/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పీవీకీ భారతరత్న ప్రకటన పట్ల మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ హర్షం.. Yadagiri Goud
పీవీకీ భారతరత్న ప్రకటన పట్ల మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ హర్షం..

పీవీకీ భారతరత్న ప్రకటన పట్ల మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ హర్షం..

సంక్షోభంలో ఉన్న భారత్‌కు పీవీ దశదిశ చూపారు..

ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను ప్రగతి పథం వైపు నడిపారు

-జస్టిస్‌ ఎన్‌వీ రమణ..

PM Modi: ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు..

బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలకు ప్రధాని లంచ్‌కు ఆ‍హ్వానించారు. బీజేపీ ఎంపీలు హీనాగవిత్, ఎల్‌.మురుగన్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే తదితరులు ప్రధానితో కలిసి భోజనం చేశారు..

దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన లంచ్‌ భేటీలో పలు అంశాలపై ముచ్చటించారు. విదేశీ పర్యటలు, వ్యక్తిగత విషయాలను మోడీ పంచుకున్నట్లు తెలిసింది. తనతో పాటు ఎంపీల భోజనానికి అయిన ఖర్చును ప్రధానే చెల్లించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

విశాఖ జైలు నుంచి కోడికత్తి శ్రీనివాస్ విడుదల...

కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్, శుక్రవారం విశాఖ సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. ఎస్సీ సంఘాల నాయకులు అతనికి స్వాగతం పలికారు.

కాగా, శ్రీనివాసు గురువారం షరతులతో కూడిన బెయిల్ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై దాడి కేసులో శ్రీనివాస్ ను పోలీసుల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..

సమస్యలపై వాదించేటప్పుడు సంస్థల పేర్లు తీసుకురావద్దు : ఓం బిర్లా

దిల్లీ: లోక్‌సభలో ఒక సమస్యపై చర్చ జరిగేటప్పుడు సంస్థ (organisation)ల పేర్లు ప్రస్తావించకూడదని స్పీకర్ ఓం బిర్లా(Om Birla) శుక్రవారం సభ్యులను హెచ్చరించారు..

ఇక్కడ ఎంపీలు విధానపరమైన విషయాలను మాత్రమే చర్చించాలని సూచించారు..

వాదనల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌ బీఎస్‌పీ ఎంపీ రితేష్ పాండే(Ritesh Pandey) మెడికల్ కాలేజీ సమస్య, అందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తు గురించి మాట్లాడుతూ స్పీకర్‌ పైవిధంగా స్పందించారు.

''ఏదైనా సమస్య లేవనెత్తేటప్పుడు ఎవరూ ఏ సంస్థ పేరును తీసుకురావద్దని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరలా ప్రవర్తిస్తే అది పార్లమెంటరీ విధానాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. ఈ పద్ధతి సరైనది కాదు.'' అని బిర్లా అన్నారు..

ఏదైనా మెడికల్ కాలేజీలో వివిధ కోర్సులకు గుర్తింపు ఇచ్చే విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ తెలిపారు.

2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య కళాశాలలు 350 నుంచి 700కు పెరిగాయన్నారు. మెడికల్ కాలేజీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 100 శాతం, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 126 శాతానికి పైగా సీట్లు పెరిగాయని మంత్రి తెలిపారు. దేశంలోని ప్రతీ జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయాలనేదే తమ లక్ష్యమన్నారు..

R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు..

ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు..

బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం..

పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన లాయర్ వీవీ లక్ష్మీనారాయణ..

మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు..తెలిపిన గవర్నర్ తమిళ సై..

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గౌరవ పురస్కారమైన పద్మవిభూషణ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే..

గతంలో పద్మ భూషణ్ పురస్కారం అందుకున్న చిరు ఇప్పుడు పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనను కలిసి అభినందించారు..

 తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై ను సతీసమేతంగా కలిశారు చిరంజీవి. పద్మవిభూషణ్ ను ఎంపికైన సందర్భగా మెగాస్టార్ ను అభినందించారు గవర్నర్..

అనంతరం గవర్నర్ తో చిరంజీవి భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి చిరంజీవి చేసిన సేవలకు గాను పద్మవిభూషణ్ ను ప్రకటించింది..

 కేంద్రప్రభుత్వం. తనకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి చిరు కృతజ్ఞతలు తెలిపారు..

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న..

వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న వరించింది. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది.

దీంతో ఆయనకు భారత రత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. డాక్టర్ MS స్వామినాథ జీకి భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని మోడీ తెలిపారు. ఎన్నో సవాళ్ల సమయంలో వ్యవసాయ రంగంలో భారతదేశం స్వావలంబన సాధించడంలో ఎమ్మెస్ స్వామినాథన్ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు.

భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా స్వామినాథన్ అద్భుతమైన ప్రయత్నాలు చేశారన్నారు. అందుకే ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. వ్యవసాయంపై విద్యార్థుల్లో అభ్యాసం, పరిశోధనలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ గొప్ప దార్శనికుడని మోడీ ప్రశంసలు కురిపించారు..

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ సమావేశం

ప్రధాని నరేంద్ర మోదీతో పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం ముగిసింది. సుమారు గంట సేపు భేటీ కొనసాగింది.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో మరిన్ని విషయాలు చర్చించినట్లు సమాచారం.

చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత జగన్ భేటీ కావడంతో ఏపీ రాజకీయా ల్లో ఉత్కంఠ నెలకొంది. భేటీకి సంబంధించి చర్చించిన విషయాలు తెలియాల్సిఉంది.

సిలిండర్లలో గంజాయి తరలింపు..

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉత్తర ప్రదేశ్ కు ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్ లలో గంజాయి నింపి తరలిస్తుండగా మేడ్చల్ నేషనల్ హైవేపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు..

నలుగురు నిందితులు అభిషేక్ తోమర్, అరవింద్ చౌదరి, ఆశిష్ కుష్వాన, ఆకాష్ సోలంకిని అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గరి నుంచి 65 కేజీల గంజాయి, రెండు కార్లు, ఆరు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 40 లక్షలు ఉంటుందని చెప్పారుపోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు..

కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ కోరారా లేదా: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ దద్దరి ల్లింది. అసెంబ్లీ వేదికగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరుగ్యారెంటీలు, రాజకీయ అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది. అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య స్నేహం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.

దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. తమకు బీజేపీతో ఎలాంటి స్నేహం లేదని.. ఎంఐఎం ఒక్కటే తమకు ఫ్రెండ్లీ పార్టీ అని అన్నారు. అయితే పోచారం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్ బంధమని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన అనేక బిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారని.. ఈ విషయాన్ని మోదీ స్వయంగా చెప్పారని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పోచారం శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్ ఓడించిందని గుర్తు చేశారు. ఒకవేళ గతంలో కేటీఆర్‌ను సీఎం చేయాలనుకుంటే.. తామే వందమంది ఉన్నామని చెప్పారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీల్లో ఏ ఒక్కటి సరిగ్గా అమలు కావడంలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అసెంబ్లీలో ఫ్రీ బస్సు, ఆటోడ్రైవర్ల ఇష్యూపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి అదే స్థాయిలో కౌంటరిచ్చారు

మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌.. కాంగ్రెస్‌ది ప్రచారం తప్ప..హామీల అమలు ఊసేలేదని మండిపడ్డారు BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. ప్రచారం తప్ప..హామీల అమలు లేదని మండి పడ్డారు. ఫ్రీ బస్సుతో మహి ళలఇబ్బంది పడుతున్నా రని, మరిన్ని బస్సులు పెంచాలని కోరారు...