NLG: *జీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సినిమా ప్రదర్శన*
![]()
పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను మోటివేట్ చేయడానికి గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్..12th Fail సినిమాను థియేటర్లలో ఫ్రీగా ప్రదర్శించారు. మనోజ్ కుమార్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ రియల్ స్టోరీతో రూపొందిన 12th Fail చిత్రాన్ని, నల్గొండ పట్టణంలోని నాలుగు థియేటర్లలో రెండు షోలను విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా చూపించారు. ఎన్జీ కాలేజీ, ఉమెన్స్ కాలేజీలకు చెందిన దాదాపు 2500 మంది స్టూడెంట్స్ ఈ సినిమాను చూశారు.
విద్యార్థులతో కలిసి సినిమా వీక్షించిన గుత్తా అమిత్ రెడ్డి... 12th Fail చిత్రం ఇన్‌స్పైరింగ్ జర్నీ అని అన్నారు. స్టూడెండ్స్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి బాగా కనెక్ట్ అవుతుందన్నారు. విద్యార్థుల్లో ఇన్సిపిరేషన్ నింపేందుకు ఈ చిత్రాన్ని ఉచితంగా చూపించినట్టు చెప్పారు.
12th Fail సినిమా చూసిన విద్యార్థులు ఏమోషనల్ అయ్యారు. ఇన్సిపిరేషన్ తీసుకొచ్చే ఈ సినిమాను తమకు చూపించిన గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డికి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సుంకరి రాజారామ్ కృతజ్ఞతలు తెలిపారు.




నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో, నూతనంగా ఎంపికైన ట్రైనీ కానిస్టేబుల్స్ కు 9 నెలల శిక్షణ నిమిత్తం సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుండి వచ్చిన ఏఆర్ విభాగానికి చెందిన, 203 మంది పురుష అభ్యర్థుల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ చందాన దీప్తి ముఖ్య అతిదిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వల చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.








లో భాగంగా ఇటీవల నిర్వహించిన, పలు పోటీలలో మాధవ్ నగర్ జేబీఎస్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు ఆటపాటల్లో, డ్రాయింగ్, రన్నింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచి షీల్డ్స్ మరియు ప్రత్యేకమైన బహుమతులు సాధించి, పలువురి చేత ప్రశంసలు అందుకున్నందుకు గాను, సోమవారం పాఠశాల ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం స్టూడెంట్స్ ను వారికి సహకరించిన ఉపాధ్యాయురాలు ప్రతిమ ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.









Feb 22 2024, 21:26
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
21.1k