మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న
భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది.
మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌లకు సైతం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
కాగా ఇటీవలే.. ఎల్ కే అడ్వాణీ, కర్పూరీ ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రికార్డు స్థాయిలో మొత్తం ఐదుగురికి ఈ ఏడాది 5 భారతరత్న అవార్డులు ప్రకటించినట్టయ్యింది.
సాధారణంగా ఏడాదికి 3 భారతరత్న అవార్డులు ఇస్తారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం ఐదుగురికి ప్రకటించడం విశేషం.
చౌదరి చరణ్ సింగ్ జూలై 28, 1979 నుంచి జనవరి 14, 1980 మధ్యకాలంలో, పీవీ నరసింహారావు జూన్ 21, 1991 నుంచి మే 16, 1996 వరకు దేశ ప్రధాన మంత్రులుగా సేవలు అందించారు.
ఇక హరితవిప్లవ పితామ హుడైన ఎంఎస్ స్వామినా థన్ దేశానికి ఎనలేని సేవలు అందించారు. న్యాయవాదిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా కూడా ఆయన పనిచేశాడు....
Feb 09 2024, 14:31