/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతాబెనర్జీ Yadagiri Goud
హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతాబెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. శనివారం తృణముల్‌ కాంగ్రెస్‌ అసన్‌సోల్ లోక్‌సభ అభ్యర్ధి శతృఘ్న సిన్హా మద్దతుగా రోడ్ షోతో పాటు అసన్‌సోల్, కుల్టీలలో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించనున్నారు..

అయితే దీదీ ఇందుకోసం దుర్గాపూర్ నుంచి అసన్‌సోల్‌కు వెళ్లేందుకు హెలికాఫ్టర్‌ ఎక్కారు.హెలికాఫ్టర్‌ లోపలికి ఎక్కిన తర్వాత కాలు జారీ పడ్డారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాల నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..

సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం నేత‌లు భేటీ..

తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణా లు ఆసక్తిగా మారుతున్నా యి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది.

ఈ నేఫథ్యంలో ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ కావడం హాట్ టాపిక్ అయింది.ఇవాళ‌ సీఎం నివాసంలో ముఖ్య మంత్రి సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు భేటీ అయ్యారు.

ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది....

నేడు బిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీ కగా అవతరించి యావత్‌ దేశాన్ని తనవైపు చూసేలా చేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌ పార్టీది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 23 ఏళ్ల క్రితం జలదృశ్యంలో పురుడు పోసుకున్న బిఆర్‌ఎస్‌ పార్టీ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల ఫలి తంగా తన లక్ష్యాన్ని ముద్దాడటం ఓ అపూర్వ ఘట్టం.

23 ఏళ్ల ప్రస్థానంలో దాదా పు 14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరా టం సాగించి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన బిఆర్‌ ఎస్‌, రాష్ట్ర ఆవిర్భావఅనం తరం తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొమ్మిది న్నరేళ్ల పాటు అధికారంలో కొనసాగింది.

ఆ స్వల్పకాలంలోనే పరిపా లనలో అనేక మార్పులను చేసి చూపించింది. పార్టీ చీఫ్ కేసీఆర్ అసమాన వ్యూహ చతురత, అద్వితీయ కార్యదీక్షగల కేసీఆర్‌ చేతిలో బిఆర్‌ఎస్‌ పదిలంగా పదునెక్కి ముందుకు సాగుతుంది. 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో ఎగురవేసిన గులాబీ జెండా 23 ఏళ్లు పూర్తిచేసుకొని 24వ ఏట అడుగు పెడుతుంది.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష లు, అస్తిత్వమే ప్రాతిపది కగా ఏర్పడిన బిఆర్‌ఎస్‌ అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ అనేక సంచలనాలకు కేంద్రబిం దువైంది‌. చెల్లాచెదురుగా ఉన్న తెలంగాణ సమాజా న్ని ఏకం చేసి స్వరాష్ట్ర సమరంలో భాగస్వాము లను చేసింది.

దేశ రాజకీయాల్లో తమకు ఎదురేలేదని చెప్పుకునే కాంగ్రెస్‌.... పరాజయ భారాలతో బిక్కచచ్చిపో యిన వేళ.., 2004లో బిఆర్‌ఎస్‌తో పెట్టుకున్న పొత్తే ఆ పార్టీకి ప్రాణం పోసింది. 2009 డిసెంబర్‌ 9 ప్రకటనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీఆర్ఎస్ కృషితో పాటు... కేసీఆర్ స్థిర నిర్ణయాలు కారణ మయ్యాయి.

2001లో కరీంనగర్‌లో నిర్వ హించిన సింహగర్జన బహి రంగసభ నుంచి, 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ మహాగర్జన దాకా తెలంగా ణలోని దాదాపు ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ డివిజన్‌ లోనూ కేసీఆర్‌ నిర్వహిం చిన బహిరంగ సభ లెన్నో. బస్తీబాట, పల్లెనిద్ర, తండా నిద్రా ఇలా అనేక రూపాల్లో దాదాపు 14 ఏళ్ల పాటు అవిశ్రాంత పోరాటం సాగించారు.

ఏపీలో భానుడి ఉగ్రరూపం

ఏపీలో భానుడి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఈవాళ రాష్ట్రంలోని 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 183 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది.

