మహా జాతరకు మేడారం ముస్తాబు
మేడారం జన గుడారంగా మారిపోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే.మాఘశుద్ధ మాసపు మంచి ఘడియలు వచ్చేస్తు న్నాయి.
ఆదివాసీ ఆచార సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే మహాజాతర కోసం మేడారం ముస్తాబైంది. వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో..మేడారం కీకార ణ్యంలో…ప్రతి రెండేళ్ల కోసారి ఈ జాతర జరుగుతుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ.. బుధవా రం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి..గోవింద రాజును గద్దెల పైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు.
మరుసటి రోజు 22వ తేదీ గురువారం సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్ర దాయాల ప్రకారం తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు.
శుక్రవారం దేవతలకు భక్తు లు మొక్కులు చెల్లించు కుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారం జనా రణ్యాంగా మారిపో తుంది.
సమ్మక్క, సారలమ్మ ఆగమనం నుంచి మొదలు కొని దేవతలను గద్దెల దగ్గర ప్రతిష్టించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం లాంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి..
Feb 20 2024, 09:05