/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz Hyderabad: తొమ్మిది మందికి ప్రొబేషనరీ ఐఏఎ్‌సల హోదా.. Raghu ram reddy
Hyderabad: తొమ్మిది మందికి ప్రొబేషనరీ ఐఏఎ్‌సల హోదా..

రాష్ట్రంలోని తొమ్మిది మంది జూనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రొబేషనరీ హోదా’ కల్పించింది. ఈమేరకు వారి సర్వీసులను కన్ఫర్మ్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా విజ్ఞప్తులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అండర్‌ సెక్రటరీ భూపిందర్‌ పాల్‌ సింగ్‌ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.

రాష్ట్రంలోని తొమ్మిది మంది జూనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రొబేషనరీ హోదా’ కల్పించింది. ఈమేరకు వారి సర్వీసులను కన్ఫర్మ్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా విజ్ఞప్తులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అండర్‌ సెక్రటరీ భూపిందర్‌ పాల్‌ సింగ్‌ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. వీరి సర్వీసులను కన్ఫర్మ్‌ చేస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు.

ఇందులో 2020 బ్యాచ్‌కు చెందిన కధిరవన్‌ పలని ఉండగా, మిగతా ఎనిమిది మంది 2021 బ్యాచ్‌కు చెందినవారున్నారు. కధిరవన్‌ పలనికి 2023 సంవత్సరం అక్టోబరు 7 నుంచి ప్రొబేషనరీ ఐఏఎ్‌సగా కన్ఫర్మేషన్‌ ఇవ్వగా.. 2021 బ్యాచ్‌కు చెందిన శివేంద్ర ప్రతాప్‌, సంచిత్‌ గాంగ్వార్‌, ఫైజాన్‌ అహ్మద్‌, లెనిన్‌ వత్సల్‌ టొప్పో, పి.గౌతమి, పర్మర్‌ పింకేశ్‌కుమార్‌ లలిత్‌కుమార్‌, రాధికా గుప్తా, పి.శ్రీజలకు 2023 సంవత్సరం డిసెంబరు 5 నుంచి కన్ఫర్మేషన్‌ ఇచ్చారు

వీరంతా ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా పని చేస్తున్నారు. అసోం క్యాడర్‌కు చెందిన సంచిత్‌ గాంగ్వార్‌ను 2022 సంవత్సరం డిసెంబరు 23న తెలంగాణ క్యాడర్‌కు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వీరితో పాటు త్రిపుర రాష్ట్రానికి చెందిన మరో ఐదుగురు ఐఏఎ్‌సలకూ కేంద్రం ప్రొబేషనరీ హోదా కల్పించింది. ఈ హోదా రావడంతో వీరంతా ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రెవెన్యూ డివిజన్లకు సబ్‌-కలెక్టర్లుగా పనిచేసే అవకాశం ఉంటుంది.

నా వాళ్లు నలుగురు.. అయితే మా వాళ్లు ఇద్దరు

మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాల కోసం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి నలుగురి పేర్లను హైకమాండ్‌కు ప్రపోజ్‌ చేసినట్లు సమచారం.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ వీడటం లేదు. నేతల మధ్య సమన్వయం కొరవడటంతో కేబినెట్ బెర్తుల ఖరారులో జాప్యం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న 6 స్థానాలను భర్తీ చేయడంపై నేతలంతా దృష్టి సారించారు. గడిచిన 3 రోజులుగా సీఎం సహా కీలక మంత్రులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలతో సమావేశమయ్యారు. ఈ భేటీల్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించడంతో పాటు, కొన్ని పేర్లపై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయా పేర్లపై రాష్ట్ర సీనియర్‌ మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేబినెట్‌ విస్తరణ జాప్యం అవుతోంది. అంతా ఓ క్లారిటీ వచ్చి, చర్చించుకుని మరోసారి ఢిల్లీకి వస్తే ఫైనల్ లిస్టు ప్రకటిద్దామని అధిష్టానం చెప్పినట్లు సమాచారం.

మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాల కోసం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి నలుగురి పేర్లను హైకమాండ్‌కు ప్రపోజ్‌ చేసినట్లు సమచారం. మంత్రివర్గంలో ప్రాధాన్యం లేని నిజామాబాద్‌ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డిని, ముదిరాజ్‌ సామాజికవర్గం నుంచి వాకిటి శ్రీహరిని, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్‌ని, మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ పేర్లను సూచించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో ఇద్దరి పేర్లు సూచించినట్లు తెలిసింది.

రెడ్డి సామాజికవర్గం నుంచి రేసులో రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేతలంతా ఢిల్లీలోనే ఉండి సీఎం రేవంత్‌రెడ్డితో గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు.

వివేక్ వెంకటస్వామి, ప్రేమ్‌సాగర్‌రావు, బాలు నాయక్‌, షబ్బీర్‌ అలీ రేసులో ఉన్నారు. ఒకే జిల్లా కావడంతో వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావులో ఒకరికే ఛాన్స్ ఉండనుంది. అంతా ఒక్కతాటిపైకి వస్తే శ్రావణమాసంలోనే కేబినెట్‌ విస్తరణ ఉండే ఛాన్స్.

ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్! మరో ఏడాది పొడిగింపు..!

ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. గత వైసీపీ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో వారికి అన్ని విషయాల్లోనూ మేలు జరిగేలా ఒక్కో నిర్ణయం వెలువరిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే రాష్ట్ర స్ధాయి ఉద్యోగులకు మాత్రమే వర్తించేలా ఈ నిర్ణయం ఉంది.

రాష్ట్రానికి రాజధానిగా 2015లో అమరావతిని ఎంపిక చేసిన తర్వాత విభజిత రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరిగేందుకు వీలుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాల నిబంధన కూడా ఒకటి. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే వీరు పనిచేసేలా వెసులుబాటు ఇచ్చారు.

దీన్ని అప్పటి టీడీపీ సర్కార్ తో పాటు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది. దీని గడువు ఇవాళ్టితో ముగిసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం పొడిగిస్తూ సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్, హెచ్ ఓడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు పొడిగించేలా ఇచ్చే ఉత్తర్వులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇవాల్టితో వారానికి ఐదు రోజుల పనిదినాల నిబంధన గడువు ముగుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఈరోజు లేదా రేపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో సీఎం చంద్రబాబు కు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.

KTR | సాగునీటి రంగంలో కేసీఆర్ కృషికి సీతారామ ప్రాజెక్టు మ‌రో నిద‌ర్శ‌నం.. కేటీఆర్ ట్వీట్


KTR | సాగునీటి రంగంలో తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషికి సీతారామ ప్రాజెక్టు మ‌రో నిద‌ర్శ‌న‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

KTR | హైద‌రాబాద్ : సాగునీటి రంగంలో తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషికి సీతారామ ప్రాజెక్టు మ‌రో నిద‌ర్శ‌న‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఖ‌మ్మం, కొత్త‌గూడెం జిల్లాల ప‌రిధిలోని 10 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుంద‌ని ఆయ‌న తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ట్ర‌య‌ల్ ర‌న్ విజ‌య‌వంతం కావ‌డంతో.. ఇంజినీర్లు, బ్యూరోక్రాట్లు, ఏజెన్సీలు, ప్రజాప్ర‌తినిధుల‌కు కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

కాగా, సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయలాంటిదని గతంలోనే కేసీఆర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

అంతేకాదు చెప్పినట్లుగానే ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. సీతారామ పనులు కేసీఆర్‌ హయాంలోనే 70శాతం పనులు పూర్తయ్యాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ. 17 వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.

Harish Rao: రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారు?

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మను చౌదరి,మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు.

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది.

జిల్లా కలెక్టర్ మను చౌదరి,మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు. రైతు భరోసా విధివిధానాలు ఏమిటని అడిగారు. రైతు బందు పంట అయ్యాక ఇస్తారా?.. పంట ముందు ఇస్తారా? అంటూ హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాను పదవ తరగతి ఫలితాల్లో రెండవ స్థానంలో నిలిపినందుకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.

నాలుగు నెలల మధ్యాహ్నం భోజన కార్మికులకు జీతాలు వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులకు ఒక్క జత బట్టలు మాత్రమే ఇచ్చారు. రెండవ జత బట్టలు అన్ని జిల్లాలకు ఇచ్చినట్లు సిద్దిపేట జిల్లకు వెంటనే ఇవ్వాలి. మన ఊరు మన బడి మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వాలి. ఉపాధి హామీ పథకంలో సీసీ రోడ్ పోసిన కాంట్రాక్టర్‌లకు 7నెలల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల ఆసరా పెన్షన్‌లు రాలేదు.

సకాలంలో పెన్షన్ రాక వృద్దులు ఇబ్బంది పడుతున్నారు. కాళేశ్వరం కాలువలలో మట్టి పడి నీటి విడుదలలో ఇబ్బంది ఉంది కనుక వాటిని శుద్ధి చేయాలి. ఆరు నెలల్లో గ్రామపంచాయితీలకు రూపాయి రాలేదు. మహిళ ప్రాంగణం, వృద్ధాశ్రమం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ వాడుకలోకి తీసుకురావాలి. సఖి సెంటర్ సిబ్బందికి 7నెలలుగా వేతనాలు రాలేదు’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.

జై పాలస్తీనా..! ఒవైసీ నినాదంతో కొత్త రగడ… తప్పొప్పులపై చర్చ

ఈసారే ఈ విపరీత ధోరణి విపరీతంగా కనిపించింది… లోకసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రకరకాల నినాదాలు చేశారు సభ్యులు… రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగ ప్రతిని అందరికీ చూపిస్తూ ప్రమాణం చేసి, చివరలో జై సంవిధాన్ అన్నాడు… దాన్ని అభ్యంతరపెట్టాల్సిన అవసరం లేదు… కానీ.

ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని అక్కడ ప్రదర్శించాల్సిన అవసరమేముంది.