శ్రీకాకుళం 15, విజయనగరం 22, పార్వతీపురం మన్యం 13, అల్లూరిసీతారామరాజు 3, అనకాపల్లి 6, తూర్పుగోదావరి 2, ఏలూరు 2 కాకినాడ ఒక మండలంలో విజయవాడ 12. నందిగామ 2. తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు.

13 రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్

లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది.. ఈ విడత లో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ను నిర్వహించను న్నారు.

వాస్తావానికి 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వ హించాల్సి ఉండగా 88 స్థానాల్లోనే పోలింగ్ జ‌రుగు తోంది. ఎందుకంటే.. మధ్య ప్రదేశ్‌లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలవి ఏప్రిల్ 9న చనిపో యారు.

దీంతో అక్కడ జరగాల్సిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశకు మే 7వ తేదీకి వాయిదా వేసింది. .

పొలింగ్ స‌మ‌యం పెంపు ..

ఎండలు, వడగాలుల ప్రభా వం ఎక్కువగా ఉన్నందున బీహార్‌లోని పలు స్థానాల పరిధిలో పోలింగ్ సమయా న్ని పెంచుతున్న‌ట్టు ఈసీ తెలిపింది. బంకా, ఖగారి యా, ముంగేర్, మాధేపురా స్థానాల పరిధిలోని సమ స్యాత్మక ప్రాంతాల్లో సాయం త్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని తొలుత భావించారు.

అయితే.. ఎండల కార‌ణం గా ఓటర్ల సౌకర్యం కోసం ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6గంటల వరకు పొడిగిం చారు. ముంగేర్‌లోని 230 పోలింగ్ స్టేషన్లు, ఖగేరియా లోని 299, మాధేపురాలోని 207, బంకాలోని 363 పో లింగ్ స్టేషన్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది...

నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు..

వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతు న్నారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వ హిస్తూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థి స్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించను న్నారు. పెద్ద శంకరంపేటలో ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొన నున్నారు. ఇందుకోసం ఇప్పటికే స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

ముఖ్యమంత్రి రాక సంద ర్భంగా పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు...

నేడు తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన

నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ఖడ్ రాను న్నారు. ఉపరాష్ట్రపతి శంషాబాద్ విమానాశ్ర యానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించ నున్నారు.

దీంతో ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండ నున్నాయి.

ఈ సందర్భంగా శంషాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్‌ పరిధి లోని నందిగామ పరిసరాల్లో ఇవాల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.నేడు మధ్యాహ్నం నుంచి సాయం త్రం 6 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయ ని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

వివిధ విభాగాల అధికా రులు సమన్వయంతో పని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పటిష్ఠమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు, వైద్య సౌకర్యాలు కల్పించ డంతో పాటు రోడ్ల మరమ్మ తులు చేపట్టారు.

నందిగామ పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను గొల్లపల్లి టోల్‌గేట్‌ వయా పెద్దగోల్కొండ మీదు గా ఇండియన్‌ బేకరీ తొండు పల్లి, బుర్జుగడ్డ వద్ద యూట ర్న్‌ తీసుకొని ముచ్చింతల్‌, మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు, అమీర్‌పేట్‌, తిమ్మాపూర్, షాద్‌నగర్‌ మీదుగా మళ్లిస్తారు...

తెలంగాణ టెట్‌ పరీక్షకు ఎన్నికల గండం: షెడ్యూల్‌ మార్పుకు ఛాన్స్‌ఉందా?

తెలంగాణలో టీచర్‌ ఎలిజి బిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తేదీలు కూడా ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం మే 20 నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి.

ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తామ ని విద్యాశాఖ పేర్కొంది. ఇక జూన్‌ 12న టెట్‌ 2024 ఫలితాలు కూడా ప్రకటి స్తామని షెడ్యూల్‌లో పేర్కొం ది. దీంతో నిరుద్యోగులు టెట్‌ ప్రిపరేషన్‌లో మునిగి పోయారు.

అయితే సార్వత్రిక ఎన్నికల గండం గడిచినా. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం టెట్ పరీక్షపై పడుతుందేమోనని పలువురు నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ గురువారం (ఏప్రిల్‌ 25) విడుదలైంది.

మే 27న ఉప ఎన్నిక పోలిం గ్‌ జరగనున్నట్లు షెడ్యూల్‌ పేర్కొంది. ఈ క్రమంలో మే 20 నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటించడంతో అసలు ఆయా తేదీల్లో పరీక్షలు ఇంటాయో.. లేదోనని అభ్యర్ధులు గందరగోళంలో పడ్డారు.

