NLG: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నల్లగొండ: ఈ నెల 28 నుంచి మార్చి 19 వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం ఆయన ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇంటర్మీడియట్ కు సంబంధించి జిల్లాలో 50 పరీక్షా కేంద్రాల్లో 32,895 మంది విద్యార్థులు, 10వ తరగతికి సంబంధించి 473 పరీక్షా కేంద్రాల్లో 19,715 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పరిశుభ్రతతో పాటు, తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ కమీషనర్లు, గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో అత్యవసర మందులతో ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, పరీక్ష సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అనుకూలంగా ఉండేలా అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను మూసేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అనుమతించరాదని తెలిపారు. అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రు నాయక్, జిల్లా విద్యాధికారి భిక్షపతి, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ యూసఫ్ షరీఫ్ ఉన్నారు.







నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో, నూతనంగా ఎంపికైన ట్రైనీ కానిస్టేబుల్స్ కు 9 నెలల శిక్షణ నిమిత్తం సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుండి వచ్చిన ఏఆర్ విభాగానికి చెందిన, 203 మంది పురుష అభ్యర్థుల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ చందాన దీప్తి ముఖ్య అతిదిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వల చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.








లో భాగంగా ఇటీవల నిర్వహించిన, పలు పోటీలలో మాధవ్ నగర్ జేబీఎస్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు ఆటపాటల్లో, డ్రాయింగ్, రన్నింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచి షీల్డ్స్ మరియు ప్రత్యేకమైన బహుమతులు సాధించి, పలువురి చేత ప్రశంసలు అందుకున్నందుకు గాను, సోమవారం పాఠశాల ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం స్టూడెంట్స్ ను వారికి సహకరించిన ఉపాధ్యాయురాలు ప్రతిమ ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.



Feb 22 2024, 21:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.7k