మరియు ఇప్పుడు వారు మతపరమైన స్థాయిలో కూడా లక్ష్యంగా చేసుకున్నారు. మహ్మద్ యూనస్ ప్రభుత్వం హిందువులపై నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు మరో కొత్త ఉత్తర్వులు వెలువడ్డాయి. అజాన్ మరియు నమాజ్ సమయంలో లౌడ్ స్పీకర్లను ప్లే చేయకూడదని స్థానిక పూజా కమిటీలను కోరినట్లు బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు తెలిపారు.

ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ కొత్త తాత్కాలిక ప్రభుత్వం నమాజ్ మరియు ఆజాన్ సమయంలో దుర్గా పూజ వేడుకలలో లౌడ్ స్పీకర్లను ప్లే చేయవద్దని హిందూ సమాజాన్ని కోరినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) MD జహంగీర్ ఆలం చౌదరి మంగళవారం మాట్లాడుతూ పూజా కమిటీలు లౌడ్ స్పీకర్లను స్విచ్ ఆఫ్ చేయాలని మరియు అజాన్ మరియు నమాజ్ సమయంలో సంగీత వాయిద్యాలను వాయించవద్దని కోరినట్లు తెలిపారు. నిర్వాహకుల అభ్యర్థనకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు.

చౌదరి మీడియాతో మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో ఈ సంవత్సరం మొత్తం 32 వేల 666 పూజా పండాలను ఏర్పాటు చేయనున్నట్లు, ఇది గత సంవత్సరం సంఖ్య 33 వేల 431 కంటే తక్కువ. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు విద్య మరియు ఉద్యోగాలలో కోటాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలు మరియు మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణ తర్వాత దేశంలోని మైనారిటీ హిందూ సమాజంపై తదుపరి దాడుల తర్వాత ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.

అప్పటి నుండి, బంగ్లాదేశ్‌లో మతపరమైన మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రత గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షా పోరాన్ దర్గాలో జరిగిన సంఘటనతో సహా మత స్థలాలపై ఇటీవల జరిగిన దాడుల గురించి అడిగినప్పుడు, షా పోరాన్ దర్గాపై దాడి గురించి నాకు ఏమీ తెలియదని లెఫ్టినెంట్ జనరల్ చౌదరి అన్నారు. అయితే, ఎలాంటి దాడి జరగకుండా భద్రత కల్పించడం నా బాధ్యత. ఈ మేరకు న్యాయాధికారులకు సూచనలు చేశారు.

విగ్రహాల నిర్మాణం జరిగినప్పటి నుంచి పూజల నిర్వాహకులకు భద్రత కల్పిస్తామని చౌదరి హామీ ఇచ్చారు. పూజా మండపాలలో 24 గంటల భద్రత ఎలా ఉండాలనే దానిపై చర్చించామని ఆయన మీడియాకు తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, దుశ్చర్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే, మహమ్మద్ యూనస్ పాలనలో కొన్ని చర్యలు భారతదేశంలో కనుబొమ్మలను పెంచాయి.

కొన్ని రోజుల క్రితం, యూనస్ యొక్క తాత్కాలిక ప్రభుత్వం భారతదేశానికి హిల్సా ఎగుమతిని నిషేధించింది, ఇది బంగ్లాదేశ్ ఇలిష్ (చేపను బెంగాలీలో పిలుస్తారు) మరియు దుర్గాపూజకు ముందు ధరలు పెరగడానికి దారితీసింది. పండుగల సీజన్‌లో భారతదేశానికి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌కు పద్మ ఇలిష్ యొక్క పెద్ద సరుకులను పంపే స్థిరమైన అభ్యాసం. ఇది అవామీ లీగ్ నాయకురాలు మరియు మాజీ ప్రధాని షేక్ హసీనా అనుసరించిన సద్భావన పద్ధతి.

జగన్‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు మెమో!

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు మెమో ఇవ్వనున్నట్టు జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిచేసిన కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను జగన్ మొన్న పరామర్శించారు. 

