భువనగిరి ఎస్సీ హాస్టల్ ఘటనలో ఎంక్వయిరీ చేసి ,బాధ్యులను కఠినంగా శిక్షించాలి : జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి
భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకోవడంతో .. సోమవారం భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , పార్టీ నేతలతో కలిసి వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు డివిజనల్ అధికారి వసంత కుమారుని ఘటన జరిగిన తీరుపై ,వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా... వారు మాట్లాడుతూ విద్యార్థినుల ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. పోస్టుమార్టం రాకమందు, పోస్టుమార్టం వచ్చిన తర్వాత క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి , బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్సీ హాస్టల్ వార్డెన్ ను తక్షణమే సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచెర్ల రామకృష్ణ రెడ్డి ,జడ్పిటిసి బీరు మల్లయ్య ,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Feb 05 2024, 16:20