చిత్తుగా చిత్తుగా ఓడిన గుజరాత్
నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌ను ఢిల్లీ మట్టికరి పించింది. ముందుగా బౌలిం గ్ ధాటితో కుప్పకూల్చిన ఢిల్లీ.. ఆ తర్వాత అవలీ లగా టార్గెట్‌ను చేధించింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభం నుంచే ఢిల్లీ షాకులు ఇస్తూ వచ్చింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటర్లు చతికి లబడ్డారు. ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు.
ఒక్క రషీద్ ఖాన్ (31) మాత్రమే జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించా డు. కానీ అప్పటికే జట్టు మొత్తం విఫలం కావడంతో 89 పరుగుల వద్దనే గుజ రాత్ ఆగిపోయింది. దీంతో 90 పరుగుల అత్యల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు మధ్యలో తడబడినప్పటికీ 8.5 ఓవర్లలోనే అవలీలగానే టార్గెట్‌ను చేధించారు.
గుజరాత్ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌లోనే ఓపెనర్ శుభ్ మన్ గిల్ (8) ఔటవ్వగా.. నాలుగో ఓవర్‌లో ఐదో బంతికి మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో ఓవర్‌లో మొదటి బంతికి సాయి సుదర్శన్ (12) రనౌటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మిల్డర్ (2) కూడా రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొమ్మిదో ఓవర్‌లో అభినవ్ మనోహర్ (8), షారుక్ ఖాన్ (0)ను రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు. 12వ ఓవర్‌లో రెండో బంతికి రాహుల్ తెవాటియా (10) ఎల్బీడ బ్ల్యూగా వెనుది రిగాడు.
15వ ఓవర్‌లో చివరి బంతికి మోహిత్ శర్మ (2).. సుమిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. 18వ ఓవర్‌లో మొదటి బంతికే రషీద్ ఖాన్ (31) పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఫలితంగా 17.3 ఓవర్ల వద్ద 89 పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయ్యింది.
అత్యల్ప టార్గెట్‌ను చేధిం చేందుకు క్రీజులోకి ముందు గా వచ్చిన జెక్ ఫ్రేజర్ (20) దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. అతనికి పృథ్వీ షా ( 7) తోడయ్యా డు. కానీ జెక్ ఫ్రేజర్ దూకు డుకు స్పెన్సర్ జాన్సన్ చెక్ పెట్టాడు. ఫ్రేజర్ ఔటయిన కాసేపటికే పృథ్వీ షా కూడా పెవిలియన్‌కు పంపించారు.
ఆ తర్వాత కాసేపటికే గుజరాత్ బౌలర్లు అభిషేక్ పొరెల్ (15 ), షై హోప్ (19) వికెట్లను తీసి ఢిల్లీని టెన్షన్ పెట్టాలని అనుకున్నారు. కానీ రిషబ్ పంత్(16), సుమిత్ కుమార్ (9) నిలకడగా ఆడుతూ టార్గెట్‌ను చేధించారు...
Apr 18 2024, 09:04