బీజేపీ నాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ (50 ఏళ్లయిన సందర్భంగా) ని తిట్టిపోస్తోంది… స్పీకర్ కూడా తన ప్రసంగంలో నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించి కాంగ్రెస్ ను తిట్టిపోసాడు… మోడీ మెచ్చాడు… అసలు మోడీయే పెద్ద నియంత, తను రాజ్యాంగాన్ని మార్చేస్తాడు అంటూ ఇండి కూటమి కౌంటర్ చేస్తోంది… ఈ రాజకీయ సమరం, వాగ్వాదాలు, వ్యూహాలు ప్రమాణస్వీకారాలను ప్రభావితం చేయడం బాగోలేదు…

పార్లమెంటులో ప్రమాణస్వీకారాలు కూడా ఓ రాజకీయ సభలాగా తలపించడం సరికాదనిపిస్తుంది… నవ్వులపాలు చేస్తున్నారు… చాలామంది అసలు మాతృభాషలోనే స్పష్టంగా పదాల్ని పలుకుతూ పలకలేరు… తడబడతారు… ఇంగ్లిషులోనే కాదు, తమకు అలవాటైన మాతృభాషలోనూ పదాల్ని పలకలేకపోగా, ఈ నినాదాలు… ప్రమాణ స్వీకారానికి వస్తున్నప్పుడు ఇంట్లో కాస్త రిహార్సల్ వేసుకుని వేస్తే ఏం నష్టం.

తమ గౌరవాన్ని, తమ పార్టీ గౌరవాన్ని, సభ గౌరవాన్ని కాపాడాలి కదా… మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు మరీ కంట్రవర్సీని క్రియేట్ చేశాయి… జై పాలస్తీనా అన్నాడు… తనను తాను కోట్లాది ముస్లింల గొంతుగా ప్రదర్శించుకోవడం..! కానీ భారత దేశ సార్వభౌమాధికారానికి వేదికవంటి పార్లమెంటులో జరిగే ఈ రాజ్యాంగ బద్ధ ప్రమాణ స్వీకారాల కార్యక్రమాన్ని దానికి ఎంచుకోవడం దేనికి..? అక్కడ వేరే దేశానికి జై కొట్టడం ఏమిటి.

సరే, పాలస్తీనాకు సంఘీభావం, మద్దతు ప్రకటించదలుచుకుంటే అది బయట ప్రసంగాల్లో, ఇతర కార్యక్రమాల్లో చేసుకోవచ్చు… దాన్ని ఎవరూ అభ్యంతరపెట్టరు… ఇక రేప్పొద్దున అందరికీ ఇదే అలవాటై, ఇంకెవరో జై ఇజ్రాయిల్ అంటే..? మరెవరో జై చైనా అంటే.. ఇది ఎక్కడి దాకా.. ఈ దేశ పార్లమెంటులో ఇతర దేశాలకు జేజేలు ఏమిటి..

నిజానికి తాము చదవాల్సిన ఫార్మాట్‌ను చదివేసి, స్పీకర్‌కు ఓ దండం పెట్టి వేదిక దిగిపోతుంటారు చాలామంది… ఓవరాక్షన్ అసలు ఉండదు… కొందరు జైహింద్ అంటారు చివరలో… అది మతాన్ని సూచించేది కాదు, హిందుస్థాన్‌ అని మన దేశాన్ని సూచించేది, ఈ దేశం పట్ల విధేయతను ప్రకటించేది… కాకపోతే కొందరు సభ్యులు తమ ప్రాంతాన్ని సూచించేలా ఏరియా స్పెసిఫిక్ దుస్తుల్లో, వాళ్ల మాతృభాషలో ప్రమాణం చేయడానికి ఇష్టపడతారు… మనవాళ్లు ధోవతులు, తలపాగాలు ధరించినట్టు

సరే, ఒవైసీ దగ్గరకొద్దాం… తన జై పాలస్తీనా నినాదాన్ని సమర్థించేవారికీ కొదువ లేదు… తప్పేముంది..? ఇజ్రాయిల్ దురహంకారాన్ని, దాడుల్ని వ్యతిరేకించడానికి ఆ వేదికను వాడుకున్నాడు, అందులో అభ్యంతరపెట్టాల్సింది ఏముందనేది వారి వాదన… కానీ ఇది పార్లమెంటరీ రూల్స్, సంప్రదాయాలకు వ్యతిరేకం కాబట్టి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 102డీ స్పూర్తికి కూడా వ్యతిరేకం కాబట్టి ఒవైసీని సభ నుంచి బయటికి పంపించాల్సిందే అంటూ కొందరు లాయర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు…

ఆర్టికల్ 102డీ ప్రకారం ఒవైసీ నినాదం తప్పు, పార్లమెంటరీ సంప్రదాయాల ఉల్లంఘన అనేది వారి వాదన సారాంశం… సరే, రాష్ట్రపతి ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా మోడీ అండ్ కో సూచనలే ఆధారం అవుతాయి… ఒవైసీ రాజకీయంగా బీజేపీ హైకమాండ్‌కు పరోక్షంగా రాజకీయ మిత్రుడే గానీ ప్రత్యర్థి కాదనే ప్రచారం చాన్నాళ్లుగా ఉన్నదే కదా… ఆ తెర వెనుక రాజకీయాలు ఎలా ఉన్నా, ఒవైసీ విషయంలో మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవచ్చు… పైగా 102డీ ప్రకారం వేరే దేశానికి విధేయత ప్రకటిస్తే అనర్హత వేటు ఉంటుంది…

