తెలంగాణలో గ్రూపు-1 ఎగ్జామ్ కు కొత్త నోటిఫికేషన్?
తెలంగాణలో గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్‌కు క్లియర్ అయింది. గత నోటిఫికే షన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది
అయితే రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసును ఉపసహించరిం చుకున్నది. దీంతో గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్ వేసుకో వడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరోవైపు రాష్ట్రంలో గ్రూపు-1 పోస్టులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. గతం లోని 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను పెంచు తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563 వరకూ ఉండే అవకాశం ఉంది. రాబోయే కొత్త నోటిఫికేషన్ పెంచిన పోస్టులతో కలిపి రానుంది.
పేపర్ లీకేజీ, ప్రశ్నల తప్పి దాల కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్‌ను విడు దల చేయాలని నిర్ణయిం చారు. ఇదే అంశాన్ని తాజాగా అసెంబ్లీలో సైతం ప్రకటించారు
Feb 13 2024, 15:32