KCR: తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి కేసీఆర్
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీకి హాజరు కానున్నారు. గత రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా కేసీఆర్ మాత్రం అటు వైపు కూడా చూడలేదు..
గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరుకానున్నారు..
కాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చ జరగ్గా.. బీఆర్‌ఎస్ తరఫున కేసీఆర్ మాట్లాడతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన సభకు హాజరుకాలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ సభకు హాజరుకాలేదు.
ఇటీవలే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారని పెద్దఎత్తున బీఆర్‌ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సమావేశాలు ప్రారంభమైన రెండోరోజులు కూడా సభకు రాకుండా ఆయన ముఖం చాటేశారు. తొలిరోజు అమావాస్య కావడంతో హాజరుకాలేదని భావించగా.. మర్నాడు ఇదే పరిస్థితి నెలకొంది..
Feb 10 2024, 09:56