/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz అరూరు లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం Vijay.S
అరూరు లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అధిక సంఖ్యలో ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల్ కోర్ కమిటీ సభ్యులు బండారు నరసింహారెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి ఓ బి సి మండల అధ్యక్షులు కనకాచారి కసర బోయిన లింగయ్య ఆవుల అంజయ్య ఆవుల సత్యనారాయణ కసర బోయిన నరసింహ తదితరులు పాల్గొన్నారు.
అరూరు లో ఎల్ఓసి చెక్కు అందజేసిన కాంగ్రెస్ నాయకులు

వలిగొండ మండలం అరూరు గ్రామంలో బోళ్ల శేఖర్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరినందున హాస్పిటల్ ఖర్చుల కొరకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఎల్ఓసి చెక్కు రెండు లక్షల 50 వేలు ఇప్పించడం జరిగింది ఈ అట్టి చెక్కును ఈరోజు శేఖర్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల కోర్ కమిటీ సభ్యులు బండారు నరసింహారెడ్డి సింగల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి మండల ఓబీసీ అధ్యక్షులు కనకాచారి ప్రైమరీ స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బండారు మహిపాల్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల సత్యనారాయణ లింగయ్య యాదవ్ మాజీ సర్పంచు చమ్మయ మాజీ ఎంపిటిసి చంద్రయ్య బండ లింగస్వామి యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలిమినేటి సంతోష్ బత్తిని వెంకటేష్ కసర బోయిన నరసింహ సుక్క రామచందర్ కొల్లూరి రామచందర్ జింకల స్వామి గడ్డల కృష్ణ జనుకల కుమార్ జినుకల చిన్న సాలయ్య వల్లపు స్వామి తదితరులు పాల్గొన్నారు.

తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు వలిగొండలో కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం

నెల 27వ తేది రోజు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వలిగొండ మండల కేంద్రం లో ప్రయివేట్ లెక్చరర్ మరియు పట్టభద్రులను కలిసి కోరడం జరిగింది. నిరుద్యోగుల గొంతుక తీన్మార్ మల్లన్న గతం లో స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగిందని ఈసారి కాంగ్రెస్ పార్టీ మల్లన్న కు అవకాశం కల్పించిందని కావున ప్రతీ ఒక్క పట్టభద్రుడు మల్లన్న కు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ వలిగొండ పట్టణ అధ్యక్షులు కనకల కిష్టయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు కాసుల వెంకన్న గౌడ్, మహమ్మద్ అతహర్, పట్టభద్రులు నవాజ్ పాషా, నరేష్, బాను ప్రసాద్, విష్ణు ప్రసాద్, జావీద్, శేఖర్, శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 25వ తేదీ సాయంత్రం నుండి 27 వరకు వైన్ షాపులు బంద్

ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 27 వ తేదీన వరంగల్ -ఖమ్మం -నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ పురస్కరించుకొని 25 వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుండి 27 వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు జిల్లాలో అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్ చేయబడతాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే నేడొక ప్రకటనలో తెలిపారు.* *అందుకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను బంద్ చేయడం జరుగుతుందని, దీనిని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968, సెక్షన్ 20 (1) ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు.
చిట్యాల - భువనగిరి రోడ్డు నాలుగు వరుసల రహదారిగా విస్తరణ జరిగేనా...

