NLG: జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్ష నిర్వహించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా, చండూరు:
అభివృద్ధి పనులు, సీజనల్ వ్యాదుల పై చండూరు ఆర్డీఓ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సెంటర్లో ఉండాలని ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని అన్నారు. ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను, అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో, మున్సిపాలిటీ లలో పాతబడిన డ్రైనేజీ లను గుర్తించి వాటిని పునర్ నిర్మించి మురుగునీరు సాఫీగా వెళ్ళేలా చూడాలని సూచించారు. వసతి గృహాలల్లో విద్యుత్ సర్క్యూట్ కాకుండా తగిన చర్యలు తీసుకుంటూనే విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతో 197 కోట్లు విద్యుత్ శాఖ కు మంజూరయ్యాయని విద్యుత్ అధికారులు తెలపడంతో.. ప్రియారిటీ ఆఫ్ లిస్టు ప్రకారం విద్యుత్ పనులు చేయాలని, చండూరు లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు డెడికేటెడ్ గా ఒక ట్రాన్స్ఫార్మర్ ని పెట్టాలని అధికారులను ఆదేశించారు. చండూరు రెవెన్యూ డివిజన్ అయిన సందర్భంగా ఆర్డిఓ ఎమ్మార్వో ఎంపీడీవో ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని.. ప్రతి ప్రభుత్వ నిర్మాణం భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని అధికారులను కోరారు.ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Sep 03 2024, 20:52