మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక మీ లివర్లు సేఫ్....
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక మీ లివర్లు సేఫ్..
పరిష్కారం కనిపెట్టిన శాస్త్రవేత్తలు
మద్యం తాగడం హానికరమని ఆ మందు సీసాల మీదనే ఉంటుంది. అయినా గానీ మందుబాబులు పట్టించుకోరు. తెగ తాగుతా ఉంటారు. లివర్లు కొట్టేస్తాయన్న భయం కూడా ఉండదు. అయితే ఎంత తాగినా గానీ లివర్ కేమీ కాకుండా శాస్త్రవేత్తలు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. మందుబాబులకు తమ లివర్ల గురించి బెంగ లేకపోయినా.. కుటుంబ సభ్యులకు ఉంటుంది కాబట్టి వారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. మందు తాగినా కూడా లివర్ కి ఏమీ జరక్కుండా ఉండేలా ఒక జెల్ ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం దీని మీద పరిశోధన మొదలుపెట్టారు. ఈ జెల్ ని ఎలుకల మీద ప్రయోగించారు.
కొన్ని ఎలుకలకు యాంటీ ఇన్ టాక్సికెంట్ జెల్ ని.. కొన్నిటికి నానో జెల్ ని ఇచ్చారు. కొన్ని ఎలుకలకు మాత్రం జెల్ ఇవ్వలేదు. అనంతరం అన్ని ఎలుకలకు ఒక డోస్ ఆల్కహాల్ పోశారు. జెల్ ఇవ్వని ఎలుకల రక్తంతో పోలిస్తే.. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలోనే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే జెల్ ఆల్కహాల్ పర్సంటేజ్ ని తగ్గిస్తుందని వారి ప్రయోగంలో తేలింది. అంతేకాదు.. జెల్ తీసుకున్న ఎలుకల లివర్ మీద పెద్ద ప్రభావం కూడా పడలేదని గుర్తించారు. త్వరలోనే ఈ జెల్ ని మనుషుల మీద కూడా ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం కూడా ఫలిస్తే.. త్వరలోనే మందుబాబుల కోసం మార్కెట్లోకి ఈ జెల్ ని వదులుతామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మందు తాగితే ఏమవుతుంది?:
మందు తాగిన తర్వాత అది కడుపు లోపల పేగుల్లో పై పొర మ్యూకస్ మెంబ్రేన్ నుంచి రక్తంలో కలిసి ఆ తర్వాత లివర్ లో కలుస్తుంది. లివర్ లో హార్మోన్స్ జరిపే రసాయన చర్యల వల్ల మందు తొలుత హాని చేసే ఎసిటాల్డిహైడ్ గా మారుతుంది. ఆ వెంటనే ఎసిటిక్ యాసిడ్ గా మారుతుంది. దీని వల్ల శరీరానికి పెద్దగా హానికరం కాదు కానీ.. రసాయన చర్య అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ చర్య వల్ల శరీరానికి హాని చేసే ఎసిటాల్డిహైడ్ చాలా తక్కువ సమయంలోనే హాని చేయని ఎసిటిక్ యాసిడ్ గా మారుతుంది. అయినప్పటికీ ఈ తక్కువ సమయంలోనే ఎసిటాల్డిహైడ్ లివర్ కు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ఈ తక్కువ సమయంలో కనుక ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ కడుపులో పడితే ఈ రియాక్షన్ నెమ్మదిగా జరుగుతుంది. ఈ కారణంగా ఎసిటాల్డిహైడ్ ప్రభావంతో కిక్ ఎక్కుతుంది. అదే టైంలో లివర్ తో పాటు శరీరంలో ఉన్న మిగతా అవయవాలు కూడా ఆల్కహాల్ ప్రభావానికి గురవుతాయి.
ఈ జెల్ ఎలా పని చేస్తుంది?:
అయితే ఆల్కహాల్ తీసుకునే ముందు నానో ప్రోటీన్స్ తో తయారైన ఈ నానో జెల్ ని తీసుకుంటే.. శరీరంలోని పేగుల లోపల ఒక పొరలా ఏర్పడుతుంది. ఈ జెల్ జీర్ణం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. దీంతో ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలో కలిసే ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. అదే సమయంలో ఈ జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. ఇది ఆల్కహాల్ ను రక్తం నుంచి లివర్ లో చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ గా ఏర్పడకముందే.. పేగుల్లో ఉండగానే దాన్ని మడత పెట్టేస్తుంది. అంటే ఆల్కహాల్ ని హాని చేయని ఎసిటిక్ యాసిడ్ గా మార్చేస్తుంది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఆల్కహాల్ రక్తంలో కలిసినా లివర్ పై పెద్దగా ప్రభావం చూపించదు. దీని వల్ల మందుబాబులకు కిక్ ఎక్కదు. లివర్ తో పాటు శరీరంలో మిగతా అవయవాలు కూడా సురక్షితంగా ఉంటాయి.
ఈ జెల్ ని స్విట్జర్లాండ్ లోని జురిచ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇందులో గోల్డ్ నానో పార్టికల్స్, గ్లూకోజ్, వే ప్రోటీన్ నుంచి వచ్చే నానో ఫైబర్స్ ఉంటాయి. ఇవి ఐరన్ అణువులతో కప్పబడి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్ తో జరిగే రసాయన చర్యకు ఈ ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పని చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఉత్పత్తి చేస్తాయి. నిజానికి మందు తాగకపోవడమే మంచిది. కానీ మేము తాగకుండా ఉండలేము అనేవారికి మాత్రం ఈ జెల్ దివ్యౌషధంలా పని చేస్తుంది. మరి మందుబాబుల కోసం శాస్త్రవేత్తలు జెల్ ని కనిపెట్టడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.


