/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వలిగొండ మాంటిస్సోరి పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్న గదిని సీజ్ చేసిన విద్యాధికారులు Vijay.S
వలిగొండ మాంటిస్సోరి పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్న గదిని సీజ్ చేసిన విద్యాధికారులు

వలిగొండ మండల కేంద్రంలోని స్థానిక మాంటిస్సోరి ప్రైవేట్ పాఠశాల లో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించగా పాఠశాలలో స్టేషనరీ పుస్తకాలు అమ్మకాలు జరుగుతుండడంతో వెంటనే ఎస్ఎఫ్ఐ నాయకులు ఆ పుస్తకాలు తీసుకొని ధర్నాకు దిగారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ విద్యా అనేది వ్యాపారంగా మలుచుకొని అంగట్లో సరుకుల్లా మాదిరిగా ఇష్టానుసారమైన ధరల ఫీజులతో పుస్తకాలు అమ్ముతున్నారన్నారు ఒకవైపు ప్రభుత్వం ఎక్కడ స్టేషనరీ పుస్తకాల అమ్మకాలు చేయొద్దని సర్కులర్ జారీ చేసినప్పటికీ ఏమాత్రం ప్రభుత్వ నియమాలు నిబంధనలు పాటించకుండా పుస్తకాలతో బ్యాగులతో పాటు వేలకు వేలు దోచుకుంటున్నారన్నారు పేద మధ్యతరగతి తల్లిదండ్రులను వారి పిల్లలకు పుస్తకాలు కొనుగోలు చేయాలంటే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒకటవ తరగతి విద్యార్థి పాఠ్యపుస్తకాలకు 3700 రూపాయలు తీసుకుంటున్నారన్నారు ఇలాంటి వేలకు వేలు ఫీజులు కట్టాలంటే పేద మధ్యతరగతి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే మండల విద్యాధికారి గారు వచ్చి ఏదైతే ఈ స్టేషనరీ బుక్కులు ఉన్నాయో సీజ్ చేయాలని వారి డిమాండ్ చేశారు వెంటనే మండల విద్యాధికారి గారు స్పందించి వారి బృందంతో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న గదిని సీజ్ చేయడం జరిగింది కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు మైసోల్ల నరేందర్ కార్యదర్శి సాయి వినయ్ , చంద్రశేఖర్, పవన్ ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల ఎంపీపీ నూతి రమేష్ రాజ్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎంపీపీ నూతి రమేష్ రాజును పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గరిసె రవి, పల్సం సతీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


కామ్రేడ్ వేముల మహేందర్ స్ఫూర్తితో పోరాటాలు కొనసాగిద్దాం : వ్య.కా.స రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు పిలుపు

