NLG: SVEEP పై అవగాహన సదస్సు
నల్లగొండ: స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల నందు రాజనీతి శాస్త్రం మరియు జిల్లా ఎన్నికల విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో SVEEP ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినీ విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, వివిధ స్థాయిలలో జరిగే ఎన్నికలలో నిష్పక్షపాతంగా, నిజాయితీగా, ఓటు హక్కును ఉపయోగించుకోవాలని, ఓటరు చైతన్యమే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని సూచించారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియ పై అవగాహన పెంచుకోవాలని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని కోరారు.
జిల్లా పరిషత్ సీఈవో మరియు SVEEP నోడల్ ఆఫీసర్ ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని తెలుపుతూ విద్యార్థినీ విద్యార్థులు అందరి చేత "ఓటరు ప్రతిజ్ఞ" చేయించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షత వహించగా, వైస్ ప్రిన్సిపల్ సయ్యద్ మునీర్, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ఎస్.యాదగిరి, అధ్యాపకులు ఈ. యాదగిరి రెడ్డి, ఎన్. వేణు, ఏ మల్లేష్, లక్ష్మణ్ గౌడ్, నారాయణరావు, ప్రవీణ్ రెడ్డి, తిరుమలేష్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కే. మల్లేష్, బాలరాజు, శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డిఏ ఏపిఎం అరుణ్ కుమార్ మరియు ఇతర అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Feb 17 2024, 11:11