ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడి నోటీసులు
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఇవాళ నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే కవితను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈడీ తనను విచారించడపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు.
ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ జరుగు తోంది. విచారణ పూర్తి అయ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకొ వద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరుకావాలంటూ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లి లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నోటీసులు రావడం పొలిటికల్ సర్కి్ల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సీబీఐ విచారణకు కవిత హాజరు అవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది..
Feb 23 2024, 16:47