NLG: రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
![]()
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా, ఈనెల 24వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ.. మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 24 నుండి మార్చి 14 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.
అనంతరము ఏప్రిల్ 4న పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. పట్టబద్రుల ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారంతో కూడిన జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమావేశంలో అందజేశారు. పోలింగ్ స్టేషన్ల జాబితా పరిశీలించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలుపగా అట్టి పోలింగ్ స్టేషన్ల జాబితాను ఈసీఐకి పంపనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 4 లక్షల 27 వేల 302 మంది ఓటర్లుగా నమోదు అయినట్లు ఆమె తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 600 పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, గుమ్మల మోహన్ రెడ్డి (కాంగ్రెస్), పోతేపాక లింగస్వామి (బిజెపి), బక్క పిచ్చయ్య (టిఆర్ఎస్), బి.మల్లికార్జున్ (టిడిపి), తదితరులు పాల్గొన్నారు.









లో భాగంగా ఇటీవల నిర్వహించిన, పలు పోటీలలో మాధవ్ నగర్ జేబీఎస్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు ఆటపాటల్లో, డ్రాయింగ్, రన్నింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచి షీల్డ్స్ మరియు ప్రత్యేకమైన బహుమతులు సాధించి, పలువురి చేత ప్రశంసలు అందుకున్నందుకు గాను, సోమవారం పాఠశాల ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం స్టూడెంట్స్ ను వారికి సహకరించిన ఉపాధ్యాయురాలు ప్రతిమ ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.















Feb 21 2024, 20:19
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
20.1k