అనంతరం బయటకు వచ్చిన జగన్‌ను అదే జైలులో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషాబాను కుమార్తెతో కలిసి వచ్చి జగ‌న్‌తో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విధుల్లో ఉన్న సంగతిని మర్చిపోయి ఇలా సెల్ఫీలు దిగడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన జైలు అధికారులు ఆమెకు మెమో ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జైలర్ రవిబాబు పేర్కొన్నారు.

హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. హైదరాబాద్‌లో హైటెన్షన్..!

తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీ ఆఫీసు వద్ద ఆందోళన నిర్వహిస్తున్న.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహా.. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లదరినీ.. కుందుర్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. మరోవైపు.. అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో.. అరికెపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులపై బీఎన్ఎస్ చట్టంలోని 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కిపోయింది. హైదరాబాద్‌లో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కుందుర్గ్ పోలీస్ స్టేషన్‌కు నేతలను తరలించారు. అయితే.. ఉదయం సమయంలో హుజూరాబాద్ ‌ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు చేసిన దాడి ఘటనపై జాయింట్ సీపీ జోయల్ డేవిస్‌కు ఫిర్యాదు చేశారు.

అరెస్ట్ చేయాలని డిమాండ్..

అయితే.. కౌశిక్ రెడ్డిపై దాడిని సుమోటుగా తీసుకున్న పోలీసులు.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు 30 మందిపై కేసు నమోదు చేశారు. అయితే.. అరికెపూడి గాంధీని ఏ1గా పేర్కొంటూ మొత్తం 30 మందిపై పలు సెక్షన్ల కింద (సెక్షన్లు 189, 191(2), 191(3), 61 , 132, 329, 333 324(4), 324(5) , 351(2) Red with 190 BNS) కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎఫ్ఐఆర్‌ కాపీని బీఆర్ఎస్ నేతలకు అందించారు. అయితే.. అందులో ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు పెట్టకపోవటంతో.. హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ హత్యాయత్నం చేసినట్టుగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంత వరకు వెనక్కి తగ్గేదిలేదంటూ బీష్మించుకుని కూర్చుకున్నారు. అరికెపూడితో పాటు దాడికి యత్నించిన ఆయన అనుచరులను, అందుకు సహకరించిన పోలీసులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్చేయకపోతే.. కోర్టుకు వెళ్తామని హరీష్ రావు డిమాండ్ చేశారు.

హరీష్ రావు సహా అందరినీ అదుపులోకి..

ఆందోళన విరమించి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఎంత చెప్పినా వెనక్కి తగ్గకపోవటంతో.. బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా.. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు బలవతంగా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రెండు బస్సుల్లో బీఆర్ఎస్ నేతలను తరలిస్తున్నారు.

అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు చేసిన దాడిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డి రాత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. మాజీ ఐఏఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహాయంతో కౌశిక్ రెడ్డి కంఫ్లైంట్ ఇవ్వగా.. పోలీసులు అరికెపూడి గాంధీపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఇదే కాకుండా.. బీఎస్‌ఎస్ చట్టంలోని 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎస్సై మహేష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. అంతకుముందు అరికెపూడి గాంధీని అరెస్ట్ చేసిన పోలీసులు.. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా.. 41 నోటీసులు ఇచ్చి వ్యక్తిగత పూచికత్తు మీద అరికెపూడి గాంధీని పోలీసులు వదిలిపెట్టారు. విడుదలైన అనంతరం.. కౌశిక్ రెడ్డిపై కూడా తాను ఫిర్యాదు చేసినట్టు గాంధీ తెలిపారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినట్టుగా ఫిర్యాదు చేసినట్టు వివరించారు.

స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తండ్రి చింతకాయల వరహాలదొర 51వ వర్ధంతి గురువారం బీసీ కాలనీలో లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.

బీసీ కాలనీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరహాలదొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా లాలం మురళీకృష్ణ మాట్లాడుతూ, రాజకీయ పదవులు చేపట్టకపోయినా ప్రజాసేవలో ఆయనకు సాటివారే లేరని కొనియాడారు. వరహాలదొర అడుగుజాడల్లోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు , విజయ్, రాజేష్‌లు ప్రజాసేవలో ఉన్నారని చెప్పారు.