కానీ ఇక్కడ ఒవైసీ పాలస్తీనాకు విధేయతను ప్రకటించలేదు… అది పాలస్తీనాకు మద్దతు, సంఘీభావం… ఆ రెండింటి నడుమ తేడా ఉంది… అయితే బీజేపీ సభ్యులు వ్యతిరేకించడంతో ఒవైసీ నినాదాలను ప్రొటెం స్పీకర్ రికార్డుల నుంచి ఆల్రెడీ తొలగించాడు… ఇక తదుపరి చర్యలు ఏమీ ఉండకపోవచ్చు… మన ఒవైసీయే కదా…! పైగా దీని మీద దేశం మొత్తమ్మీద ఓ చర్చ జరగడం, ఇండి కూటమికి మరో అవకాశం ఇవ్వడం మోడీ సర్కారుకు ఇష్టం ఉండకపోవచ్చు కాబట్టి

చివరలో… సరదాగా…. అవునూ, ఒవైసీ మీద నిజంగానే అనర్హత వేటు వేస్తే ఇక మళ్లీ హైదరాబాద్ పాతబస్తీలో మాధవీలత మళ్లీ ప్రచారరంగంలోకి అడుగుపెట్టాల్సిందేనా..? అప్పుడిక అక్బరుద్దీన్ ఒవైసీ మజ్లిస్ అభ్యర్థి అవుతాడా.

ఆగని రైల్వే ప్రమాదాలు - ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు.

డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో పలువురు సిబ్బంది, ప్రయాణికుల మరణం, గాయాల పాలవడం బాధాకరం.

ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ విఫలం, పరస్పర విరుద్ధమైన నిబంధనలు, కవచ్‌ రక్షణ వ్యవస్థ లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలు.

రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

రైల్వేలో 3,15,780 సాంక్షనై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయండి.

బడ్జెట్ లో కోతలు, చార్జీల పెంపు, స్లీపర్ కోచ్ ల తగ్గింపు, రైళ్ళలో రద్దీ, జాప్యం, రాయితీల ఎత్తివేత, శానిటేషన్, పార్కింగ్ దోపిడీ తదితర సమస్యలను పరిష్కరించండి.

కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలి. భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలి.

రైలు ప్రమాదాలపై, భద్రతా చర్యల అమలుపై సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో స్వతంత్ర విచారణ జరిపించాలి.

 జూన్ 2023లో అత్యంత ఘోరమైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 296 మంది మరణించి 1100 మందికి పైగా గాయపడిన ఘటన మరువక ముందే దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు దుర్ఘటనలను ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి తాజాగా వ్రాసిన లేఖలో పేర్కొంటూ భద్రతా లోపాలను ఎత్తి చూపారు. నిర్వహణా లోపాలు కారణంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాక్ లపై ఒత్తిడి పెరుగుతుందని, భద్రతా చర్యలు చేపట్టడం లేదని, ఒడిషా రైలు ప్రమాదం నుండి తేరుకోకముందే 40 ప్రమాదాలు జరిగాయని వివరించారు. జూన్ 17 న 11 మంది మృతికి దారితీసిన కాంచన్‌జంగ ప్రమాదానికి కూడా ఆటోమేటిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ పని చేయకపోవడం, పరస్పర విరుద్ధమైన నిబంధనల మూలంగా నెలకొన్న గందరగోళం, కవచ్‌ రక్షణ వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణాలని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ), దాని అనుబంధ గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వే ప్రమోటీ ఆఫీసర్స్ ఫెడరేషన్ (ఐఆర్ పిఓఎఫ్) తదితరులు పలుమార్లు వివిధ అంశాలపై సమర్పించిన వినతి పత్రాలను, కాగ్ తదితర నివేదికలను జత చేశారు. రైల్వే భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించాలని, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎమ్ఎస్) పేరిట ప్రవేశపెట్టిన స్కీం పట్ల పునరాలోచన చేయాలని కోరారు.

ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలో సిగ్నల్‌ విఫలమైన సమయాల్లో రైళ్ళ నిర్వహణకు సంబంధించిన నిబంధనలు గందరగోళంగా ఉన్నాయని, ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిస్టమ్స్‌ ఇన్‌ జనరల్‌ అండ్‌ సబ్సిడరీ రూల్స్‌ 9వ అధ్యాయంలో పేర్కొన్న నిబంధనలు పరస్పర విరుద్ధంగా వున్నాయని, వాటిని నిశితంగా సమీక్షించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. సిగ్నల్‌ విఫలమైనపుడు స్టేషన్‌ మాస్టర్లు జారీ చేసే ట్రావెల్‌ అథారిటీ టిఎ-912 రెడ్‌ సిగ్నల్‌ పడినా దాటేందుకు లోకో పైలెట్లకు అనుమతినిస్తుందని, దాన్ని నిషేధిస్తున్నట్లు తూర్పు రైల్వే ఆదేశాలు జారీ చేసి ఆ మరుసటి రోజే పొరపాటున జారీ చేసామని ఆ ఆదేశాలను ఉపసంహరించుకున్నారని తెలిపారు. స్టాండర్ట్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌ఓపి)పై జోనల్‌ రైల్వేస్‌లో అయోమయం, గందరగోళం వుంటొందని, సిగ్నల్‌ వైఫల్యం తదితర పరిస్థితుల్లో అమలు చేయాల్సిన రైళ్ళ నిర్వహణా ప్రొటోకాల్స్‌లో గందరగోళానికి కారణమవుతోందని వాపోయారు.

