ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కౌన్సిలర్ పంగ రెక్కస్వామి
యాదాద్రి భువనగిరి జిల్లా:పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. 1 నుంచి 19 ఏళ్ల లోపు వారికి జిల్లా వ్యాప్తంగా నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేటి నుంచి మాత్రలు అందజేయనున్నారని కౌన్సిలర్ పంగ రెక్క స్వామి తెలియజేశారు** ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడుపులో నులి పురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. ఆహారం, మురుగు చేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల వీటి సంక్రమణకు గురవుతారు. నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీతన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ కార్యక్రమంలో ఎ.యన్ .యం.ఇంద్ర ప్రేమలత, శోభ , శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ ప్రధానోపాధ్యాయులుయాదయ్య , సంతోష,గంజ్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు , రాంనగర్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు
Jun 21 2024, 18:49