 
						



 చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. ఢీకొట్టాక చెలరేగిన మంటలు.. ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం.. టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్, నలుగురు బస్సు ప్రయాణికులు సజీవదహనం.. 32 మందికి తీవ్ర గాయాలు..
చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. ఢీకొట్టాక చెలరేగిన మంటలు.. ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం.. టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్, నలుగురు బస్సు ప్రయాణికులు సజీవదహనం.. 32 మందికి తీవ్ర గాయాలు..
 ఏపీలో తుది పోలింగ్ శాతం ప్రకటించిన ఈసీ
ఏపీలో తుది పోలింగ్ శాతం ప్రకటించిన ఈసీ హైదరాబాద్: దేశంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు.. కాంగ్రెస్, బీజేపీలోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళితే ఆ పార్టీ ఉండదు.. రేపటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతాం.. రుణమాఫీ, విద్యాశాఖపై ఫోకస్ పెడతాం.. అన్ని హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తాం.. త్వరలో బ్యాంకర్లతో సమావేశం.. రుణమాఫీపై చర్యలు చేపడతాం.. రైతుల రుణాల మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.. తెలంగాణలో మేము 13 సీట్లు గెలుస్తున్నాం. -మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి.
హైదరాబాద్: దేశంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు.. కాంగ్రెస్, బీజేపీలోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళితే ఆ పార్టీ ఉండదు.. రేపటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతాం.. రుణమాఫీ, విద్యాశాఖపై ఫోకస్ పెడతాం.. అన్ని హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తాం.. త్వరలో బ్యాంకర్లతో సమావేశం.. రుణమాఫీపై చర్యలు చేపడతాం.. రైతుల రుణాల మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.. తెలంగాణలో మేము 13 సీట్లు గెలుస్తున్నాం. -మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు.. ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. కోర్టు విచారణకు కవితను వర్చువల్‌గా హాజరుపర్చిన తీహార్ జైలు అధికారులు.. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ.. ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని 20న విచారిస్తామన్న జడ్జి.
ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు.. ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. కోర్టు విచారణకు కవితను వర్చువల్‌గా హాజరుపర్చిన తీహార్ జైలు అధికారులు.. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ.. ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని 20న విచారిస్తామన్న జడ్జి. తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ 
 
 ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర తీవ్రంగా గాయపడగా, ఆమెను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కుటుంబ సభ్యులు, డ్రైవర్ గాయపడ్డారు. ధారావాహికలు ‘త్రినయని’ , ‘నిన్నే పెళ్లాడుతా’ సీరియల్స్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పవిత్ర మృతిపై జీ తెలుగు విచారం వ్యక్తం చేసింది. ‘‘తిలోత్తమగా ఇంకెవరినీ ఊహించుకోలేం. పవిత్రా జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర తీవ్రంగా గాయపడగా, ఆమెను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కుటుంబ సభ్యులు, డ్రైవర్ గాయపడ్డారు. ధారావాహికలు ‘త్రినయని’ , ‘నిన్నే పెళ్లాడుతా’ సీరియల్స్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పవిత్ర మృతిపై జీ తెలుగు విచారం వ్యక్తం చేసింది. ‘‘తిలోత్తమగా ఇంకెవరినీ ఊహించుకోలేం. పవిత్రా జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఓటు హక్కును వినియోగించుకోండి సమర్థులను ఎన్నుకోండి
ఓటు హక్కును వినియోగించుకోండి సమర్థులను ఎన్నుకోండి
 
May 16 2024, 17:12
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
33.4k