2011-12 లో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ 'కవచ్' నెలకొల్పక పోవడం, సిగ్నలింగ్ టెలీ కమ్యూనికేషన్ కింద కేటాయించిన బడ్జెట్లో అత్యధికంగా ట్రాఫిక్ ఉన్న రైల్వే మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్, సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్ తదితరములకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయక పోవడం, రైల్వే లైన్లు, సిగ్నల్ వ్యవస్థ, ట్రాకుల ఆధునీకరణ చేపట్టకపోవడం శోచనీయమన్నారు.

భద్రతా చర్యల బలోపేతంలో తాత్సారం తగదని, కృత్రిమ మేధస్సు (ఏఐ) ను సిబ్బంది తొలగింపుకు, పోస్టుల రద్దుకు వినియోగించే బదులు విస్తృతంగా స్టేషన్ డేటా లాగర్ల, లోకోమోటివ్ లలోని మైక్రో ప్రాసెసర్ల డిజిటల్ డేటాను తక్షణమే విశ్లేషించి ప్రమాదాలను నివారించాలని, నిధుల కేటాయింపును పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపాధి అవకాశాలను నాశనం చేసేందుకు కాక ప్రమాద రహిత భద్రమైన రైల్వే వ్యవస్థకై వినియోగించాలని కోరారు. ఒకవేళ దేశవ్యాప్తంగా కవచ్ ను వెంటనే ఏర్పాటు చేయలేనట్లైతే ఈటీసీఎస్ లెవెల్ 3 ని కాకపోయినా కనీసం లెవెల్ 2 ను వినియోగించాలని విన్నవించారు.

ట్రైన్ ప్రొటక్షన్ & వార్నింగ్ సిస్టం ( టీపీడబ్లూఎస్) రిపేరుకు సాధ్యంకాని విధంగా వైఫల్యం చెందడంతో గత సంవత్సరంలోనే ఉత్తర రైల్వే స్పీడును తగ్గించాలని చేసిన ప్రతిపాదన బోర్డు వద్దే పెండింగ్ లో నున్నదని, జూన్ 25న నార్త్ సెంట్రల్ రైల్వే కూడా రైళ్ళ వేగాన్ని తగ్గించాలని ప్రతిపాదించిందని, దేశవ్యాప్తంగా రైల్వే ట్రాకులు 130 కి.మీ స్పీడుని మించి తట్టుకోలేవని పేర్కొన్నారు.

68 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ లో గత దశాబ్దంలో కేవలం రెండు శాతం (1,465 కి.మీ) రూటు లోనే, 15,200 డీజిల్ , విద్యుత్ లోకో లలో ఒక శాతం కన్నా తక్కువ (139) ఇంజన్లలోనే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటక్షన్ (ఏటీపీ) కవచ్ అమలు జరిగిందని, సాలీనా 2శాతం రైల్వే కాపెక్స్ తో అన్ని ఇంజన్లు, ట్రాక్ లలో కవచ్ 4.0ను ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.

కనీస అవసరాలకు ప్రాధాన్యత నివ్వకుండా, సాధారణ ప్రయాణికుడిని విస్మరిస్తూ ఆదాయాన్ని గడిస్తున్న రైల్వే శాఖలో 3.11 లక్షల గ్రూప్ సి పోస్టులు, 3,018 గెజిటెడ్ క్యాడర్ సాంక్షన్ అయిన పోస్టులు ఖాళీగా వున్నా భర్తీకి నోచుకోకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై తీవ్రమైన పనిభారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో చాలా మంది మహిళా లోకో పైలట్లు, ఇతర సిబ్బంది రోజుకు 12 గంటలకు మించి సెలవు, విశ్రాంతి లేకుండా నిద్రలేమి, బిజీ షెడ్యూల్స్ తో పని చేస్తున్నారని తెలిపారు. రైల్వేలో పని చేస్తున్న సుమారు 8 లక్షల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు కనీస వేతనాలు, సురక్షిత పని పరిస్థితులు, చట్టబద్ద హక్కులు కోల్పోయారని, ప్రశ్నిస్తే తొలిగింపులు, సస్పెషన్లు, బదిలీలు, శిక్షలు వంటి సమస్యల మధ్య రైల్వే సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించి ఆర్ఆర్ బి దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల సంఖ్యను 5,696 నుండి 18,799 కు పెంచి భర్తీ చేయాలని నిర్ణయించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సరెండర్ చేసిన, రద్దైన పోస్టులు పోను రైల్వేలో ఏళ్ళ తరబడి ఖాళీగా ఉన్న 2,74,580 పోస్టులను వికేంద్రీకరించి భర్తీ చేయాలని కోరారు. కనీసం సేఫ్టీ కేటగిరీలోని 1,52,734 ఖాళీలను యుద్ధప్రాతిపదికన జోనల్ స్థాయిలో పూరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ వాదనలు దాని స్వంత ఆడిటర్‌ అయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. రైలు భద్రతపై కాగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు తగ్గిందనీ, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించడం లేదని పేర్కొన్నది. 2017-2021 మధ్య జరిగిన రైల్వే ప్రమాదాలపై కాగ్‌ విశ్లేషణ ప్రకారం.. ఈ కాలంలో మొత్తం 2017 ప్రమాదాలు జరిగాయి. అందులో పట్టాలు తప్పినవి 1392 ప్రమాదాలు (69 శాతం). అంటే పట్టాలు తప్పి ఢీ కొనటం వంటి రైల్వే ప్రమాదాలే అధికంగా ఉండటం గమనార్హం. అయితే ఈ ప్రమాదాలకు కారణం ‘మానవ తప్పిదం’ అని నిందించటం ఏండ్లుగా ఒక సాధారణ ధోరణిగా మారిందనీ, అయితే కాగ్‌ నివేదిక ప్రభుత్వ వాదనలు తప్పని నిరూపిస్తున్నదని తెలిపారు.