సంపద సృష్టిస్తున్న వ్యవసాయ కూలీలకు కనీస వేతనాల చట్టం అమలు కోసం, సమగ్ర చట్టం కోసం అమరజీవి కామ్రేడ్ వేముల మహేందర్ గారి మూడవ వర్ధంతి స్ఫూర్తితో విస్తృతమైన పోరాటాలను కొనసాగిద్దామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గారి మూడవ వర్ధంతి సందర్భంగా "వ్యవసాయ కార్మికులు-కనీస వేతనాల చట్టం అమలు " పై జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షత సదస్సు నిర్వహించగా ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా వెంకట్రాములు పాల్గొని వేముల మహేందర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను ప్రతి సంవత్సరం రివైజ్ చేసి, సవరణ చేసి అమలు చేయవలసిన బాధ్యత వారి పైన ఉన్నదని అన్నారు. కానీ సంవత్సరాల గడుస్తున్న కనీస వేతనాలను అమలు చేయడం లేదని వారు విమర్శించారు. లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కనీస వేతనాలు చట్టాన్ని సవరణ చేయించి గ్రామాలలో సభలు సమావేశాలు నిర్వహించి ప్రచారం చేయవలసిన అవసరం ఉందని వారు అన్నారు. ఇప్పటికే వ్యవసాయ కార్మికులకు సరైన పనిగంటలు లేక సరైన వేతనం లేక అర్థాకళితో జీవిస్తున్న పరిస్థితి ఉన్నదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వము ఇప్పటికైనా సమగ్ర చట్టం రూపొందించి అందులో వ్యవసాయ కూలీలకు 6 గంటల పని, రోజు కూలి 600 రూపాయలు, బీమా సౌకర్యం, విద్యా, వైద్యమం, అభివృద్ధి, సంక్షేమము లాంటివి చేర్చి చట్టం చేయాలని డిమాండ్ చేసినారు. కేంద్రంలోని బిజెపి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి దానిమీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీల ఉపాధిని దెబ్బతీయాలని చూస్తున్నదని, పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రను చేస్తున్నదని దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు అనేక ఉద్యమాలకు జీవితాంతము నాయకత్వం వహించి పోరాడిన మహా పోరాట యోధులు వ్యవసాయ కార్మికుల ఉద్యమ నాయకులు అమరజీవి వేముల మహేందర్ స్ఫూర్తితో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గార్లు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ వేముల మహేందర్ పేద కుటుంబంలో పుట్టి ఎర్రజెండా నాయకత్వంలో అనేక కూలీ, భూమి, సామాజిక ఉద్యమాలు నిర్వహించి పేదలకు అండగా నిలిచాడని వారి స్ఫూర్తితో వ్యవసాయ కూలీలు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలలో పనిచేయాలని కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లెల్ల పెంటయ్య, గంగదేవి సైదులు, రాచకొండ రాములమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు సిర్పంగి స్వామి, గుంటోజి శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులు పల్లెర్ల ఆంజనేయులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలుపుల వివేకనంద, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపెళ్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, జిల్లా కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య చింతకాయల నర్సింహ, ఎర్ర ఊషయ్య, బోయ యాదయ్య, పిట్టల శ్రీను, మానే సాలయ్య, రాపోతు పద్మ , ముత్యాలు, బాలరాజు ఇతరులు పాల్గొన్నారు.


వలిగొండ గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత: ఎస్ఐ డి మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో టి ఎస్ 12 యు సి 4130 అను నెంబర్ గల అశోక్ లే లాండ్ గూడ్స్ లో 10 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యము ను మహమ్మద్ సాదిక్ వయసు 40 సంవత్సరాలు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ,భువనగిరి కి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేశామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని AISF జిల్లా కౌన్సిల్ పక్షాన జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ శుక్రవారం ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ పక్షాన వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని భువనగిరి చౌటుప్పల్ మోత్కూర్ వలిగొండ తదితర మండలాలలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మనోవేదన గురి చేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ బెల్ట్ బూట్లు తదితర వస్తువుల పేరుతో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ సమస్యలపై గతంలో అనేకమార్లు డీఈవో దగ్గరికి తీసుకువెళ్లిన కనీసం పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా జిల్లాలో ఆరు మండలాలకు ఓకే ఎంఈఓ ఉండడం వలన పర్యవేక్షణ లోపంతో ప్రైవేట్ పాఠశాలలు దోపిడికి అలవాటు పడ్డారు అని అన్నారు జిల్లాలో అన్ని మండలాలకు ఎంఈఓ లను నియమించాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయానికి సర్వీసు రోడ్డు నిర్మించి విద్యార్థులకు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ, నవీన్, భరత్ వినిల్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి : భువనగిరి ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక శిక్షణ శిబిరం

యాదాద్రి భువనగిరి జిల్లా అంగన్వాడి భువనగిరి ప్రాజెక్టు పరిధిలో ఉన్న 11 సెక్టార్లు లో నుంచి 35 మంది అంగన్వాడి టీచర్లను బ్యాచ్ గా డివైడ్ చేసి 19/6/2024 నుండి 21/6/2024 వరకు పూర్వ ప్రాథమిక శిక్షణా కేంద్రం శిబిరం జరిగినది. ఈ శిబిరంలో భాగంగా 35 మంది టీచర్లకు ప్రియదర్శిని అంగన్వాడి టీచర్ కరదీపిక పుస్తకాలు అందించి. అందులోని అంశాలు నూతన జాతీయ విద్యా విధానం 2020లో ప్రీస్కూల్ అనుసంధానం చేయడం జరిగింది. ECCE , ECE గురించి వివరించడం, అభ్యసనమూలాలు, ఆటలు, పాటలు, కథ, మాటలు, మంచి అలవాట్లు, సృజనాత్మకత, మరియు శాస్త్రీయ పరిజ్ఞానం ప్రదర్శించడం జరిగింది. మిగతా 267 టీచర్లకు బ్యాచిలుగా విభజించి శిక్షణ నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి గారు భువనగిరి ప్రాజెక్టు సిడిపిఓ స్వరాజ్యం రేఖల గారు మరియు ఏసి డిపో రమా గారు సెక్టార్ సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
భువనగిరి: పుస్తకాలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, 8వ వార్డు కౌన్సిలర్ పంగరెక్క స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా,విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా సంవత్సరం లో ప్రతి ఏటా విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలను శుక్రవారం భువనగిరి పట్టణములో రాంనగర్ ప్రైమరీ పాఠశాలలోమున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు 8 వ వార్డ్ కౌన్సిలర్ పంగ రెక్క స్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌ ఉచితంగా పంపిణీ చేస్తుందని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ బోధను అందించాలని సూచించారు. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం మంచి ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి: భువనగిరి టౌన్ లో శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేసిన విద్యాధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా స్కూలు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్న విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు బీసీ సంఘం నాయకులు భువనగిరి టౌన్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ కు పర్మిషన్ లేకుండా క్లాసులు నిర్వహిస్తున్నారు DEO నారాయణరెడ్డి గారికి బీసీ సంఘం విషయం తెలియజేస్తే MEO నాగేశ్వర్ రెడ్డి గారిని పంపి శ్రీ చైతన్య స్కూల్ కు సీల్ విధించడం జరిగింది బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల రక్తం తాగుతున్నారు బుక్ ఫీజ్ అని బడి ఫీజు అని బస్సు ఫీజు అని ట్యూషన్ ఫీజ్ అని డొనేషన్ ఫీజ్ అని ప్రైవేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నారు స్కూల్లో ఎలాంటివి అమ్మొద్దని గైడ్లైన్స్ ఉన్న అవి పెడచెవిన పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు పేదల సొమ్మును 2005 ఫీజు నియంత్రం చట్ట అమలులో ఉన్న అవన్నీ పట్టించుకోకుండా విద్యార్థుల రక్తం తాగుతున్నారు అలాంటి ప్రైవేట్ విద్యాసంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నియమించి ప్రభుత్వ స్కూల్లో మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు . ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు *గుండెబోయిన సురేష్, బీసీ విద్యార్థి సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు కొండే కోటేశ్వరి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ యాదవ్ , ఉమ్మడి జిల్లా bc యువజన సంఘం నాయకులు ఎడ్ల మహాలింగం ,మహేందర్ గౌడ్,వనిత,దర్శన్ ముదిరాజ్,వెంకట్ ప్రజాపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేట : ఇంద్రపాలనగరం చెరువులో గుర్తుతెలియని మృతదేహం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని చెరువు లో గుర్తుతెలియని మృతదేహం శుక్రవారం కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గత మూడు రోజుల క్రితం గ్రామంలో తిరిగాడని, మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలిపారు. మృతదేహం నీటిలో తెలియాడుతూ శుక్రవారం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వలిగొండ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం

వలిగొండ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం* *వలిగొండ మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు భోళ్ళ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు యోగ దినోత్సవం సందర్బంగా యోగ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నకిరేకంటి మొగులయ్య, అసెంబ్లీ కోకన్వీనర్ రాచకొండ కృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు దంతూరి సత్తయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షులు గంగాదారి దయాకర్, మండల కోశాధికారి అప్పిశెట్టి సంతోష్, బూత్ అద్యక్షులు పిట్టల రాజు, మండల యువ మోర్చాప్రధాన కార్యదర్శి ఆమనగంటి శివ,ఎర్రబోలు జంగయ్య, తదితరులు పాల్గొన్నారు