భువనగిరి: భువనగిరి టౌన్ లో శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేసిన విద్యాధికారులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా స్కూలు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్న విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు బీసీ సంఘం నాయకులు భువనగిరి టౌన్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ కు పర్మిషన్ లేకుండా క్లాసులు నిర్వహిస్తున్నారు DEO నారాయణరెడ్డి గారికి బీసీ సంఘం విషయం తెలియజేస్తే MEO నాగేశ్వర్ రెడ్డి గారిని పంపి శ్రీ చైతన్య స్కూల్ కు సీల్ విధించడం జరిగింది బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల రక్తం తాగుతున్నారు బుక్ ఫీజ్ అని బడి ఫీజు అని బస్సు ఫీజు అని ట్యూషన్ ఫీజ్ అని డొనేషన్ ఫీజ్ అని ప్రైవేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నారు స్కూల్లో ఎలాంటివి అమ్మొద్దని గైడ్లైన్స్ ఉన్న అవి పెడచెవిన పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు పేదల సొమ్మును 2005 ఫీజు నియంత్రం చట్ట అమలులో ఉన్న అవన్నీ పట్టించుకోకుండా విద్యార్థుల రక్తం తాగుతున్నారు అలాంటి ప్రైవేట్ విద్యాసంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నియమించి ప్రభుత్వ స్కూల్లో మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు . ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు *గుండెబోయిన సురేష్, బీసీ విద్యార్థి సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు కొండే కోటేశ్వరి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ యాదవ్ , ఉమ్మడి జిల్లా bc యువజన సంఘం నాయకులు ఎడ్ల మహాలింగం ,మహేందర్ గౌడ్,వనిత,దర్శన్ ముదిరాజ్,వెంకట్ ప్రజాపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Jun 21 2024, 17:59