NLG: మేడిగడ్డ పై సమగ్ర విచారణ జరిపించి బాద్యులపై చర్యలు తీసుకోవాలి: జూలకంటి రంగారెడ్డి
నల్లగొండ: మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగడంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబి పై తక్షణమే అఖలపక్ష సమావేశం నిర్వహించాలని, నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గజిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మేడిగడ్డ ప్రాజెక్టును బొందల గడ్డగా మార్చింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కెసిఆర్ పై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయంలో నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్ని ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయ్యాయని, గత ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు మాత్రమే శంకుస్థాపనలు చేశారని, ఏ ఒక్క కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయలేదని విమర్శించారు.
ఈ సమావేశంలో సీ పి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేష్, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, కందాల ప్రమీల, చిన్నపాక లక్ష్మీనారాయణ. తదితరులు పాల్గొన్నారు.
Feb 16 2024, 12:01