ప్రజా సంపదను దోపిడి శక్తులకు కట్టబెడుతున్న బీజేపీ ప్రభుత్వం: పోతినేని సుదర్శన్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సహజ సంపాదనను ప్రజలకు సమపాలనలో పంచకుండా దోపిడీ శక్తులకు కట్టబెడుతున్నారని సిపిఎంnరాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. ఈ రోజున యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 15,16 తేదీల్లో భువనగిరిలోని వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న రాజకీయ శిక్షణ తరగతులలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల జనగణనను చేపట్టడం ద్వారా జనగనన చేయడంలో బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నదని 10 సంవత్సరాల కాలం నుండి నిర్లక్ష్యం చేస్తున్నదని, ఈ కాలంలో జరిగిన దేశవ్యాప్త ఎన్నికల్లో దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ మాటలు ప్రజలు సంపూర్ణంగా నమ్మలేదని నమ్మక సంపూర్ణ మద్దతు సంపూర్ణమైన మద్దతు ఇవ్వలేదని బిజెపి దాని అనుబంధ సంఘాలు సంఘ పరివార్ లాంటి ఆలోచన మేరకే బిజెపి తన విధానాలు అవలంబిస్తున్నదని తన పరిపాలన కొనసాగిస్తుందని మతోన్మాద విధానాలను అవలంబిస్తూ దేశ ప్రజలను విచ్ఛిన్నం చేస్తూ దేశంలో అనేక అల్లర్లకు అనేక దాడులకు పూనుకున్నదని వెనుకబడిన కులానికి చెందిన వాడినని ప్రజలను మోసం చేయడం కోసం తాను వెనుకబడిన తరగతి వాడినని ప్రజలను మోసం చేశాడని మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట నీటి మూటలైనాయని రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేయలేదని దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పుతున్నదని బ్రిటిష్ వారి కాలంలోనే అనేక పోరాటాలు చేసి ప్రజలు సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం రద్దు చేయడానికి చూస్తున్నదని ఎప్పటికైనా ప్రజలు ఇచ్చిన ఫలితాన్ని బట్టి ప్రజా సమస్యల పరిష్కారం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని దేశంలో మోడీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల శరణ్యమని వారన్నారు. శిక్షణ తరగతులలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు ధోనూరి నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం, దాసరి పాండు జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, సిరిపంగి సామి, సైదులు, బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, రాజయ్య, పగిళ్ల లింగారెడ్డి, శ్రీనివాసచారి, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేశం, బొడ్డుపల్లి వెంకటేష్ , జెల్లల పెంటయ్య, బోలగాని జయరాములు, బోల్లు యాదగిరి, ఎంఎ ఇక్బాల్, నాయకులు ధూపాటి వెంకటేశం గాడి శ్రీనివాసు గురు అనీలు రేకల శ్రీశైలం బిక్షం గుండు వెంకట నరసింహ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి సంఘ నరేందర్ గద్ద నరసింహ బందెల ఎల్లయ్య దండగిరి గంధ మల్ల మాతయ్య అవ్వరు రామేశ్వరి రాములమ్మ ఆఫీస్ సెక్రటరీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Jun 17 2024, 16:53