రాష్ట్రంలోని రెండు ప్రధానమైన జాతీయ రహదారులు హైదరాబాద్ - విజయవాడ మరియు హైదరాబాద్ -భూపాలపట్నం కలిపే అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారి చిట్యాల-భువనగిరి అని అందరికీ తెలిసిందే..... వివరాల్లోకి వెళితే... 7 అక్టోబర్ 2015 నాడు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో పదిమంది మృత్యువాత పడ్డారు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా ఈ రహదారి గుండా ప్రయాణించే వాహనాల సంఖ్య పెరగడంతో, ఈ ఇరుకైన రహదారి పై నిత్యం రక్తం మోడుతున్న ఘటనలు సర్వసాధారణమే. 2015 సంవత్సరంలో అప్పటి కెసిఆర్ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రపాలనగరం ఘటనపై కంటి తుడుపు చర్యలు చేపడుతూ, చిట్యాల-భువనగిరి నాలుగు వరుసల రహదారి విస్తరణ హామీని బుట్ట దాఖలు చేసింది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రహదారుల& భవనాల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చి చిట్యాల పట్టణంలో మంత్రి మాట్లాడుతూ.... చిట్యాల భువనగిరి 4 వరుసల విస్తరణ టెండర్ ప్రక్రియ జనవరి 2024 లోపు పూర్తి చేపిస్తానని అన్నారు. కానీ ఇప్పటికీ ఇది కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఈ రహదారి విస్తరణ చేసి, ప్రమాదాలు జరగకుండా నివారించాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణంతో సంబంధం లేకుండా, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఈ హామీని నెరవేర్చుతుందో వేచి చూడాలి.


వలిగొండ లో వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్సై డి మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వలిగొండ ఎస్సై డి మహేందర్ ఆధ్వర్యంలో సోమవారం ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ రోడ్డుపైన వాహనాలు నిలిపే వాహనదారులకు తగు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. వాహనాలను అతివేగంగా నడపరాదని, మైనర్లు డ్రైవింగ్ చేయరాదని అన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు ఖాయం: వై సుదర్శన్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్సీ ఇన్చార్జి

భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి గెలుపే లక్ష్యంగా వలిగొండ మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఓటర్లను ఇంటింటికి తిరుగుతూ మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమెంధర్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భువనగిరి అసెంబ్లీ పట్టభద్రుల MLC ఇన్చార్జి Y. సుదర్శన్ రెడ్డి హాజరైనారు *ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ , జిల్లా సెక్రెటరీ కొప్పుల యాదిరెడ్డి, దంతూరి సత్తయ్య, మారోజు అనిల్ కుమార్ ,లోడే లింగస్వామి, గంగ దారి దయాకర్, మందుల నాగరాజు పిట్టల రాజు, బుంగమట్ల మహేష్, దంతూరి అరుణ్, అవనగంటి శివ, బర్ల మల్లేశం తదితరులు హాజరైనారు.
సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం.. సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి

సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం.. వర్కట్ పల్లి గ్రామంలో సుందరయ్య గారి 39వ వర్ధంతి భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన పుచ్చలపల్లి సుందరయ్య జీవితాంతం పేదలు వ్యవసాయ కూలీల,కార్మికుల, పేద ప్రజల కోసం పనిచేసిన గొప్ప మహనీయుడని ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు ఈరోజు మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన పుచ్చలపల్లి సుందరయ్య పేద ప్రజలు వ్యవసాయ కూలీలు, కార్మికుల,దళితుల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడన్నారు,ఉత్తమ పార్లమెంట్ సభ్యునిగా సైకిల్ పై వెళ్లి రాజకీయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడన్నారు పిల్లలు పుడితే తనలో స్వార్థం పెరుగుతుందనే భావనతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని తన జీవితం మొత్తం పేదల కోసం పనిచేసిన త్యాగమూర్తన్నారు స్వాతంత్ర ఉద్యమ సమయంలో బాల్య దశలోనే పోరాటాలకు ఉత్తేజితులై కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై దక్షిణ భారతదేశంలో సిపిఎం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడని సిపిఎం మొదటి జాతీయ కార్యదర్శిగా పనిచేశారని ఎంపీ ఎమ్మెల్యేగా పార్లమెంటు,అసెంబ్లీలో చట్టసభలకు వన్నెతెచ్చిన రాజకీయ సిద్ధాంతకర్త అన్నారు ఆయన స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమైందని ఆయన చూపిన దోపిడీ,పీడనలేని సమ సమాజం కోసం,కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళని,ఆయన ఆశయ సాధనకు పునరంకితం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం వర్కట్ పల్లి శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి సిపిఎం నాయకులు గూడూరు బుచ్చిరెడ్డి, ఆకుల మారయ్య,రొండి రాములు,గోగు కిష్టయ్య,రొండి మల్లేశం, నాగవేల్లి లక్ష్మయ్య,మెట్టు లక్షమ్మ,సిర్పంగి స్వప్న,బాబు తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు రావలసిన పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే విడుదల చేయాలి : కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్ రావు

