/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. Yadagiri Goud
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాం..

సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది..

మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టింది.. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది..

రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారు..

అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించాం..

ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించాం.

పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం.

-అసెంబ్లీలో గవర్నర్.

Revanth Reddy: పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్ కూడా

రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదు బహుమతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు..

అంతేకాదు ప్రతినెల వారి ఖర్చుల కోసం రూ.25 వేల పింఛన్ కూడా ఇస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న కవులు, కళాకారులు ఒకానొక పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే దుర్భర పరిస్థితులు ఉంటున్నాయని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో రాణించిన వారిని గుర్తించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు..

ఈ క్రమంలోనే తెలుగోళ్లు ఎక్కడ ఉన్నా కూడా మనోళ్లేనని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు అని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాంటి క్రమంలో మన తెలుగు భాష, మన కలలు, సంప్రదాయాలను గౌరవించుకోవాలని అన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన కార్యక్రమమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా స్థానిక కలలను వృత్తిగా మార్చుకుని అందులోనే జీవించేవారిని గౌరవించాలని రేవంత్ రెడ్డి చెప్పారు..

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కొనసాగుతున్న కీలక భేటీ..

అమరావతి: సీట్ల సర్దుబాటు, ఇతర అంశాలపై చర్చించేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో వీరిద్దరి మధ్య అత్యంత కీలకమైన భేటీ జరుగుతోంది..

ప్రధానంగా మూడు అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీ వైసీపీ జాబితాలు ప్రకటిస్తుండటంతో టీడీపీ-జనసేన నేతలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇరువురు అధినేతలు సమావేశమయ్యారు. సంక్రాంతి సందర్భంగా జరగిన డిన్నర్ మీట్‌లో స్థానాలు సంఖ్య, సర్దుబాటు చర్చలు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. అయితే ఆశావహుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో సీట్ల సంఖ్యను పెంచాలని జనసేన కోరుతోంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో సీట్ల సర్దుబాటుపై అధినేతలు తుదిమెరుగులు దిద్దనున్నారు.

కాగా సిట్టింగ్ స్థానాలను ఎమ్మెల్యేలకు కేటాయిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇరుపక్షాల అధినేతలు కలిసి సీట్ల సర్దుబాటు ప్రకటన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే రెండు పక్షాల నేతలు మధ్య మేనిఫెస్టోపై చర్చలు ముగియడంతో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన ఎప్పుడు చేయాలనే అంశంపై కూడా తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలుత ఇరుపక్షాల అధినేతలు కలిసి ఉమ్మడి మానిఫెస్టో ప్రకటించాలని నిర్ణయించారు. అయితే టీడీపీ సూపర్ సిక్స్, జనసేన 'షణ్ముఖ వ్యూహం' రెండింటిని కలిపి ఉమ్మడి మానిఫెస్టోగా రూపొందించనున్నారు. ఇక ఇరుపక్షాల నేతలు కలిపి ఉమ్మడి సభల్లో పాల్గొనడంపై కూడా సంప్రదింపులు జరపనున్నారని తెలుస్తోంది. ఇరుపక్షాల అధినేతలు తాడేపల్లిగూడెంలో పాదయాత్ర నిర్వహించి భారీ బహిరంగసభ నిర్వహణ, సర్దుబాటు పూర్తయిన స్థానాల్లో అభ్యర్థులపై కూడా ఇరుపక్షాల నేతలు మధ్య చర్చలు జరగనున్నాయి..

కాగా వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించుకుంటూ పోతున్న వేళ టీడీపీ, జనసేన అధినేతల భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది. ఏయే అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు?, ఏవైనా ప్రకటనలు ఉంటాయా ? అనేది అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది..

Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది..

ఇందిరమ్మ ఇళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అప్లికేషన్‌ల కోసం అర్హులైన అభ్యర్థులను ఎలా ఎంచుకోవాలి? ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలనే దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మరి ఈ భేటీలో రెండు హామీలకు ఆమోదం లభిస్తుందా.. లేక ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది చూడాలి.

టీఎస్ బదులు టీజీ నంబర్ ప్లేట్లను మార్చే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేబినెట్ సమావేశానికి దాదాపు 20 నుంచి 25 అంశాలతో ఎజెండా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్ని శాఖల నుంచి సమాచారం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కార్యదర్శులను ఆదేశించారు..

నంది ఆవార్డుల స్థానంలో గద్దర్ పేరుతొ సినీ అవార్డులు

ప్ర‌జాగాయ‌కుడు గద్ద‌ర్ పేరుతో సినీ అవార్డులు ప్ర‌దానం చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

నంది అవార్డుల ప్రోత్సహం అనేది చాలా ఏళ్ళు అవుతోందని.. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇవ్వనుండటం శుభపరిణామమన్నారు.

ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతు న్నానని ఆయన అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహితలందరిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు రూ.25 ల‌క్ష‌లు న‌గ‌దు రివార్డ్ అంద‌జేసింది.

