ఈనెల 12, 13న యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఎఫ్ఐ నాల్గవ మహాసభ జయప్రదం చేయండి: ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు
భువనగిరిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో SFI భువనగిరి మండల మహాసభ కుక్కుట్ల శివాని అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, ఈ మహాసభకు ముఖ్య అతిథిగా SFI జిల్లా కార్యదర్శి వనం రాజు హాజరై మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి పోసిన ఆంధ్ర మహాసభకు కేంద్రమైన భువనగిరి పట్టణంలో ఈనెల 12 13 తేదీల్లో SFI యాదాద్రి భువనగిరి జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించుకుంటున్నాం,* కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లను, ఫెలోషిప్ వెంటనే విడుదల చేయాలి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అవకాశవాద రాజకీయాలను ఓడించాలి,
అదేవిధంగా మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బిజెపిని ఓడగొట్టే విధంగా విద్యార్థులందరూ ఏకం కావలసిన పరిస్థితి ఉందని , బిజెపి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత విద్యను పూర్తిగా కాషాయకరణ, విద్యను ధ్వంసం చేయడం జరిగింది. విద్య అనేది అంగట్లో సరుకుగా మారింది అదేవిధంగా గత టిఆర్ఎస్ పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించింది,అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది విద్యారంగం అభివృద్ధి చెందే వారి పాలన విధానం కనబడుటలేదు, పెండింగ్లో ఉన్న 7200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, పెంచిన మెస్ కాస్మోటీ ఛార్జ్ లను వెంటనే అమలు చేయాలని, అద్దె భవనంలో ఉన్న హాస్టల్ లను సొంత బిల్డింగ్ను ఏర్పాటు చేసి నూతన గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని , విద్యారంగ సమస్యలను పరిష్కరించేలా విద్యార్థులకు సన్నగా చేయడం కోసం ఈ మహాసభలు ఎంతో తోడ్పడతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో GMPS జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ SFI జిల్లా ఉపాధ్యక్షులు లావుడియా రాజు SFI మండల నాయకులు అన్నంపట్ల రమణ, కుకుట్ల శివాని, మోటే శంకర్, సల్మాన్ ముద్దంనాగరాజు,ముద్ధంమహేష్, జన నితిన్, హరిగే మని,వంశీ, తదితరులు పాల్గొన్నారు.
Apr 03 2024, 17:16