వరహాలదొర విగ్రహం శిథిలావస్థలో ఉండడం వలన పాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రహం ప్రతిష్టించనున్నట్లు గతంలోనే తెలిపారని, ప్రస్తుతం విగ్రహం పూర్తయిందని, త్వరలోనే ప్రతిష్టించనున్నట్లు పేర్కొన్నారు. విగ్రహం చుట్టూ పూల మొక్కలతో అందంగా పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ లాలం మురళీకృష్ణ, బీసీ కాలనీ యూత్, పినారిపాలెం యూత్, అయ్యన్నపాత్రుడు అభిమాన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇంకెంతమంది రైతుల ప్రాణాలు బలిపెట్టాలి?

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కేటీఆర్. రుణమాఫీ అందలేదని అనేక మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ట్విట్టర్ వేదిక ప్రభుత్వాన్ని ఏకపారేశారు మాజీ మంత్రి. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt) మరోసారి విరుచుకుపడ్డారు కేటీఆర్ (Former Minister KTR) . రుణమాఫీ అందలేదని అనేక మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ట్విట్టర్ వేదిక ప్రభుత్వాన్ని ఏకిపారేశారు మాజీ మంత్రి. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. రుణమాఫీ కాలేదని కొందరు-పెట్టుబడి సాయం రైతు భరోసా లేక కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ అంత బోగస్, రైతు భరోసా కూడా బోగస్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

నిన్న... రైతు సురేందర్ రెడ్డి అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్‌లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తన తల్లికి, తనకు ఉన్న రుణం మాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగాకు బలైపోయాడన్నారు. నేడు... రైతు సాగర్ రెడ్డి భార్యాభర్తలిద్దరిలో ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. తన పేరిట ఉన్న లక్షన్నర రుణం, తన భార్య పేరిట ఉన్న లక్షా 60 వేల రుణంలో ఏ ఒక్కరి రుణం మాఫీ అయినా గట్టెక్కుతానని గంపెడాశలు పెట్టుకుని దారుణంగా మోసపోయాడని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డది చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలని ప్రశ్నించారు. ఏకకాలంలో అందరికీ 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాటతప్పిన సీఎంను ఏం చేయాలన్నారు. డిసెంబర్లో పెట్టిన డెడ్ లైన్ సెప్టెంబర్ దాటినా అమలుకాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. 49,500 వేల కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు రైతన్నలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లారుతాయి? ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయటం కాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలన్నారు. రైతులు ఆత్మ హత్యలు చేసుకోవద్దని.. దైర్యంగా ఉండాలని కోరుతున్నాను అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

భక్తులకు ఇబ్బంది కలగొద్దు..!

గణపతి నిమజ్జనం జరిగే ప్రాంతాలు, శోభాయాత్ర జరిగే మార్గంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) అధికారులను ఆదేశించారు.

గణపతి నిమజ్జనం జరిగే ప్రాంతాలు, శోభాయాత్ర జరిగే మార్గంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) అధికారులను ఆదేశించారు.

అదనపు, జోనల్‌ కమిషనర్లతో ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మండపాలు, శోభాయాత్ర సాగే రహదారులపై చెత్త వెంటనే తొలగించేలా పారిశుధ్య కార్మికులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.

శోభాయాత్ర(Shobhayatra) జరిగే మార్గాల్లో 15,500 అదనపు వీధిదీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు రూ.2.98 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. నేడు జరిగే స్టాండింగ్‌ కమిటీ ఎజెండాలో ఈ ప్రతిపాదనపై చర్చించనున్నారు.

