రాబోయే ఎన్నికల్లో ఫాసిస్టు బిజెపిని ఓడిద్దాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం: డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్
భువనగిరి: ఈ దేశం మూలవాసులైన దళితులపై దాడులను తీవ్రతరం చేసిన బిజెపిని రాబోయే ఎన్నికల్లో ఓడిద్దామని డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి( డి హెచ్ పి ఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ సమావేశం సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో కాశపాక దయాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ బిజెపి మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చాక దేశంలో మత సామరస్యం తీవ్రంగా దెబ్బతింది. దళితుల పైన దాడులు పెరిగినాయి. లౌకిక దేశాన్ని హిందూ రాజ్యాంగ మార్చడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతుంది.ప్రజలలో మత ప్రతిపాదికన చీలికలు తెచ్చి మతం ప్రజల వ్యక్తిగత జీవితాల నుండి రాజకీయాల్లోనికి చొరబడడం మూలంగా ఇది ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం. అంతేగాక మోడీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని తన గుప్పట్లోకి తీసుకుంది. స్వతంత్ర న్యాయవ్యవస్థ అస్తిత్వం కూడా ప్రమాదంలో పడింది. ఆర్ఎస్ఎస్ కన్ను సన్నుల్లోని బిజెపి పదేండ్ల పరిపాలనలో దేశం సరిహద్దు ఉద్రిక్తతలు, దేశంలోపల మత విద్వేషాలు, గ్రామాల్లో కుల ఘర్షణలు మినహా బిజెపి దేశ ప్రజలకు చేసింది ఈ సమంతా మేలు జరగలేదు. పైగా దేశ ప్రజలందరి గుండెకాయ లాంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి పూనుకుంది. రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ఒక పథకం ప్రకారంగా సకల ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ దేశంలో ప్రేరేపిస్తూ దేశంలో మత చిచ్చు రేపుతున్న మతోన్మాదులను వారి ఆలోచన విధానాలను వారి వల్ల ఈ దేశానికి జరిగేటువంటి నష్టాన్ని ప్రజలందరూ గమనించాలి.ఒకవైపు హిందూ రాష్ట్ర హిందువుల కోసం అని ప్రచారం చేస్తూ దేశమంతగా కార్పొరేటీకరణను వేగవంతం చేయడం హిందుత్వ ఫాసిస్టుల వ్యూహం. అందుకే దేశంలోని సమస్త ప్రజల సంపద కార్పొరేట్ల పరం అవుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా పబ్లిక్ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ పేరుతో అమ్మి వేస్తున్నారు. ఈ దేశ ప్రాకృతిక వనరుల మీద ఎటువంటి అధికారం ఉండదు. ఇవన్నీ పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తుల సంపదను పెంచడానికే తప్ప సాధారణ ప్రజల కోసం కాదు అని అన్నారు.
దేశంలో 20% దళితులు ఉండగా వారికి బడ్జెట్లో కేటాయింపులు 20 శాతం ఎందుకు కేటాయించట్లేదని విమర్శించారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై 300 రేట్లు దాడులు పెరిగాయన్నారు బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితులు అభద్రతలో జీవిస్తున్నారన్నారు.బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఖాయమన్నారు మతాన్ని దేవుడిని రాజకీయాల్లోకి జొప్పించి రాజకీయాల్ని కలుషితం చేయడం విద్వేషాలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం వంటి కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నారని విమర్శించారు బిజెపి పాలనలో దళితులు గిరిజనులు మహిళలు ఆదివాసీలకు ఏమాత్రం రక్షణ లేదన్నారు రాజ్యాంగ రక్షణకు బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాస్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాశపాక దయాకర్, ఎర్రోళ్ల లింగస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సిలిగంజి వీరస్వామి,
ఎల్లంకి మహేష్, ఉప్పుల శాంతి కుమార్,ఇంజా హేమలత,కొమ్ము బాలు నరసింహ, చుక్క చంద్రశేఖర్, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Apr 07 2024, 17:44