NLG: దేవరకొండ కు చేరిన SFI జిల్లా కమిటీ మోటార్ సైకిల్ పోరు యాత్ర
దేవరకొండ. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మోటార్ సైకిల్ పోరు యాత్ర మంగళవారం దేవరకొండ కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రంగంలో ఉండే హాస్టల్ విద్యార్థుల బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా హాస్టల్లో ఉండే విద్యార్థులు ఆరు బయట స్నానాలు చేయాలా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు కరువు అయ్యాయని అన్నారు.
సంక్షేమ హాస్టల్ లలో హెచ్ డబ్ల్యూఓ లు అందుబాటులో ఉండకుండా రూము లలో ఫ్యాన్స్ సౌకర్యాలు, త్రాగడానికి మంచినీరు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ చార్జీలు పెంచాలని సుమారు 5, 6 నెలలు బకాయి లో ఉన్న మెస్ చార్జీలు లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కొండ భీమనపల్లి లో వున్నా బిసి గురుకుల బాలుర పాఠశాల లో గురువులు లేరు. గత నాలుగు నెలలుగా సబ్జెక్టు సంబంధించిన ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదు , త్రాగడానికి మంచినీరు సరఫరా కూడా సరిగ్గా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.
దేవరకొండ ఆదర్శ పాఠశాల హాస్టల్ లో వుండే విద్యార్థీనిలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆదర్శ పాఠశాల కళాశాల హాస్టల్ విధ్యార్థీనీలు హాస్టల్లో ఏమైనా చిన్న చిన్న మైనర్ రిపేర్లు అయితే విద్యార్థినీలు అందరు డబ్బులు పోగేసి చేయిస్తున్నారు. ఆదర్శ పాఠశాల ఆవరణలో కోళ్ళ పారమ్ వుండడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల లో కుర్చోని శ్రద్ద గా పాఠాలు వినే పరిస్థితిలో లేదని యాత్ర దృష్టి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో హాస్టల్ విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. ఎస్సీ బాలుర హాస్టల్ లో 70 మంది విద్యార్థులు వుంటున్నారు. ఇందులో కేవలం ఒక్క పార్ట్ టైం వర్కర్ మాత్రమే వున్నారు.ఒకే హాస్టల్ వార్డెన్ నాలుగు ఐదు హాస్టళ్ల ఇన్చార్జి వుండడం వల్ల విద్యార్థులకు ఏమైనా సమస్యలు వస్తే తక్షణమే అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది.
గిరిజన గురుకుల పాఠశాలలో వాటర్ సమస్య, బాత్ రూమ్ కడిగే వారు లేరు. గురుకుల పాఠశాల విద్యార్థుల గోడు వినేది ఎవరిని అన్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో, గురుకులాల్లో, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ కొరబడిందని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో ఉండే పేద, మధ్యతరగతి విద్యార్థుల పక్షాన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ లు సమరశీల పోరాటాలకు పిలుపు నివ్వడం జరుగుతుంది హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రమావత్ లక్ష్మణ్ నాయక్, బుడిగ వేంకటేష్, రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య, జిల్లా ఆఫిస్ బేరర్స్ కుర్ర సైదా నాయక్, కొరె రమేష్, ముస్కు రవిందర్, స్పందన, పావని, జగన్ నాయక్, సంపత్ , రాకేష్, వీరన్న ,నవదీప్, కిరణ్, న్యూమాన్, ప్రవీణ్, ఇద్ది రాములు, సాయి, సిద్దు నవీన్, వర్షిత్, చందు, తదితరులు పాల్గొన్నారు.
Sep 04 2024, 17:59