చాకలి ఐలమ్మనే తెలంగాణ తల్లి, చాకలి ఐలమ్మ రూపాన్ని తెలంగాణ తల్లి విగ్రహా రూపంగా ప్రకటించాలి: ఎమ్ఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ
ఆత్మకూర్ (యం) మండల కేంద్రం లో చాకలి ఐలమ్మ 39 వ వర్థంతి సందర్బంగా గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘం పెద్దలు ,అఖిల పక్ష నాయకులు , ప్రజా సంఘాల నాయకులు , జర్నలిస్ట్ నాయకులు, ఉద్యోగులతో కలసి ఘనంగా నిర్వహించి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీయ పక్షాన ఎమ్మార్పీయస్ రాష్ట్ర నాయకులు - యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, పట్టణ నాయకులు గట్టు జ్ఞానేశ్వర్ మాదిగ లు భాగస్వామ్యం అయ్యి ఐలమ్మ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం ప్రత్యేకంగా మీడియా తో మాట్లాడుతూ ఎమ్మార్పీయస్ రాష్ట్ర నాయకులు - యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆధిపత్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని మోస్తూ భూమి కోసం,భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో దొరల గుండెల్లో సింహా స్వప్నమై నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ దొరలను గడీలనుంచి ఉరికించిన వీరవనిత, తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని,పోరాటాన్ని, భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలు, తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని,ఆత్మగౌరవాన్ని కాపాడిన ఈస్వరాష్ట్ర ఆకాంక్షకు ఆయుషు పోసిన తెలంగాణతల్లి చాకలి ఐలమ్మ నే అని అందుకే ఎమ్మార్పీయస్ సూత్రప్రాయంగా చాకలి ఐలమ్మ త్యాగాన్ని,పోరాటాన్ని గుర్తిస్తూ ఈ తరానికి తన చరిత్రను చాటిచెప్పేందుకు మొట్టమొదటి సారిగా ఐలమ్మ గారి రూపమే సరిగ్గా లేని తరుణంలో చరిత్ర విస్మరణకు గురై ఆమె భౌతికరూపం కనుమరుగైన స్థితిలో ఏరూపంలో ఉన్నదో ఎవ్వరికీ కూడా తెల్వని సమయంలో "ఐలమ్మ పోరాట రూపాన్ని" సమాజానికి పరిచయం చేసింది దండోర ఉద్యమమే అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆతల్లి స్ఫూర్తివంతమైన పాత్రను తెలియపరిచేలా 2003లొనే 'తల్లి తెలంగాణ' పుస్తకాన్ని రాసి చాకలి ఐలమ్మే మాకు తెలంగాణ తల్లి అని సగర్వంగా చాటిన చరిత్ర మందకృష్ణ మాదిగదే అని . మన మహానీయురాలి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించింది, సిద్ధాంతాపరంగా తల్లి రూపాన్ని పీడితవర్గాల ఆత్మగౌరవ చైతన్య పోరాట ప్రతీకగా భావిస్తూ దండోరోద్యమ ఫ్లెక్సీలో ఐలమ్మ గారి చిత్రపటాన్ని పెట్టుకొని స్ఫూర్తిని ఇచ్చిన సంఘం దండోరే అని అన్నారు. అన్నిరంగాల్లో వెనుకబడిన తెలంగాణకు, మట్టి,వెట్టి బ్రతుకులు బ్రతికిన తెలంగాణకు, పోరాటం, తిరుగుబాటు, చైతన్యం కల్గిన తెలంగాణకు ప్రతిరూపంగా పట్టు చీరలు,బంగారు నగలు, కిరీటాలు పెట్టుకున్న రూపంలో ఉన్న విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా చిత్రీకరించి బొమ్మలు పెట్టి కొలుస్తుంటే పట్టుచీరలు, బంగారు నగలు, కీరిటాలు పెట్టుకున్న దొరసాని కాదు తెలంగాణ తల్లి..దొరలను గడిలా నుంచి ఉరికించిన వీరనారి చాకలి ఐలమ్మే "తెలంగాణ తల్లి" అని సంచలనాత్మక ప్రకటనతో తల్లి త్యాగాన్ని ఆచరణాత్మకంగా అమలు పరిచిన ఘనత, రజకులను,అన్నివర్గాలను చైతన్యం చేస్తూ ఆమె జయంతి,వర్ధంతిలను నిర్వహించే స్పృహను కల్గచేసింది పలు డిమాండ్లను పెట్టి ఆమె జీవిత చరిత్రను అందరికి తెలిసేలా చేసింది ఎమ్మార్పియస్ పోరాటమే అని అందుకు చాకలి ఐలమ్మ ని ప్రస్తుత ప్రభుత్వం "తెలంగాణ తల్లిగా" ప్రకటించి గౌరవించాలని,చాకలి ఐలమ్మ రూపాన్నే తెలంగాణ తల్లీ రూపంగా ప్రజల ముందుకు అధికారికంగా తీసుకురావాలని అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి,వర్ధంతిలను అధికారికంగా అన్నీ గ్రామాల్లో నిర్వహిస్తూ ఆమె పోరాట చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసెలా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయాలని, ట్యాంక్ బండ్ పై ఐలమ్మ గారి విగ్రహాన్ని నెలకొల్పుతూ ఆమె చరితను తెలంగాణ పోరాట చరిత్రగా లిఖిస్తూ కీర్తించాలని అదే అసలైన నివాళి అని గుర్తుచేస్తున్నామని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ గారి ఆశయాలను కొనసాగిస్తాం అని ఆధిపత్యం,అణిచివేతలతో దొరల చేతుల్లో బందీగా మారిన తెలంగాణను విముక్తి చేసేందుకు దొరల గుండెల్లో సింహా స్వప్నమై నిలిచి తన ధైర్య సహసాలతో పోరాట పటిమతో దొరలను గడిల నుంచి ఉరికించిన చాకలి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకుంటాం.. అందుకు అణగారిన కులాలు ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తూ తెలంగాణలోని అన్నివర్గాలకు మేలు చేసే రాజ్యాన్ని ఆకాంక్షిస్తూ ఐలమ్మ త్యాగాన్ని స్మరిస్తూ..పోరాటాన్ని గుర్తుచేస్తూ సామాజిక ఉద్యమ జోహార్లు ప్రకటిస్తున్నాం..!! అని అన్నారు.
Sep 12 2024, 16:30