/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు Raghu ram reddy
సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు

రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

పదోన్నతుల ఫైల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయడంతో ఉత్తర్వులు వెలువడాయి.

ఐజీ స్టీఫెన్ రవీంద్ర కు అడిషనల్ డీజీపీగా పదోన్నతి కల్పించారు. హైదరాబాద్ క్రైమ్స్ లో డిఐజి గా పనిచేస్తున్న ఏవి. రంగనాథ్ కు, సి ఏ ఆర్ లో డిఐజిగా పనిచేస్తున్న వి.సత్యనారాయణ, రామగుండం సిపి గా పని చేస్తున్న ఎం. శ్రీనివాస్, ఎస్ఐబి చీఫ్ గా పని చేస్తున్న బడుగుల సుమతి, టూరిజం ఎండిగా పనిచేస్తున్న రమేష్ నాయుడు, ఇంటలిజెన్స్ లో డీఐజీ గా పనిచేస్తున్న కార్తికేయ లకు ఐజిగా పదోన్నతి కల్పిస్తూ యధా స్థానంలో పనిచేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు.

డీఐజీలుగా పనిచేస్తున్న న్యాలకొండ ప్రకాష్ రెడ్డి, జోయల్ డేవిస్ లకు సూపర్ టైమ్ స్కేల్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు...

Tulasi Reddy: తాలిబన్‌ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారు..

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారని, సీఎంకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వార్తలు రాసినా దాడులు చేయిస్తున్నారని, ఇంత అనాగరికమైన చర్యలకు ముఖ్యమంత్రే బాధ్యడని ఏపీసీసీ నేత తులసి రెడ్డి (Tulasi Reddy) అన్నారు..

ఈ సందర్బంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జగన్ ప్రతి పక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను చంపాలన్నారని, తరువాత తనపై విమర్శలు చేస్తే కొట్టండంటూ పిలుపు ఇచ్చారని, మొన్న చొక్కా మడత పెట్టి కార్యకర్తలను రెచ్చ గొట్టారని, తాలిబన్‌ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారని మండిపడ్డారు..

ఆంధ్రజ్యోతి (Andhrajyothy), ఈనాడు (Eenadu) విలేకరులపై దాడి హేయమైన చర్య అని, సీఎంగా ఉంటూ దాడులను ప్రోత్సహిస్తూ రెచ్చ గొడుతున్నారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అరాచక వ్యక్తిని ప్రజలు ఓడించాలని పిలుపిచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన తెలుగు భాష వైభవంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. మాతృ భాషను మృత భాషగా మారుస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో చరిత్ర కలిగిన తెలుగు భాషకు పూర్వ వైభవాన్ని తేవాలన్నారు. భవిష్యత్తు తరాలకు తెలుగులో ఉన్న కమ్మదనం గురించి చెప్పాలని, తెలుగు నేర్పమంటే... ఇంగ్లీషు వద్దా అని వాదించే మూర్ఖులు ఉన్నారని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు..

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్

పాకిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది.

సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాకిస్తాన్ ముస్లిం లీగ్ –నవాజ్ (పిఎంఎల్- నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి)ల మధ్య ఒప్పందం కుదిరింది.

ఈ మేరకు పిఎంఎల్-నవాజ్ పార్టీ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవిని, పిపిపి కో చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షతన పదవిని చేపడతారు.

దాదాపు 100కుపైగా నియోజకవర్గాల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించినా, వారు విఫలమయ్యారని షరీఫ్ చెప్పారు.

తమ సంకీర్ణ ప్రభుత్వానికి ముత్తహీద క్వామీ మూవ్ మెంట్- పాకిస్తాన్, పాకిస్తాన్ ముస్లింలీగ్, ఇష్టెకామ్ ఏ పాకిస్తాన్ పార్టీల మద్దతు ఉంటుందన్నారు...

500కే గ్యాస్ సిలిండర్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్‌పై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఈ రెండు పథకాలను త్వర లోనే ప్రారంభించ నున్నట్లు చెప్పారు.

అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.త్వరలోనే రెండు గ్యారంటీలు అమలు

అందుకు కసరత్త

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచారు. తాజాగా.. మరో రెండు గ్యారంటీల అమలకు రెడీ అయ్యారు. ఈ మేరకు రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు.

తాజాగా.. ఈ పథకాల అమలుపై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

200 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించేవారి నుంచి ఛార్జీలు వసూలు చేయబోమని చెప్పారు. గ్యాస్‌ సిలిండర్‌కు రూ.500 రాయితీ ఇస్తామని అన్నారు. అందుకు సంబంధిన కసరత్తు జరుగుతోందని త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు.

రెండు రోజుల్లో 11వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మరో రెండు రోజుల్లో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది.

దాదాపు 11 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత ప్రభుత్వం 5089 పోస్టులతో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త పోస్టులతో కలిపి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది.

ప్రభుత్వ బడుల్లో చదు వుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్ టీచర్లను కూడా ఈ నోటిఫి కేషన్ లోనే రిక్రూట్ చేయనుంది.

నేడు ఆదిలాబాద్ జిల్లా లో పర్యటించునున్న అస్సోం సీఎం

తెలంగాణ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అధిక సీట్లు గెలిచేందుకు బీజేపీ వ్యూహం ర‌చించింది. రాష్ట్రంలో బీజేపీ పెద్ద‌ల ప‌ర్య‌టన‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచా రాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మ విజ‌య సంక ల్ప‌యాత్ర‌ను ప్రారంభించ‌ నున్నారు.

భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికలకు క్షేత్రస్థాయిలో శ్రేణులను ఏకధాటిపై తేవడం కోసం, పార్టీ విధివిధానాలను, తమ వైఖరిని ప్రజల్లోకి తీసుకె ళ్లడం లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర పేరిట బస్సు యాత్రను ఇవ్వాళ బాసర పుణ్యక్షేత్రం నుండి ప్రారంభి స్తున్నారు.

అదిలాబాద్, పెద్దపెల్లి నిజాంబాద్ పార్లమెంటు స్థానాలను అనుసంధానిస్తూ 21 శాసనసభ స్థానాల్లో సుమారు 310 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర కొనసాగుతుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

కేంద్ర మంత్రి సీతారామన్ నేడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన

ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పర్యటించ‌నున్నారు.

పెనుగొండ క్షేత్రం వాసవి శాంతిధామ్ లో ఆత్మార్పణ, పంచమ వార్షికోత్సవ మహోత్సవాల్లో పాల్గొ నున్నారు.

అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం పీఎం లంకలోని డిజిటల్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని కేంద్రమంత్రి పరిశీలించనున్నారు..

గోదావరిఖని బస్టాండ్ లో ఎన్ఎస్ఎస్ వాలంటరీస్ సేవలు

గోదావరిఖని బస్టాండ్ లో ఎన్ఎస్ఎస్ వాలంటరీస్ సేవలు భేష్ అనిపించేలా ఉన్నాయి.

ప్రభుత్వ పీజి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ జహీర్ ఆధ్వ ర్యంలో లెక్చరర్ సంగీత ఆధ్వర్యం లో , ఎన్ఎస్ఎస్ కాలేజీ పిల్లలు గోదారిఖని మేడారం జాతర క్యాంప్ లో ప్రయాణికులకు ఇబ్బందు లు కలుగ కుండా వాలం టైర్లుగా సేవలు అందిస్తు న్నారు.

అంతకు ముందు డిపో మేనేజర్ నాగభూషణం, అసిస్టెంట్ మేనేజర్ గీత కృష్ణ, సంధ్యారాణి పలు విభాగాలలో సేవలు అందించాలని సూచిం చారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసి సిబ్బంది కేఆర్ రెడ్డి, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

YCP Rebel MLAs: మారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల నిర్ణయం... ఈసారి కూడా

అమరావతి : అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ కార్యాలయం ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు (YCP Rebel MLAs) స్పందించలేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే..అయితే విచారణకు హాజరుకాకూడదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే లు నిర్ణయించారు. తుది విచారణకు హాజరుకాకపోతే స్పీకర్ తీసుకునే నిర్ణయానికి బాధ్యులు అవుతారని నోటీసుల్లో పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, చానల్స్‌లో వచ్చిన విజువల్స్‌ను ఆయా సంస్థల యాజమాన్యాలు సర్టిఫై చేయాల్సి ఉందని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గత విచారణ సందర్భంగా ఆనం తన వాదనలు వినిపించారు. ఆయా సంస్థలు సర్టిఫై చేయకుండా వారిని ఎలా పరిగణలోకి తీసుకుంటారని రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు తాము హాజరుకావడం లేదని స్పీకర్ కార్యాలయానికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు సమాచారం పంపించారు.

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు సైతం..

మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో విచారణకు రాకపోవడంతో వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాలవీరంజనేయ స్వామి కోరారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్వామి విజ్ఞప్తి చేశారు.

Pawan Kalyan: పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్‌..

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు పవన్‌.. మన కూటమి అధికారంలోకి వస్తోందని స్పష్టం చేసిన ఆయన.. క్షేత్రస్థాయి నుంచి మన బలాన్ని సద్వినియోగపరుకొంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగతంగా నా గెలుపు గురించి కాదు.. సమిష్టిగా గెలుపు కోసమే తొలి నుంచి నా వ్యూహం, అడుగులు ఉంటున్నాయని తెలిపారు.. 

జనసేన కోసం తపించి పని చేసిన ప్రతీ ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌.. 2019 తర్వాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రజారాజ్యం సమయంలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తర్వాత టీటీడీ సభ్యుడిగా రెండు పర్యాయాలు పదవి ఇప్పించగలిగాను.. అప్పటికీ ఆయన మన పార్టీలోకి రాలేదని ఉదహరిస్తూ.. జనసేన కోసం నిలిచిన ఎవ్వరినీ విస్మరించేది లేదు అన్నారు. ఇప్పటి ఎన్నికల్లో స్థానాలు మాత్రమే కాకుండా కూటిమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలూ దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కావచ్చు.. పీఏసీఎస్‌ల్లో, ఇతర కీలక నామినేటెడ్‌ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయి.. తద్వారా అందరినీ బలోపేతం చేసి ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. మూడింట ఒక వంతు పదువులు దక్కించుకుందాం అన్నారు. ఏపీకి సుస్థిర పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని, అలాంటి సుస్థిర పాలన మన కూటిమి అందించగలదని ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు.. ఇక, పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణ కోసం రూ.10 కోట్లు తన స్వార్థితాన్ని నిధిగా ఇవ్వనున్నట్టు ఈ సమావేశంలో ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