ట్రాక్ ల నిర్వహణ, బడ్జెట్ కేటాయింపులు, వ్యయం, పోస్టుల ఖాళీలపై కేంద్రానిది తీవ్ర నిర్లక్ష్యమని కాగ్ 2022 సెప్టెంబర్ నివేదికలో అక్షింతలు వేసినా, రైలు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా, లోపాలు ప్రస్తావించినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

2017-18లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ రైల్‌ సంరక్ష కోష్‌ (ఆర్‌ఆర్‌ఎస్‌కే) రైల్వే భద్రతా నిధి గురించి కాగ్‌ ఉటంకించింది. 1127 పట్టాలు తప్పగా 289 (26 శాతం) మాత్రమే పునరుద్ధరణ పనులకు నోచుకున్నాయని వివరించింది. ఆర్‌ఆర్‌ఎస్‌కే నుంచి ప్రాధాన్యత-1 పనులపై మొత్తం వ్యయం 2017-18లో 81.55 శాతం నుంచి 2019-20లో 73.76 శాతానికి తగ్గుదల ధోరణిని చూపించిందని పేర్కొన్నది. ట్రాక్‌ పునరుద్ధరణ పనులకు 2018-19లో నిధుల కేటాయింపు రూ.9607.65 కోట్ల నుంచి 2019-20లో రూ.7417 కోట్లకు తగ్గిందని కాగ్‌ వివరించింది. అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ రైల్వే కోసం 2019-20లో మొత్తం వ్యయంలో ట్రాక్‌ పునరుద్ధరణ కోసం ఖర్చు చేసినది 3.01 శాతమే కావటం గమనార్హం. భద్రతకు సంబంధించిన పనులకు ఆర్థిక సాయం అందించటానికి ప్రత్యేక నిధిని సృష్టించే ఏకైక ఉద్దేశ్యం విజయం సాధించ లేకపోయిందని కాగ్‌ పేర్కొన్నది. పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం ట్రాక్‌ నిర్వహణ అని వివరించింది. భారత రైల్వే లక్షలాది ఖాళీలతో, నామ మాత్రపు అవుట్‌సోర్సింగ్‌తో కార్యకలాపాలను నిర్వహించిందని కాగ్‌ వెల్లడించింది.

ట్రాక్ ల సమర్థవంతమైన నిర్వహణ, సిగ్నలింగ్ వ్యవస్థ, రోలింగ్ స్టాక్ మొదలైన వాటితో పాటు తగిన సంఖ్యలో నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించడం మరియు అన్నింటికంటే ముఖ్యంగా రైల్వే ఆపరేషన్ యొక్క వివిధ విధుల మధ్య సమర్థవంతమైన సమన్వయంపై ఆధారపడి ఉంటాయి. వీటన్నింటినీ నిర్లక్ష్యం చేయబడ్డాయని తెలిపారు. 2017 లో సమర్పించిన భద్రతపై టాస్క్ ఫోర్స్ సిఫార్సులను, 2015 లో రైల్వే మంత్రిత్వ శాఖ 'శ్వేతపత్రం'ను అమలు చేయలేదు. పాత ట్రాక్ ను యుధ్ధ ప్రాతిపదికన మార్చాల్సి ఉంటుందని, కానీ ఆర్థిక వనరులు లేమి సాకుతో చేయకపోవడంతో బ్యాక్ లాగ్ పెరుగుతూనే ఉన్నదని, అదే సాకుతో పాతబడి పోయిన సిగ్నల్ గేర్ ను కూడా మార్చటం లేదని అన్నారు.

రైల్వేలు ప్రజల ఆస్తియని,మన ప్రజల సొమ్ముతో భారత కార్మికుల కష్టాలతో భారతీయ రైల్వేలు నిర్మించబడ్డాయని పేర్కొన్నారు. రైళ్ళు, రోడ్లు సామాన్య ప్రజలకు సరసమైన రవాణాను అందించడానికి ఉద్దేశించబడినవని, ఇవి ఏ ప్రభుత్వమైనా తన పౌరులకు సరసమైన ధరలకు భద్రతతో అందించాల్సిన సేవలని గుర్తు చేశారు. ప్రైవేటు కార్పొరేట్లకు లాభాలను ఆర్జించే మార్గాన్ని సృష్టించేందుకు భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించవద్దని కోరారు.

