ప్రభుత్వాలు మారుతున్న అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగటం లేదు: ఏబీవీపీ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ నోముల దీప్తి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని, ప్రభుత్వ బాలికల ఎస్.సి హాస్టల్లో 10వ తరగతి విద్యార్ధినిలు భవ్యశ్రీ , వైష్ణవి ఆత్మహత్యల విషయంలో ...రాష్ట్ర ప్రభుత్వo సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఏబీవీపీ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ నోముల దీప్తి అన్నారు. ఈ సందర్బం గా దీప్తి మాట్లాడుతూ .. భువనగిరిలో 10వ తరగతి విద్యార్ధినిల ఆత్మహత్యల విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీరు విచారకరం.ఈ ఘటన జరిగి 2 రోజులు కావస్తున్న ప్రభుత్వం నుంచి సరియైన స్పందన కొరవడింది.ఆత్మ హత్య అంటూ చెప్తున్న హాస్టల్ వార్డెన్ శైలజ, హాస్టల్ బ్యూటర్ భువనేశ్వరి, బాలికల ఉన్నత పాఠశాల పీఈటి ప్రతిభ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, వంట మనిషి సుజాత ల తీరుపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇరువురు విద్యార్థిని లు చనిపోయిన రెండు గంటల తర్వాత పోలీసు వారికి, మరో రెండు గంటల తర్వాత విద్యార్థినుల తల్లిదండ్రులకు హాస్టల్ సిబ్బంది సమాచారాన్ని చేరివేసిన తీరు చూస్తుంటే ఇది ఆత్మహత్య కాదు హత్య నన్న ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడితే విద్యార్థినుల ఒంటిపై గాయాలు ఎందుకు ఉన్నాయి... అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. నేటి ప్రభుత్వం కూడా ఈ విషయాలపై దృష్టి సారించి దర్యాప్తు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. "ఆడపిల్లల చదువు ఇంటికి వెలుగు"అంటూ చెప్పే మన తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లల జీవితాలను చీకటి మయం చేస్తూ వారిపై హత్యలు, హత్యలను ఆత్మహత్యలు గా మార్చే తీరు అంతకంతకు పెరుగుతూ ఉన్న మన ప్రభుత్వాల తీరు మాత్రం పేపర్లకే పరిమితం అవుతుంది. వారికి ఓట్లు మీద, వారి పదవులను కాపాడుకోవడం లో ఉన్న శ్రద్ధ చదువుకుంటున్న ఆడపిల్లల యొక్క జీవితాల రక్షణ మీద లేదేమో అన్నట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉంది. పేద కుటుంబంలో పుట్టి మంచిగా చదువుకొని కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలనుకున్న ఇద్దరి ఆడపిల్లల యొక్క జీవితం 15 సంవత్సరాల లోనే ఆగిపోయి వారి కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచి వేసింది. ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుకునే పిల్లలకు మౌలిక సదుపాయాలతో పాటు ఆడపిల్లలకు రక్షణ కూడా లేనటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఆడపిల్లలు ఇంట్లో ఉంటే చదువు ఆగిపోతుంది అదే హాస్టల్స్ లో ఉండి చదువుకోవాలి అనుకుంటే కొంత మంది హాస్టల్స్ సిబ్బంది ప్రవర్తన కారణం గా ప్రాణమే పోతుంది. ఏమో అనే దానికి ఈ ఘటన దారి తీస్తుంది. రాత్రి సమయంలో ఆడపిల్లల హాస్టల్స్ లోకి అబ్బాయిలు రాకూడదనే విషయాన్ని మరిచి ,రాత్రి సమయంలో హాస్టల్స్లోకి వచ్చిన, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, తనకు సహకరించిన ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆటో డ్రైవర్లు ఈ హాస్టల్స్ లోకి రాత్రి సమయంలో వస్తున్నారని ఇదివరకే కంప్లైంట్ ఇచ్చిన దీనిపై ఎటువంటి స్పందన లేకుండా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి నైతిక బాధ్యత వహించాలి. ఆడపిల్లల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నామని చెప్పినా వాటిని అమలుపరిచే విధానంలో మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక దశా దిశా లేకుండా ఉన్నాయి అనేదానికి ఈ ఘటనను మనo ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఆడపిల్లలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని, భవ్య శ్రీ , వైష్ణవి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, దర్యాప్తును వేగవంతం చేస్తూ సమగ్ర విచారణ చేయాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుతున్న ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని అమె అన్నారు.
Feb 06 2024, 16:28