ఈ సంద‌ర్భ‌గా చిరంజీవి మాట్లాడుతూ, పద్మ విభూషణ్ అవార్డు రావడం ఆనందంగా ఉందని.. గత వారం రోజులుగా అందరు వచ్చి అభిమానం చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు

మెగాస్టార్ చిరంజీవి. పద్మ అవార్డుల గ్రహితలను గౌరవిస్తూ.. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మనవాళ్లలను మనం గౌరవించకోకపోతే ఎలా అని అనుకోవడం గొప్ప విషయమన్నారు.

అవార్డులు ప్రకటించిన తర్వాత.. వెంటనే ఇలా సన్మానించడం ఇదే తొలిసారని.. అవార్డులు కళాకారులకు ఎంతో ప్రొత్సహాన్ని ఇస్తాయని చిరంజీవి అన్నారు. పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం.. పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అంత ఉత్సాహం లేదన్నారు

చిరంజీవి. తాను అవార్డుల కోసం ఎప్పుడూ ఎదురు చూడను.. అవార్డులు రావాలని కోరుకోనన్నారు. తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయన్నారు.. సభ ఇంత నిండుగా ఉందంటే.. దానికి కారణం వెంకయ్య నాయుడు.. ఆయన తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనమని.. తెలుగు భాషను గొప్పగా నిలబెట్టిన వాళ్ళలో వెంకయ్య నాయుడు ఒకరని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థునీలు ఆత్మహత్య?

ఇద్ద‌రు విద్యార్థినీలు త‌మ బాధ‌ల‌ను ఎవ‌రికి చెప్పుకోలేక త‌నువులు చాలించారు. ఈఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది.

భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు భువనగిరిలోని రెడ్డివాడ బాలికలఉన్నత పాఠశాలలో హాస్టల్‌లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం తిరిగి హాస్టల్‌కు చేరుకున్నారు.

ఇద్దరూ హాస్టల్‌లో ట్యూషన్‌కు వెళ్లలేదని.. ట్యూషన్ టీచర్ పిలిస్తే రాత్రి భోజనం చేసి వస్తామని చెప్పి గదిలోనే ఉండి పోయారు. ఈరోజు మధ్యాహ్న భోజన సమయంలో కూడా వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని అనుమానం వచ్చి గదిలోకి వెళ్లి చూడగా షాక్ తిన్నారు.

ఇద్దరు విద్యార్థినులు అప్పటికే ఫ్యాన్లకు వేలాడుతున్నారు. చూసిన వెంటనే విద్యార్థి యాజమాన్యానికి చెప్పింది. యాజమాన్యం వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పరీక్షించిన వైద్యులు.. విద్యార్థినిలు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

బాలికలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న గదిలో నుంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పేర్కొన్న అంశాలను చదివి పోలీసులు ఆశ్చర్య పోయారు.

మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి.. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతు న్నాం.

మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతు న్నాం.మా ఇద్దరినీ ఒకచోటే సమాధి చేయండి’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

హాస్టల్ వార్డెన్ శైలజాన్, ట్యూషన్ టీచర్లను భువనగిరి టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. ఈ బాలికలు తమను దూషించి.. చేయి చేసుకున్నారంటూ నలుగురు విద్యార్థినులు స్కూల్‌లో టీచర్‌కు చెప్పడంతో ఆ ఇద్దరికీ శనివారం కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

దీంతో తమపై వచ్చిన ఫిర్యాదుతో అవమానంగా భావించి ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒక విద్యార్థి 3వ తరగతి నుంచి ఇదే హాస్టల్‌లో ఉంటున్న సంగతి తెలిసింది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన వీరి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు గుర్తించారు.

ఇక నుంచి TS కాదు TG.. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..!

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన చాలా పథకాలకు పేరు మార్చ అమలుపర్చేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చనున్నట్టు సమాచారం. పేరంటే తెలంగాణ పేరు కాదండోయ్.. తెలంగాణ అని సూచించేలా నెంబర్ ప్లేట్లపై ఉండే టీఎస్ అనే అక్షరాలను టీజీ అని మార్చాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

గత ప్రభుత్వం చేసిన చాలా పథకాలకు పేరు మార్చ అమలుపర్చేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చనున్నట్టు సమాచారం. పేరంటే తెలంగాణ పేరు కాదండోయ్.. తెలంగాణ అని సూచించేలా నెంబర్ ప్లేట్లపై ఉండే టీఎస్ అనే అక్షరాలను టీజీ అని మార్చాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సంచలన నిర్ణయాలతో పాలనలో తన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నెంబర్ ప్లేట్లపై టీఎస్ (TS- Telangana State) అనే అక్షరాలు ఉండేవి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి.. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ అని వచ్చేలా TS అని షార్ట్ ఫాంని ప్రభుత్వం రిజిస్టర్ చేయించింది. కేవలం నెంబర్ ప్లేట్లపైనే కాకుండా.. అన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా తెలంగాణ స్టేట్ అని వచ్చేలా పేర్లు మారిపోయాయి. అయితే.. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మార్చాలన్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు 'టీఎస్' అనే షార్ట్ ఫాంను.. ఇప్పుడు టీజీ (TG- Telangana) గా మార్చనున్నట్టు తెలుస్తోంది. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ 'టీజీ' అంశానికి ఆమోదం తెలపనున్నట్టు సమాచారం.