 రైళ్ళు ప్రయాణించే ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ వ్యవస్థను నియంత్రించే ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థలో పొరపాటు కారణంగా బాలాసోర్ ప్రమాదం జరిగిందని రైల్వేబోర్డు, రైల్వే మంత్రి పేర్కొన్నారు. 2017-21 మధ్య కాలంలో రైల్వేస్‌లో రైళ్ళు పట్టాలు తప్పిన ఘటనలపై కాగ్‌ ఇచ్చిన నివేదిక వ్యవస్థలో ఉన్న కొన్ని ప్రమాదకరమైన లోపాలను ప్రముఖంగా ఎత్తిచూపింది. రైల్వే ట్రాక్‌ల్లో నిర్మాణపరమైన లోపాలను, అలాగే పాయింట్లు, లైన్లు, కర్వ్‌లు వంటి అంశాలను తనిఖీ చేసి అంచనా వేసే ట్రాక్‌ రికార్డింగ్‌ కార్ల సోదాలు 30-100 శాతం తగ్గాయని ఆ నివేదిక పేర్కొంది. పట్టాలు తప్పిన 1129 ఘటనల్లో 422 ఘటనలు ఇంజనీరింగ్‌ సమస్యలు (ట్రాక్‌ల నిర్వహణ సరిగా లేక పోవడం (171 కేసులు), ట్రాక్‌ ప్రామాణికాలు పాటించకపోవడం (156 కేసులు) వల్లే జరిగాయని పేర్కొంది. బోగీల చక్రాల్లో లోపాల వల్ల జరిగిన ప్రమాదాలు 182 ఉండగా, పాయింట్లు సరిగా నిర్దేశించక పోవడం, ఇతర పొరపాట్ల కారణంగా 275 ప్రమాదాలు జరిగాయని నివేదిక పేర్కొంది. గడిచిన పదేళ్లలో రైలు ప్రమాదాల్లో 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 70 శాతం మంది 2017- 21 మధ్య కాలంలో మరణించారని పేర్కొన్నారు.

ప్రారంభించిన రైలునే అట్టహాసంగా మళ్ళీ ప్రారంభించే బదులు సామాన్యులు ప్రయాణించే రైళ్ల బాగోగులు పట్టించుకోవాలని, కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణే అన్నింటికీ పరిష్కారం అనే మానసిక స్థితి నుండి బయటపడి వాస్తవాలను ఆలోచించి ప్రజల భద్రతకు ఏం చేయాలో తెలుసుకుని ఇప్పటికైనా పూనుకోవాలని, దుఃఖితులకు ఓదార్పునివ్వాలని కోరారు. ప్రతి వందేభారత్ కోసం రైల్వే రూ. 115 కోట్లు పైగా వెచ్చిస్తున్నదని, 2027 తర్వాత ప్రారంభమయ్యే బుల్లెట్ ట్రైన్ వంటి అసాధారణ రేట్లుండే రైళ్ళతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగేదేముంటుందని ప్రశ్నించారు. గతంలో రైల్వే అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించే వారని, ఇప్పుడు ఆ పద్ధతీ నిర్వీర్యమై పోయిందని, వీటన్నింటి ఫలితంగా ప్రజల భద్రత మరింత ప్రమాదంలో పడిందని తెలిపారు.

తమ వైఫల్యం, అసమర్థతలను, చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఘోర రైలు ప్రమాదాల్లో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారని, ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా రైల్వే మంత్రిత్వ శాఖకు ఇది అలవాటేనని ఆయన పేర్కొన్నారు. ఐటీ సెల్‌ లోని పెయిడ్‌ ఆర్టిస్టులు దానికి అన్ని రకాల అబద్ధాలూ గుప్పించి, మతపరమైన మసాలా జోడించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, దర్యాప్తు నివేదిక బయటకు వచ్చేసరికి ప్రజలు దాన్ని మర్చిపోతారని ఆయన పేర్కొన్నారు. 

2023 మార్చిలో రైల్వే భద్రతపై పార్లమెంటరీ ప్యానెల్ సమర్పించిన నివేదికలో రైల్వే మంత్రిత్వ శాఖ అలసత్వాన్ని ఎత్తి చూపిందని, రైల్వే భద్రతకు సంబంధించిన నివేదికలు విస్మరించబడుతున్నాయని వివరించిందని తెలిపారు. కమీషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌) చేసిన సిఫారసులు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అత్యంత ప్రాముఖ్యతను పొందవల్సి ఉన్నప్పటికీ అది వాస్తవానికి భిన్నంగా ఉన్నదని పేర్కొన్నది. రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ఏటీఆర్‌లను సమర్పించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని ప్యానెల్‌ ఆ నివేదికలో సిఫారసు చేసిందని గుర్తు చేశారు. రైల్వే ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలని,కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలని వి. కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు.

జగన్‌కు మరో షాక్.. ఇసుక తవ్వకాలు నిజమే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మే 16 వరకూ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ కంపెనీలు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే తవ్వకాలు సాగించాయి’ అని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శాస్త్రవేత్తల బృందం సుప్రీంకోర్టుకు నివేదించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మే 16 వరకూ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ కంపెనీలు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే తవ్వకాలు సాగించాయి’ అని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శాస్త్రవేత్తల బృందం సుప్రీంకోర్టుకు నివేదించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 14 నుంచి 16 వరకూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరితో పాటు పలు జిల్లాల్లోని ఇసుక రీచ్‌లు, స్టాక్‌యార్డ్‌లను ఈ బృందం తనిఖీ చేసి అదే నెల 18న నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో అనేక సంచలన అంశాలు ఉన్నాయి. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలా.. అలాంటిదేమీ లేదే? తవ్వకాలు జరిపిన ఆనవాళ్లే లేవంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గనుల శాఖ, అటు 23 జిల్లాల కలెక్టర్లు తొలుత ఎన్జీటీకి, ఆ తర్వాత హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు.