అసంఘాటీత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు నూతనంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తంబు విధానని రద్దుచేసి పాత పద్ధతినే గుర్తింపు కార్డులు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘo రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్ రావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని తాపీ సంఘం భవన ప్రారంభోత్సవానికి రత్నాకర్ రావు మరియు ఎండీ ఇమ్రాన్ ముఖ్యఅతిథిగా హాజరై శిలా పలకాలను ఆవిష్కరించి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ చాలామంది కార్మికులకు రేషన్ కార్డులు లేనందున నూతన లేబర్ కార్డులు రావడం లేదని కావున ప్రభుత్వ వెంటనే నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని, 60 ఏళ్ళు వయస్సు పైబడిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ మరియు ఇతర బెనిఫిట్ బకాయిలను వెంటనే ఇవ్వాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికుల అడ్డాల వద్ద అన్ని మౌలిక వసతులు ప్రధానంగా షెల్టర్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, ప్రమాదంలో మరణించిన భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి రూ.10లక్షలు, సహజ మరణం పొందితే రూ.5 లక్షలు, పెండ్లి కానుక ఒక లక్షకు పెంచాలని, పిల్లల చదువుకు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, నాయకులు దాసరి లక్ష్మయ్య, పోచంపల్లి మండల అధ్యక్షులు చేరాల లింగయ్య, ఉపాధ్యక్షులు దేవిగారి బాలయ్య, ప్రధాన కార్యదర్శి కొత్త నరేష్, సహాయ కార్యదర్శి రామచర్ల సందయ్య, కోశాధికారి పోతగళ్ల బాలరాజు మరియు మాజీ మండల అధ్యక్షులు పొన్నమోని ఎట్టయ్య, చేరాల పెద్ద నర్సింహా, పెద్దల యాదయ్య, ఇబ్రహీంపట్నం అంజయ్య, చెరుకు నరసింహ, సలహాదారులు చీరాల చిన్న నరసింహ, కొండమడుగు బాలయ్య, గోరికంటి బాలయ్య, జక్కి రమేష్, గుర్రు దానయ్య, నాయకులు కొండమడుగు మైసయ్య, పొన్నమోని శ్రీశైలం, చేరాల రాజయ్య, చేరాల యాదయ్య, తదితర 100 మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.


గోపరాజు పల్లి లో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని పాల సెంటర్ నుండి మూసీ నది వరకు రోడ్డు మంజూరు చేస్తామని ,పాల సెంటర్ నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వరకు కరెంటు స్తంభాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ నూతి రమేష్ రాజ్ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి ,గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి, పెద్ద గొల్ల సారి గొల్ల ఏనుగుల బచ్చయ్య ,మంటిపల్లి రామకృష్ణ, యాదవ సంఘం సభ్యులు, పుల్లపు శేఖర్ , ఏనుగుల మత్స్యగిరి, ఏనుగుల లింగయ్య, నీలం బాబురావు , పులగూర్ల కొండల్ రెడ్డి , ఏనుగుల నరసింహ, పోలబోయిన సత్తయ్య, దొండ లింగయ్య, ఏనుగుల మత్స్యగిరి ,మల్లేష్, ఏనుగుల విష్ణు, మంటిపల్లి నరేష్, ఏనుగుల కిరణ్, గ్రామస్తులు, భక్తులు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.