అయితే.. తెలంగాణ ఏర్పడిన సమయంలోనే "టీజీ"గా నిర్ణయిస్తారని అందరూ భావించారు. అప్పటికే ఉద్యమం సమయంలోనూ తెలంగాణను టీజీగా మాట్లాడుకునేవారు. పలు బోర్డులపై ఏపీ అనే స్థానంలో టీజీ అని కూడా రాసేవారు. కానీ.. అనూహ్యంగా టీఎస్ అని తెలంగాణ పేరును కేసీఆర్ సర్కార్ రిజిస్ట్రేషన్ చేపించింది. దీనిపై మొదట్లో ఒకింత వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే.. 'టీజీ' అంటే తెలంగాణ అనే ఒకే పదాన్ని రెండుగా విభజించినట్టవుతుందని.. అది ఒకటే పదంగా ఉంచేందుకే తెలంగాణ స్టేట్ అని వచ్చేలా 'టీఎస్‌' అనే అక్షరాలను రిజిస్టర్ చేపించినట్టు పలువురు వివరించారు. మనలాగే కర్ణాటక రాష్ట్రానికి కూడా కేఎస్ (KS) అనే ఉంటుందని.. కూడా ఉదాహరణలు చెప్పారు.

అయితే.. ఇప్పుడు టీఎస్ కాస్త టీజీగా మారితే మాత్రం కేవలం నెంబర్ ప్లేట్లు మాత్రమే కాదు.. చాలా మార్చాల్చి వస్తుంది. మరి.. కేవలం నెంబర్ ప్లేట్ల మీదే మారుస్తారా.. లేదా మొత్తం మారుస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇది కూడా రాష్ట్రంలో సర్వత్రా దుమారం రేపే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి.. రేపటి మంత్రి వర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో..!

ఇదిలా ఉంటే.. రేపటి కేబినెట్ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి ముఖ్యంగా చర్చించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఎప్పటి నుంచి, ఎప్పటివరకు నిర్వహించాలో కూడా రేపు నిర్ణయించనున్నారు. గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈసారి మరో రెండు పథకాలను అమలుపరిచే దిశగా నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఈనెల 8న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై.. ఆరు రోజులు జరిగే అవకాశం ఉందని.. 9న బడ్జెట్‌ ప్రవేశపెట్టవచ్చని సమాచారం అందుతోంది.

చిరంజీవి తెలుగు కళామతల్లికి మూడో కన్ను: వెంకయ్య నాయుడు

హైదరాబాదులోని శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా పద్మవిభూషణ్ గ్రహిత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. తెలుగు కళామతల్లికి మొదటి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ అయితే మూడో కన్ను చిరంజీవి అన్నారు.

నాతో పాటు చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం సంతోషంగా ఉందని అన్నారు.

AP Politics: ప్రత్యేకహోదా కోసం వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా

ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) గళం ఎత్తారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు..

ఢిల్లీ గడ్డ మీద ఈ రోజు ధర్నా చేపడుతున్నారు. అంతకుముందు విపక్ష నేతలను వరసగా కలుస్తున్నారు. వివిధ పార్టీ నేతల మద్దతు కోరారు. ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచారు..

షర్మిల షెడ్యూల్ ఇదే..

పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా గురించి అడగాలని విపక్ష నేతలను షర్మిల కోరతారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు డీఎంకే ఎంపీ తిరుచి శివను షర్మిల కలుస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశం అవుతారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇవ్వాలని ఆయా నేతలను కోరతారు..

షర్మిల ధర్నా

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని షర్మిల పట్టుబడుతన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్ వద్ద ధర్నా చేపడుతారు. షర్మిలతోపాటు ఏపీ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ధర్నాలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం అవుతారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఖర్గేకు షర్మిల వివరిస్తారు..

ఎంగేజ్మెంట్ అయినా మూడు రోజులకే యువకుడు దుర్మరణం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రోడ్ లొ గురు వారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడి కక్కడే మృత్యువాత పడ్డాడు.

లారీ ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న యువకుడు దుర్మరణం పాలయ్యాడు మండలంలోని హను మంతుని పేట గ్రామానికి చెందిన గుర్రాల రాజు 26 అనే యువకుడు ఏటీఎం సెంటర్లలో క్యాష్ అమర్చే పనులు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తాడు

గురువారం సాయంత్రం రాజు తన బైక్ పై వెళ్తుండగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రోడ్ క్రాసింగ్ వద్ద లారీ ఢీకొట్టడంతో తల చితికిపోయి రాజు అక్కడికి అక్కడికే మరణించాడు

మృతుడు గుర్రాల రాజుకి మూడు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలిసింది, ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు రాజు మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి

రాజు దేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఈ మేరకు పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు