/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఎంపీ చామలను కలిసిన ఔరవాణి గ్రామ కాంగ్రెస్ నాయకులు Vijay.S
ఎంపీ చామలను కలిసిన ఔరవాణి గ్రామ కాంగ్రెస్ నాయకులు

నకిరేకల్ :   భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఔరవాణి గ్రామ కాంగ్రెస్ నాయకులు నడిగోటి శేఖర్, ముప్పిడి రవి, ముక్కముల నాగరాజు, సింగం నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి: హనుమపురం నుండి అనంతారం, తాజ్పూర్ గ్రామాలకు బిటి రోడ్డు మరమ్మతులు తక్షణమే చేపట్టాలి : సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ డిమాండ్

హన్మాపురం నుండి అనంతరం, తాజ్ పూర్ గ్రామాల వరకు ధ్వంసమైన బీటీ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమవారం సిపిఎం హన్మాపురం గ్రామశాఖ ఆధ్వర్యంలో గుంతలు పడి ప్రజలకు ఇబ్బంది అవుతున్న రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని నూతన రోడ్డును వేయాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ హన్మాపూర్ మీదుగా అనంతరం నుండి బీబీనగర్, తాజ్ పూర్ నుండి బొమ్మలరామారం వివిధ గ్రామాలకు సంబంధించిన అనేకమంది ప్రయాణికులు కార్మికులు విద్యార్థులు వృత్తిదారులు రైతులు ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉన్నదని రోడ్డు మొత్తం ధ్వంసమై వెళ్లడానికి ఇబ్బందులు పడుతూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ అధికారులు పలుమార్లు రోడ్డు విషయంలో వారి దృష్టికి తీసుకుపోయిన గత నాలుగైదు సంవత్సరాలుగా పట్టించుకోవడంలేదని గత ఎమ్మెల్యే గారు కూడా రోడ్డు విషయంలో పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ రోడ్డు ప్రజలందరికీ వివిధ గ్రామాల ప్రజలకు ప్రధాన రోడ్డుగా మారిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ మధ్యకాలంలో గెలిచిన స్థానిక శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ తక్షణము స్పందించి రోడ్డును పరిశీలన చేసి గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి మరోమారు బీటీ రోడ్డును వేయాలని నర్సింహ డిమాండ్ చేసినారు. 15 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే మూడు గ్రామాల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించినారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, సహాయ కార్యదర్శి బండి శ్రీను, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి దయ్యాల మల్లేష్, సిపిఎం నాయకులు గ్రామ ప్రజలు తోటకూరి నాగరాజు, తోటకూరి గణేష్, కుసుమ మధు, పైళ్ల సత్తిరెడ్డి, ముద్దం చంద్రయ్య, కమ్మ బాలయ్య, శీను, అరిగే సంజీవ, సోమ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 20 నుంచి గ్రూప్ - 4 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్: టీజీపీఎస్పీ

ఈనెల  20 నుంచి గ్రూప్-4 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గ్రూపు-4 ఉద్యోగాలకు షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంతోపాటు పబ్లిక్‌ గార్డెన్స్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలోనూ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వెల్లడించింది. ఎవరైనా గైర్హాజరైతే ఆగస్టు 24, 27, 28, 29, 31 తేదీల్లో పరిశీలిస్తామని తెలిపింది. షెడ్యూల్‌ను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టామని పేర్కొంది.

వలిగొండ: వెలువర్తి గ్రామంలో ప్రజలకు యువతకు గంజాయి పై అవగాహన కల్పించిన ఎస్సై మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం: తెలంగాణ ప్రభుత్వం గంజాయి పైన ఉక్కు పాదం మోపుతున్న నేపథ్యంలో రాచకొండ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, భువనగిరి డిసిపి వారి సూచనలు మేరకు వలిగొండ మండలంలో వివిధ గ్రామాలలో డ్రగ్స్ పైన అవగాహన కల్పిస్తూ సూచనలు ఇస్తూ ముందు కెళ్తున్నామని వలిగొండ ఎస్సై  మహేందర్ అన్నారు. వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలువర్తి గ్రామంలో ప్రజలకు మరియు యువతకు గంజాయి పై అవగాహన కల్పిస్తున్న స్థానిక ఎస్సై మహేందర్ వెల్వర్తి గ్రామ పరిధిలో యువత యువకులకు మరియు గ్రామ ప్రజలకు నార్కోటిక్ డ్రగ్స్ చెడు వ్యసనాల పట్ల దాని పై మాదకద్రవ్యాల దుర్వినియోగం దాని అక్రమ రవాణా యొక్క పరిణామాలను గురించి ఈరోజు సాయంత్రం వెల్వర్తి గ్రామంలో అవగాహన సదస్సులో... ఎస్సై మహేందర్  మాట్లాడుతూ గంజాయి ఇన్ని రకాలుగా యువత వాడుకుంటున్నారు దానిపైన అవగాహన కల్పిస్తూ వాటి విశేషాలను వారికి వివరిస్తూ ఏ రకంగా దూరం పెట్టుకోవాలి., అధికారుల సూచనలు అందరికీ స్థానికంగా ప్రతి గ్రామంలో వివరాలను వెల్లడిస్తూ వారికి మేమున్నామని మనోధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపిన స్థానిక ఎస్సై మహేందర్.. విద్యార్థి, యువత, యువకులు తల్లిదండ్రులను మీ పిల్లలని మీరే కాపాడుకోవాలని సూచన చేసినారు... అలాగే వలిగొండ నుండి వెలువర్తి గ్రామముకు గంజాయి గానీ ఇంకా వేరే పదార్థాలు గానీ వెల్వర్తికి అక్రమ సరఫరా చేస్తున్నారా అన్న కోణంలో కూడా పూర్తిగా వివరించారు అలా సరఫరా కాకుండా అరికట్టాలని సూచన కూడా చేశారు.. ఎవరి పట్ల పైన అనుమానం కలిగినచో స్థానిక పోలీస్ స్టేషన్ కానీ డయల్ 100 గాని ఫోన్ చేసి వివరాలు వెల్లడించాలని, వివరాల్లో వెల్లడించిన వారి పేర్లు కానీ స్థానికత కానీ ఎవరికి కూడా వివరాలు వెల్లడించకుండా పొందుపరుస్తామని తెలియజేశారు.

ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా దళితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి: దళిత హక్కుల పోరాట సమితి

దుప్పల్లి గ్రామంలో ఆదివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద డిహెచ్పిఎస్ కరపత్రాలు ఆవిష్కరించారు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 18, 19 ,20 తేదీలలో లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్ యాదగిరి గుట్ట మండలంలో నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా *వలిగొండ డిహెచ్పిఎస్ మండల కన్వీనర్ కట్ల యాదగిరి మాట్లాడుతూ* దళితులు తరతరాలుగా అంచివేతకు అంటరాని తనం వివక్షత దోపిడీ పీడనాల కింద నలిగిపోతున్న అట్టడుగు వర్గాలపై ఆశేష శ్రామిక కులాలు అభ్యున్నతి లక్ష్యంగా ఆవిర్భవించింది సమాజంలో తరతరాలుగా అంటరానితనం అనే అవమాన నియా దురాచారానికి అత్యంత దారుణంగా బలైపోతున్న దళితులను సామాజిక ఆర్థిక రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నించి అనిచివేతలను ఎదిరించి సమానత్వాన్ని సాధించేందుకు సంఘటితంగా చైతన్యవంతం చేయుటకు ప్రధాన లక్ష్యంగా దళిత సామాజిక దృక్పథంతో తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించి దళితులలో చైతన్యం పరిచి మనిషిని మనిషిగా చూడ నిరాకరించి తోటి మనిషిని బానిసగా మార్చుకొని తరతరాలుగా అవమానాలకు అణిచివేతలకు దోపిడి పీడనాలకు కారణమైంది. ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థ ఇలాంటి కుల వ్యవస్థకు పునాది అయిన మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి కుల వ్యవస్థ పై యుద్ధం ప్రకటించాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. మోడీ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ సేవలు ఉన్నత విద్యా ప్రవేటికరణ వేగవంతం కావడానికి తోడు ఈ ప్రైవేటు రంగాలలో రిజర్వేషన్లు లేకపోవడంతో పాటు రిజర్వేషన్లు విషయంలో రాజ్యాంగ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయని అన్నారు ఈ నైపెద్యంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఆర్థిక రాజకీయ సామాజిక హక్కుల పరిరక్షణకు సామాజిక న్యాయం కొరకు కుల వివక్షత నిర్మూలన కొరకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ని మరింత బలోపేతం చేయాలని దళితులకు కేటాయించిన నిధులను దారి మళ్లించకుండా స్వయం ఉపాధి పథకం అమలు చేయాలని కోరుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహించుటకు భవిష్యత్తు కార్యచరణను రూపుదించుకొని రాష్ట్రవ్యాప్తంగా దళితుల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని వారన్నారు ఈ రాజకీయ శిక్షణ తరగతులకు ఎంపిక చేసిన దళితులు ఎక్కువ శాతం హాజరై ఈ రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలనిఅన్నారు ఈ కార్యక్రమంలో *ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, మాజీ సర్పంచ్ బందేల స్వామిదాస్, సిపిఐ గ్రామ శాఖ నాయకులు మెట్టు లక్ష్మీనారాయణ, ఎర్ర కిరణ్, మారోజు నరసింహ చారి,కట్ల సామేల్, మామిడికాయల నరేష్, అశోక్,రాజు తదితరులు పాల్గొన్నారు

ప్రజా సంపదను దోపిడి శక్తులకు కట్టబెడుతున్న బీజేపీ ప్రభుత్వం: పోతినేని సుదర్శన్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సహజ సంపాదనను ప్రజలకు సమపాలనలో పంచకుండా దోపిడీ శక్తులకు కట్టబెడుతున్నారని సిపిఎంnరాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. ఈ రోజున యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 15,16 తేదీల్లో భువనగిరిలోని వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న రాజకీయ శిక్షణ తరగతులలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల జనగణనను చేపట్టడం ద్వారా జనగనన చేయడంలో బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నదని 10 సంవత్సరాల కాలం నుండి నిర్లక్ష్యం చేస్తున్నదని, ఈ కాలంలో జరిగిన దేశవ్యాప్త ఎన్నికల్లో దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ మాటలు ప్రజలు సంపూర్ణంగా నమ్మలేదని నమ్మక సంపూర్ణ మద్దతు సంపూర్ణమైన మద్దతు ఇవ్వలేదని బిజెపి దాని అనుబంధ సంఘాలు సంఘ పరివార్ లాంటి ఆలోచన మేరకే బిజెపి తన విధానాలు అవలంబిస్తున్నదని తన పరిపాలన కొనసాగిస్తుందని మతోన్మాద విధానాలను అవలంబిస్తూ దేశ ప్రజలను విచ్ఛిన్నం చేస్తూ దేశంలో అనేక అల్లర్లకు అనేక దాడులకు పూనుకున్నదని వెనుకబడిన కులానికి చెందిన వాడినని ప్రజలను మోసం చేయడం కోసం తాను వెనుకబడిన తరగతి వాడినని ప్రజలను మోసం చేశాడని మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట నీటి మూటలైనాయని రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేయలేదని దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పుతున్నదని బ్రిటిష్ వారి కాలంలోనే అనేక పోరాటాలు చేసి ప్రజలు సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం రద్దు చేయడానికి చూస్తున్నదని ఎప్పటికైనా ప్రజలు ఇచ్చిన ఫలితాన్ని బట్టి ప్రజా సమస్యల పరిష్కారం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని దేశంలో మోడీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల శరణ్యమని వారన్నారు. శిక్షణ తరగతులలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు ధోనూరి నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం, దాసరి పాండు జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, సిరిపంగి సామి, సైదులు, బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, రాజయ్య, పగిళ్ల లింగారెడ్డి, శ్రీనివాసచారి, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేశం, బొడ్డుపల్లి వెంకటేష్ , జెల్లల పెంటయ్య, బోలగాని జయరాములు, బోల్లు యాదగిరి, ఎంఎ ఇక్బాల్, నాయకులు ధూపాటి వెంకటేశం గాడి శ్రీనివాసు గురు అనీలు రేకల శ్రీశైలం బిక్షం గుండు వెంకట నరసింహ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి సంఘ నరేందర్ గద్ద నరసింహ బందెల ఎల్లయ్య దండగిరి గంధ మల్ల మాతయ్య అవ్వరు రామేశ్వరి రాములమ్మ ఆఫీస్ సెక్రటరీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కామాంధుని కఠినంగా శిక్షించాలి , బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి : రామన్నపేట మండలం మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాదే శోభారాణి


ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కూలీ దంపతులు చిన్నారితో పొట్ట కూటి కోసం పెద్దపల్లి జిల్లా లో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి లోని ఒక రైస్ మిల్లులో పనిచేస్తున్నారు, ఆ మిల్లులో పనిచేసే బీహార్ కి చెందిన వినోద్ 28 సంవత్సరాలు అనే నిందితుడు తల్లి తండ్రి మధ్యలో పడుకున్న 6 సంవత్సరాల చిన్నారిని రాత్రి 11 గంటలకు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేసిన సంఘటన చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు గాదె శోభారాణి అన్నారు, తల్లిదండ్రులు పక్కనే ఉన్న ఆ బాలికను కాపాడుకోలేక పోవడం చాలా బాధాకరం అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీసుల పర్యవేక్షణ కూడా ఉండాలి, మద్యం,డ్రగ్స్ మత్తులో పడి ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారు,తొందరగా అతనికి శిక్ష పడాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపు తుందని మహిళా కాంగ్రెస్ తరపున వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాము, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు,
హోటల్ ఎల్లప్ప లాడ్జ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల పట్టణ కేంద్రంలోని లక్కారం 07,వార్డులో హోటల్ ఎల్లప్ప లాడ్జి నూతనంగా ఏర్పాటు చేయడం జరిగినది .ప్రారంభోత్సవానికి  ముఖ్యఅతిథిగా  మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు  హాజరై, వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొయ్యడ సైదులు, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, రామాలయ గుడి చైర్మన్ బొబ్బిళ్ళ మురళి, చెరుకు లింగస్వామి, కానుగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


ఆత్మకూరు మండల కేంద్రంలో స్నేహితుల సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (యం) ఆదివారం  మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన వనం సుగుణ(38) భర్త మల్లేష్ 07-06-2024నాడు గుండెపోటు తో మరణించగా మృతురాలి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి చలించిన మృతురాలి కొడుకు వనం ప్రవీణ్ స్నేహితులు 2013-14 SSC బ్యాచ్ వారు బాధిత కుటుంబ సభ్యులకు 20,000 రూపాయల నగదు సాయం అందించి, పరామర్శించారు.

ఎస్సీ , ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులలో న్యాయం చేయాలి: బోయ రాములు జిల్లా అధ్యక్షులు

నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు బదిలీలు చేపట్టడం పట్ల ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బోయ రాములు హర్షం వ్యక్తం చేశారు . శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అత్యవసర సమావేశం లో మాట్లాడుతూ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సీనియారిటీ లిస్ట్ లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు మెరిట్ లో ఉన్నప్పటికీ అడక్వసి పేరుతో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించడం లేదు . అందువల్ల ప్రమోషన్లు లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.కావున ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతికి అడ్డంకి గా మారిన జీవో నెంబర్ రెండు లో ఉన్నటువంటి అడక్కసి అనే పదాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్లలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కట్ట మల్లయ్య మండల ప్రధాన కార్యదర్శి జానపాల కిషన్, తదితరులు పాల్గొన్నారు.