పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్ బారి నుండి రక్షించుకోవాలి: పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్
పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్ బారి నుండి రక్షించుకోవాలి
వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అనాధా శ్రమంలో అన్నదానం
పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి లోని కీ! శే! జెల్లా శంకర్ స్థాపించిన అమ్మఒడి అనాదాశ్రమం లో ఎం సీ కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ ....పండ్లు, కూరగాయలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పును అధిగమించవచ్చని ఆయన అన్నారు. క్యాన్సర్ కు కారణమయ్యే ధూమపానం, మద్యపానం, గుట్కా, జర్ధాకిల్లీ లాంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. క్యాన్సర్ నివారణ కోసం మహ్మద్ చాంద్ ఖాన్ (ఎం సి కే) ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమం లో ఆయన ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎం సి కే ఫౌండేషన్ అధ్యక్షులు బండారి బాబూరావు, కార్యదర్శి తొర్రి సురేష్, ఆర్గనైజర్ ఖాజాభాయి , మహ్మద్ ఆదిల్ కైఫ్, రమేష్ యాదవ్,హరిదీఫ్, మహ్మద్ షమీ,స్మరణ్ , ఆశ్రమ నిర్వాహకులు సుమిత్ర, మహ్మద్ అలీ, అంజి,
తదితరులు పాల్గొన్నారు.
Feb 05 2024, 15:48