భువనగిరి: సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు, పట్టించుకోని పాలకులు: సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ
హన్మాపురం గ్రామంలోరాత్రిపూట వీధిలైట్లు లేక చిమ్మ చీకటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడికక్కడ గడ్డి పెరిగి దోమలతో విష జ్వరాలతో ఇబ్బందులు పడుతూ, తాగడానికి కూడా సరైన నీరు రాక సమస్యలు వినే నాథుడు లేక పట్టించుకునే అధికారులు లేక గ్రామపంచాయతీ పాలన ముగిసి ఇంచార్జి పాలనతో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ ఆవేదన వెలిబుచ్చారు. సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో వార్డు వార్డు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ పాలక వర్గం లేకపోవడంతో ప్రజా సమస్యలను పట్టించుకోని నాధుడే లేకుండా పోయాడని గ్రామంలో ఎక్కడ చూసిన సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో మంచినీళ్ల సమస్య, వీధిలైట్ల సమస్య, దోమల బెడద, రోడ్లు, డ్రైనేజీ లాంటివి పెద్ద ఎత్తున ఉన్నాయని వాటిని తీర్చడానికి వెంటనే గ్రామ సభ సమావేశాన్ని నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారి కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా తాను ఇచ్చిన హామీలలో ముఖ్యమైనవి ఇల్లు స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు తక్షణం లేని వారందరికీ ఇవ్వాలని, భూమిలేని పేదలందరికీ కూడా ఆర్థిక సహాయం అందిస్తానన్న ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుని అమలు చేయాలని కోరారు. గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వారం రోజుల లోపు అధికారులు చర్యలు తీసుకోకపోతే సిపిఎం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ముందు ఆందోళన చేపడతామని నర్సింహ హెచ్చరించారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మోటె ఎల్లయ్య, నాయకులు రాగాల రాజేశ్వర్, తోటకూరి నాగరాజు, కుసుమ మధు, గ్రామ ప్రజలు రంగా నారాయణ, చందుపట్ల మల్లయ్య, మూడుగుల ఎల్లయ్య, తుమ్మేటి అంజయ్య, బుచ్చాల కొండలు, మూడుగుల నరసింహ, నాయిని బాలయ్య, శ్రీను, నరసింహ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు దయ్యాల నర్సింహ్మ సిపిఎం మండల కార్యదర్శి
Jul 07 2024, 18:40