రెచ్చిపోయిన అరెకపూడి గాంధీ

ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కౌశిక్ రెడ్డి సవాల్‌కు గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ తన ఇంటికి వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగురవేయకుంటే తానే.. ఆయన ఇంటికి వెళ్తానని సవాల్ చేసాడు. తన యుద్ధం బీఆర్ఎస్ పార్టీతో కాదని.. కౌశిక్ రెడ్డితోనేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంతో ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు, గాజులు పంపుతున్నాను తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి సంచనల కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి.. తిరిగి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు

పీఏసీ ఛైర్మన్‌గా శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమించటంపై కూడా మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేను ఛైర్మన్‌గా నియమించారని ఫైరయ్యారు. 'ఎమ్మెల్యేల ఫిరాయింపుపై హైకోర్టు తీర్పుతో గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని మాటలు మారుస్తున్నాడు. ఆయన నకిలీ గాంధీగా మారిపోయాడు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ భవన్ కు రావాలి. నేను గురువారం ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్తా.. ఆయన మెడలో కండువా కప్పుతా. ఇద్దరం కలిసి మీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేద్దాం. అనంతరం తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెడదాం.' అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.

ఈ సవాల్‌పై తాజాగా గాంధీ స్పదించారు. కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఈరోజు 11 గంటలకల్లా తన ఇంటిపై జెండా ఎగరవేయకపోతే.. 12 గంటలకల్లా తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పారు. తన యుద్ధం బీఆర్ఎస్‌తో కాదని.. కౌశిక్ రెడ్డితోనేని అన్నారు. దమ్ముంటే రారా నా కొ అంటూ రెచ్చిపోయారు. కౌశిక్ రెడ్డి పెద్ద చీటర్ అని.. బీఆర్ఎస్ పార్టీని భ్రష్ఠు పట్టించాడని పైరయ్యారు. మాజీ సీఎం కేసీఆర్‌ను నాశనం చేశాడని మండిపడ్డారు. మేం చేతులు కట్టుకొని కూర్చొలేం. దమ్ముంటే రా తేల్చుకుందాం.. కౌశిక్ రెడ్డికి నాకు యుద్ధం. ఎవరి దమ్మేందో తేల్చుకుందాం రా.' అని గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇద్దరు ఎమ్మెల్యేలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. కాగా, పోలీసుల గృహనిర్బంధంతో కాసేపట్లో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు అభ్యర్దనకు మోదీ అంగీకరిస్తారా..!!

ఏపీలో ప్రధాన ప్రాజెక్టుల భవిష్యత్ కేంద్ర సహకారం పైన ఆధార పడింది. అమరావతి..పోలవరం విషయంలో కేంద్రం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది. అమరావతికి రూ 15 వేల కోట్ల రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. పోలవరం కొత్త డీపీఆర్ కు ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి తాజాగా మరో అభ్యర్ధన అందింది. దీని పైన ఇప్పుడు తీసుకొనే నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు కీలకంగా మారనుంది.

కేంద్రానికి ప్రతిపాదన

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి మరో ప్రతిపాదన సిద్దం చేసింది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన కొత్త డయాఫ్రం వాల్‌, దానిపై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మాణాలను సమాంతరంగా చేపట్టేందుకు తక్షణమే రూ.7 వేల కోట్లు మంజూరు చేయాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ కోరనుంది. ప్రాజెక్టులో మిగిలిన ప్రధాన డ్యాం పనులు పూర్తి చేసేందుకు రూ.12,127 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి చేరవేసింది.

2025 మార్చిదాకా అవసరమయ్యే నిధుల కోసం అభ్యర్థన పంపాలని సూచించింది. దీంతో వెంటనే రూ.7 వేల కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞాపన పంపనుంది. కేంద్రం తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తోంది. ఇంకోవైపు.. ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,127 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించడం.. కొత్త వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణాలను వచ్చే నవంబరు నుంచే మొదలుపెట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కొత్త టెండర్లకు వెళ్లకుండా.. ఇప్పటికే నిర్మాణ పనులు చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్‌ సంస్థకే వాటి నిర్మాణ పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఇటీవల మెమో జారీ చేశారు. నవంబరు నుంచి కొత్త వాల్‌ నిర్మాణ పనులు చేస్తూనే.. దానిపై సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం కూడా కట్టడం వల్ల రెండు సీజన్లు కలిసొస్తాయని.. ఏడాదిన్నరలోనే ఈ రెండు కీలక నిర్మాణాలు పూర్తవుతాయని విశ్వసిస్తోంది. జలశక్తి శాఖ కూడా 2027 నాటికి పోలవరం తొలిదశ పూర్తికావాలని లక్ష్యం విధించింది. దీంతో, ఇప్పుడు కేంద్ర నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.

ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాలను బుధవారం కేంద్ర బృందం సందర్శించింది. వర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులను పరామర్శించింది.

ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాలను బుధవారం కేంద్ర బృందం సందర్శించింది. వర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులను పరామర్శించింది. బృందం సభ్యులు కల్నల్‌ కేపీ సింగ్‌, మహేష్‌ కుమార్‌, శాంతినాథ్‌ శివప్ప, ఎస్‌కే కుశ్వాహా, టి. నియాల్క్‌హాన్సన్‌, శ్రీ శివనాథన్‌రెడ్డి.. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల వల్ల, మున్నేరు, పాలేరు వరదల కారణంగా జరిగిన ఆస్తి, పంటల నష్టాన్ని పరిశీలించారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, ఖమ్మం రూరల్‌, తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఖమ్మం కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ పంట నష్టం వివరాలను కేంద్ర బృందానికి వివరించారు.

అనంతరం పొలాల్లో వేసిన ఇసుక మేటలను పరిశీలించిన బృంద సభ్యులు.. రైతులతో మాట్లాడారు. వరదల కారణంగా సర్వం కోల్పోయామని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో నష్టపోయిన పంటపొలాలను, జలదిగ్బంధమైన ఇళ్లను కేంద్ర బృంద సభ్యులు బుధవారం రాత్రి పరిశీలించారు. భారీ వరదలతో తన ఇల్లు, పొలం మునిగిపోయాయని, పశువులు, మేకలు, గొర్రెలు, విద్యుత్‌ మోటారు సైతం కొట్టుకుపోయాయని ఉల్లేపల్లి రైతు బంటు ఎల్లయ్య అధికారుల ముందు గోడును వెళ్లబోసుకున్నాడు.

సీతారాంతండాలో ఇస్లావత్‌ మంగీలాల్‌-కవిత దంపతులతో మాట్లాడి ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. అబ్బాయిపాలెం, గాలివారిగూడెం, పురుషోత్తమయగూడెంతో పాటు.. డోర్నకల్‌ మండలం ముల్కలపల్లిలోని ఎస్సీ కాలనీని సభ్యులు సందర్శించి, బాధితులతో మాట్లాడారు.

తమకు ఎత్తయిన ప్రదేశంలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధితులు ఈ సందర్భంగా మొర పెట్టుకున్నారు. కాగా, కేంద్ర బృందం గురువారం ఖమ్మంలోని మున్నేరు పరిసర ప్రాంతాల్లో పర్యటించనుంది.

యాదాద్రి థర్మల్‌లో నేడు మహత్తర ఘట్టం

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణంలో బుధవారం ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తోన్న ఈ పవర్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్‌ను బుధవారం సింక్రనైజేషన్‌ చేయనున్నారు. దాదాపు 72 గంటల పాటు విద్యుత్‌ ఉత్పాదన చేసిన తర్వాత ప్లాంట్‌ కమిషన్‌ కానుంది.

ఆ తర్వాత గ్రిడ్‌కు ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి చేసిన కరెంట్‌ను అందించనున్నారు. ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పాదన సజావుగా జరుగుతుందని నిర్ధారించుకున్న తర్వాత వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయన్తున్నట్లు(సీవోడీ-కమర్షియల్‌ ఆపరేషన్‌ డేట్‌) ప్రకటించనున్నారు.

రాష్ట్రంలో ఒకేచోట 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ ఇక్కడే ఉంది.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నారు. రెండో యూనిట్‌ సింక్రనైజేషన్‌ అనంతరం ప్లాంట్‌ నిర్మాణంపై సమీక్ష చేయనున్నారు.