మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి ఇద్దరం పోటీ చేద్దామా? మాజీ మంత్రి కేటీఆర్
లోక్ సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ మల్కాజిగిరి ఎంపీ సీటుపై రాజకీయం గరం గరం అయింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా.. రేవంత్ రెడ్డి సీఎం పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అన్నారు.
ఇద్దరం మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలో పోటీ చేద్దాం.. సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దామని కెటిఆర్ సూచించారు. మీ సిట్టింగ్ సిట్ మల్కాజ్ గిరిలో పోటీ చేసి తేల్చుకుందాం అని సవాల్ విసిరారు.
గతంలోనూ రేవంత్ సవాల్ చేసి పారిపోయారని కెటిఆర్ ఆరోపించారు. కొడంగల్, జిహెచ్ఎంపి ఎన్నికల్లో సవాల్ చేసి రేవంత్ పారిపోయారని ఎద్దేవా చేశారు.
సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాటకు విలువేముంది అని కెటిఆర్ ప్రశ్నించారు. కెటిఆర్‌పై రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితమే సవాల్ చేశారు. కేటీఆర్ మగాడైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు గెలిపించి చూపించాలని రేవంత్ రెడ్డి సవాలు చేశారు..ఏం జరుగుతుందో చూడాలి మరి.....
Mar 01 2024, 07:55