TS: పెద్దల సభకు పంపించినందుకు సోనియా గాంధీకి ధన్యవాదాలు: అనిల్ కుమార్ యాదవ్
HYD: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్ మంగళవారం తన అనుచరులతో కలిసి హైదరాబాదులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆదర్శనగర్ నుండి నేరుగా అమరవీరుల స్థూపం వద్ద కు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయన తండ్రి అంజన్ కుమార్ యాదవ్ ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతరం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ బిడ్డ అయిన తనను చిన్న వయస్సు లోని పెద్దల సభకు పంపించి ఆశీర్వదించిన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సిఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అంటూ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





లో భాగంగా ఇటీవల నిర్వహించిన, పలు పోటీలలో మాధవ్ నగర్ జేబీఎస్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు ఆటపాటల్లో, డ్రాయింగ్, రన్నింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచి షీల్డ్స్ మరియు ప్రత్యేకమైన బహుమతులు సాధించి, పలువురి చేత ప్రశంసలు అందుకున్నందుకు గాను, సోమవారం పాఠశాల ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం స్టూడెంట్స్ ను వారికి సహకరించిన ఉపాధ్యాయురాలు ప్రతిమ ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.





















Feb 21 2024, 13:25
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.1k