మరో రెండు హామీలకు సీఎం రేవంత్ రెడ్డి నేడు స్వీకారం
అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలోని హామీల్లో మరో రెండింటిని నేటి నుంచి అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
ఇవాళ సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజినీ రింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీల అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ నున్నారు.
ఇక, గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్ లభించనుంది. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ కేవలం 500రూపాయలకే ఇవ్వనున్నారు.
అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ హామీల్లో ఇప్పటికే 2 అమలు చేసింది. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాగా, రెండోది ఆరోగ్యశ్రీ లబ్దిని 5 లక్షల నుంచి 10లక్షల రూపాయ లకు పెంచింది.
రైతు భరోసా బదులు రైతు బంధును కొందరు రైతులకు ఇచ్చినా, ఆ పథకం ఇంకా పూర్తిగా అమలు కాలేదు.దీంతో ఇవాళ అమలు చేసే 2 పథకాలతో మొత్తం 4 పథకాలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేసినట్లైతుంది.
Feb 27 2024, 12:13