మే 27న పోలింగ్‌ కాబట్టి ఆ రోజు ఆయా జిల్లాల్లో సాధా రణ సెలవుగా ప్రకటిస్తారు. టెట్‌ పరీక్షకు హాజరయ్యే వారంతా పట్టభద్రులు కావడంతో వీరంతా తమ ఓటు హక్కును వినియోగిం చుకోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలోనే టెట్‌ పరీక్ష ల నిర్వహణ సాధ్యా సాధ్యా లపై పాఠశాల విద్యాశాఖ తర్జనభర్జనలు పడుతుంది. తెలంగాణ టెట్‌ పరీక్షలు మే 20 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహిస్తామని చెప్పిన ప్పటికీ ఏ తేదీన ఏ పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తామనే విష యం మాత్రం ఇప్పటివరకు విద్యాశాఖ వెల్లడించలేదు.

అయితే ఉప ఎన్నికల నేపథ్యంలో పేపర్ల వారీగా పరీక్షల నిర్వహణ తేదీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆ ప్రకారంగా పోలింగ్‌ రోజున పరీక్షలు జరపకుండా మిగతా రోజు ల్లో యథావిథిగా జరిగేలా షెడ్యూల్‌ రూపొం దించే అవకాశం ఉన్నట్లు సమా చారం. ఇందుకు సంబం ధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పులు మ్యాచ్ అవుతాయా? నేడు సుప్రీంకోర్టు తీర్పు

100% ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ఓట్లు మరియు ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) స్లిప్‌లను 100% క్రాస్ చెక్ చేయాలన్న డిమాండ్‌పై లోక్‌సభ ఎన్నికల రెండో దశ ఓటింగ్ కొనసాగుతోంది ఇదిలావుండగా, జూన్ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జరిగేటప్పుడు ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్‌లు సరిపోతాయా లేదా అనేదానిపై సుప్రీంకోర్టు ఈరోజే నిర్ణయం తీసుకోనుంది. EVM మరియు VVPAT స్లిప్‌లను సరిపోల్చాలని డిమాండ్ చేస్తూ చాలా సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయని మీకు తెలియజేద్దాం. ఏప్రిల్ 24న ఈ కేసు విచారణ అనంతరం కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది.

ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీపీఏటీ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లలో (ఈవీఎం) వేసిన ఓట్లను తప్పనిసరిగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించనుంది . ఈ బెంచ్‌లో జస్టిస్ దీపాంకర్ దత్తా కూడా ఉన్నారు. ఈవీఎంల పనితీరుకు సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలపై స్పష్టత ఇవ్వాలంటూ భారత ఎన్నికల సంఘం అధికారిని బుధవారం అంతకుముందు కోర్టు సమన్లు ​​జారీ చేసింది.

ఈ పిటిషన్లపై విచారణ జరిపి ఎన్నికల సంఘం నుంచి స్పష్టత ఇవ్వడంతో సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. వీవీప్యాట్ స్లిప్పుల ద్వారా ఈవీఎం ఓట్లను 100 శాతం వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛత ఉండాలని గత విచారణలో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు చెప్పింది.

బుధవారం తీర్పును రిజర్వ్ చేస్తూ, ఎన్నికలను నియంత్రించలేమని, రాజ్యాంగ సంస్థకు నియంత్రణ అధికారంగా వ్యవహరించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తప్పు చేసిన వ్యక్తి పర్యవసానాలను ఎదుర్కోవడానికి చట్టం కింద నిబంధనలు ఉన్నాయి. కేవలం అనుమానం ఆధారంగా కోర్టు మాండమస్‌ మంజూరు చేయదు. ఓటింగ్ యంత్రాల ప్రయోజనాలను అనుమానించే వారి ఆలోచనా విధానాన్ని మార్చలేమని, బ్యాలెట్‌లోకి తిరిగి రావాలని న్యాయస్థానం పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు..

వచ్చే మూడు రోజులు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు.. 

రాయలసీమ, కోస్తాంధ్రలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు.. 

ఈరోజు ఏపీలో 56 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 

తెలంగాణలో పలు జిల్లాల్లో వడగాలులు.. 

రామగుండం, భద్రాచలంలో అధిక ఉష్ణోగ్రతలు