నేడు బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీ కగా అవతరించి యావత్ దేశాన్ని తనవైపు చూసేలా చేసిన చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 23 ఏళ్ల క్రితం జలదృశ్యంలో పురుడు పోసుకున్న బిఆర్‌ఎస్ పార్టీ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల ఫలి తంగా తన లక్ష్యాన్ని ముద్దాడటం ఓ అపూర్వ ఘట్టం.
23 ఏళ్ల ప్రస్థానంలో దాదా పు 14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరా టం సాగించి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన బిఆర్ ఎస్, రాష్ట్ర ఆవిర్భావఅనం తరం తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొమ్మిది న్నరేళ్ల పాటు అధికారంలో కొనసాగింది.
ఆ స్వల్పకాలంలోనే పరిపా లనలో అనేక మార్పులను చేసి చూపించింది. పార్టీ చీఫ్ కేసీఆర్ అసమాన వ్యూహ చతురత, అద్వితీయ కార్యదీక్షగల కేసీఆర్ చేతిలో బిఆర్‌ఎస్ పదిలంగా పదునెక్కి ముందుకు సాగుతుంది. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో ఎగురవేసిన గులాబీ జెండా 23 ఏళ్లు పూర్తిచేసుకొని 24వ ఏట అడుగు పెడుతుంది.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష లు, అస్తిత్వమే ప్రాతిపది కగా ఏర్పడిన బిఆర్‌ఎస్ అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ అనేక సంచలనాలకు కేంద్రబిం దువైంది. చెల్లాచెదురుగా ఉన్న తెలంగాణ సమాజా న్ని ఏకం చేసి స్వరాష్ట్ర సమరంలో భాగస్వాము లను చేసింది.
దేశ రాజకీయాల్లో తమకు ఎదురేలేదని చెప్పుకునే కాంగ్రెస్.... పరాజయ భారాలతో బిక్కచచ్చిపో యిన వేళ.., 2004లో బిఆర్‌ఎస్‌తో పెట్టుకున్న పొత్తే ఆ పార్టీకి ప్రాణం పోసింది. 2009 డిసెంబర్ 9 ప్రకటనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీఆర్ఎస్ కృషితో పాటు... కేసీఆర్ స్థిర నిర్ణయాలు కారణ మయ్యాయి.
2001లో కరీంనగర్‌లో నిర్వ హించిన సింహగర్జన బహి రంగసభ నుంచి, 2010 డిసెంబర్ 16న వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ మహాగర్జన దాకా తెలంగా ణలోని దాదాపు ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ డివిజన్ లోనూ కేసీఆర్ నిర్వహిం చిన బహిరంగ సభ లెన్నో. బస్తీబాట, పల్లెనిద్ర, తండా నిద్రా ఇలా అనేక రూపాల్లో దాదాపు 14 ఏళ్ల పాటు అవిశ్రాంత పోరాటం సాగించారు.
Apr 27 2024, 13:38