చివరికి మే 10న సుప్రీంకోర్టుకు కూడా అవే నివేదికలు ఇచ్చి, అక్రమ తవ్వకాలు జరగడం లేదని చెప్పారు. వాటిని విశ్వసించని సుప్రీంకోర్టు...

ఏపీలో ఇసుక తవ్వకాలపై రెండురోజుల్లో అధ్యయనం చేసి, క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదిక ఇవ్వాలని అదేరోజున కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఆదేశించింది. దీంతో విజయవాడ కేంద్రంగా ఉన్న ఎంవోఈఎఫ్‌ విభాగంలో ప్రముఖ శాస్త్రవేత్త పసుపులేటి సురే్‌షబాబు నేతృత్వంలోని నిపుణుల బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది.

Hyderabad: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి కాట..

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌(GHMC Commissioner)గా ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించారు. రోనాల్డ్‌రోస్‌(Ronaldros) బల్దియా నుంచి బుధవారం రిలీవ్‌ అయ్యారు. రెండు వారాల క్రితం రోనాల్డ్‌ వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లగా ఆమ్రపాలికి పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)లు అప్పగించారు.

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌(GHMC Commissioner)గా ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించారు. రోనాల్డ్‌రోస్‌(Ronaldros) బల్దియా నుంచి బుధవారం రిలీవ్‌ అయ్యారు. రెండు వారాల క్రితం రోనాల్డ్‌ వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లగా ఆమ్రపాలికి పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)లు అప్పగించారు. ఇటీవల జరిగిన ఐఏఎ్‌సల బదిలీ ఉత్తుర్వుల్లో ఆమెను ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఆమ్రపాలి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీపై జీహెచ్‌ఎంసీకి వచ్చిన జోనల్‌ కమిషనర్లు పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, అనురాగ్‌ జయంతి, అదనపు కమిషనర్లు ఉపేందర్‌రెడ్డి తదితరులు నూతన కమిషనర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమ్రపాలి జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా గతంలో కొన్నాళ్లు పని చేశారు. సంస్థలోని పరిస్థితులపై ఆమెకు కొంత మేర అవగాహన ఉంది.

బదిలీ ఉత్తర్వులు వెలువడిన సమయంలో ఢిల్లీలో ఉన్న ఆమ్రపాలి బుధవారం నగరానికి వచ్చారు. రోనాల్డ్‌రోస్‌ నుంచి బాధ్యతలు స్వీకరించాక సచివాలయంలో జరిగిన సమావేశానికి వెళ్లినట్టు తెలిసింది. రోనాల్డ్‌ ఇంధన శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఆమ్రపాలి ఇప్పటికే హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) జాయింట్‌ కమిషనర్‌, హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌), మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. బల్దియాలో కొనసాగాలనుకుంటే ఆ మూడు బాధ్యతల నుంచి మినహాయింపునివ్వడం లేదా జీహెచ్‌ఎంసీకి రెగ్యులర్‌ కమిషనర్‌ను నియమిస్తే ఇప్పటికే ఉన్న పోస్టుల్లో కొనసాగాలని ఆమ్రపాలి భావిస్తున్నట్టు సమాచారం

ఈవీడీఎం కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ బుధవారం బుద్ధభవన్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈవీడీఎంలో డైరెక్టర్‌ పోస్టు మాత్రమే ఉండేది. ఐపీఎస్‌ అధికారులు విశ్వజిత్‌ కంపాటి, ఎన్‌ ప్రకా్‌షరెడ్డిలు డైరెక్టర్లుగా కొనసాగారు. ప్రకాష్ రెడ్డి స్థానంలో రంగనాథ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆయన కమిషనర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసే యోచనలో ఉందని, అందుకే కమిషనర్‌గా ఆయనను నియమించారని ఓ అధికారి తెలిపారు

MLA: మల్కాజిగిరి ప్రాంతాన్ని రైల్వే నుంచి విముక్తి చేస్తా..

నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్డికి సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక కార్పొరేటర్‌ మీనాఉపేందర్‌రెడ్డి, రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్జి రోడ్డును పరిశీలించారు.

ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్జికి సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి

హైదరాబాద్: నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్డికి సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

స్థానిక కార్పొరేటర్‌ మీనాఉపేందర్‌రెడ్డి, రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్జి రోడ్డును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్లైఓవర్‌ బ్రిడ్జి ట్రాఫిక్‌ అవసరాలకు సరిపోవడం లేదన్నారు. దీంతో తరచూ ప్రయాణికులు తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మిస్తే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఉండవన్నారు.

రైల్వే, జీహెచ్‌ఎంసీ(Railway, GHMC) అధికారులు సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేసి సమాంతర ప్లైఓవర్‌ నిర్మాణ పనులు మొదలయ్యేలా పాటుపడాలని ఆయన కోరారు. ప్లైఓవర్‌ బ్రిడ్జి రోడ్డులోని గుంతలను పరిశీలించి తగిన మరమత్తులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మల్కాజిగిరి ప్రాంతాన్ని రైల్వే నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారి సుధాకర్‌, జీహెచ్‌ఎంసీ ఈఈ రాజు, డీఈ రేణుక, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.