NLG: కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి: పాలడుగు నాగార్జున
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు కార్మిక సంఘాల సిఐటియు ఆధ్వర్యంలో.. మర్రిగూడ చౌరస్తా నుండి బస్టాండు కూడలి వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సం.లు అయినా, రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు.
కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, రైతుకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, ఉపాధి కూలీలకు రోజు కూలి 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రవేటీకరం చేస్తుందని, అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ ల ను తెచ్చిందని అన్నారు. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిందని, సమ్మె హక్కును కాలరాస్తుందని పీఎఫ్, ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డులను నిర్విరారం చేస్తుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇచ్చిన సూచనలను పాటించే పరిస్థితుల్లో లేదని, నూతనంగా 12 గంటలు పని విధానం తీసుకురావడానికి కుట్ర చేస్తుందన్నారు.
నాలుగు లేబర్ కూడా రద్దు చేయాలని కనీస వేతన చట్టాలను అమలు చేయాలని, వెంటనే ఆశ, అంగన్వాడి మధ్యాహ్న భోజనం ఐకెపి వివో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, స్కీం వర్కర్ ను పర్మనెంట్ చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న క్లైమ్ లను పెండింగ్లో ఉన్న కార్డులను వెంటనే ఇవ్వాలని, ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఏర్పుల యాదయ్య, సిపిఐ మండల నాయకులు బుర్ర శేఖర్, అబ్బనగోని కృష్ణయ్య, ఎరుకలి యాదయ్య అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శోభ, రజిత, జయశ్రీ, విజయలక్ష్మి ఆశా వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి జంపాల వసంత, ఏర్పుల పద్మ, ధనమ్మ, అరుణ, పందుల పద్మ, దుర్గమ్మ, సైదాబీ, కంసల్య, బాలమణి, ఐకెపి వివోఏ ల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రంగినేని చంద్రకళ, వంపు సుమలత, నక్క సిరియాల, పద్మ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఒట్టిపల్లి హనుమంతు, ఊరుపక్క లింగయ్య మంజుల, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నామ సైదులు, యాదయ్య, హమాలీ వర్కర్స్ యూనియన్ బి.యాదయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు













నల్లగొండ జిల్లా: నాంపల్లి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జలెంధర్ రెడ్డి గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు HYD వనస్థలిపురం పోలీస్ స్టేషన్ నుండి, బదిలీపై నాంపల్లి సర్కిల్ కి వచ్చారు. ఇక్కడ పని చేసిన సిఐ నవీన్ కుమార్ ను అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. సీఐ నవీన్ కుమార్ కు హాలియా కు పోస్టింగ్ ఇవ్వవచ్చని సమాచారం.









నల్గొండ పట్టణంలోని మాధవ నగర్ జేబీఎస్ ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించే క్రమంలో ఉదయం మరియు సాయంత్రం పూట విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకుగాను, ఈరోజు లయన్స్ క్లబ్ ఎస్పిటి ప్లాటినం నల్గొండ సభ్యులు మరియు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ - ఆండాలు వివాహ వార్షికోత్సవం సందర్భంగా లయన్ జెల్లా దశరథ ఆధ్వర్యంలో దాదాపు 10 వేల రూపాయల స్నాక్స్ అందజేశారు.

Feb 16 2024, 20:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
20.0k