వలిగొండ: నర్సింగ్ ఆఫీసర్ గా సీలోజు సంధ్య నియామకం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలోని సీలోజు కలమ్మ శ్రీరాములు ల ద్వితీయ కుమార్తె సీలోజు సంధ్య కు గత నెలలో విడుదల చేసిన ఫలితాలలో నర్సింగ్ ఆఫీసర్ గా ఎంపిక కావడం జరిగినది. ఈ ఎంపిక పత్రాలను జనవరి 31 2024 మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో ఎల్బీ స్టేడియంలో 7000 మంది నర్సింగ్ ఉద్యోగాలకు, ఎంపిక అయిన వారికి ఎంపిక పత్రాలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో ...నియామక పత్రాలను అందజేశారు. ఈ నియామకంలో వలిగొండ మండల కేంద్రానికి చెందిన సీలోజు కలమ్మ శ్రీరాములు ల రెండో కూతురైన సీలోజు సంధ్య నర్సింగ్ ఆఫీసర్ గా ఎంపిక కావడం వల్ల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వలిగొండ మండల కేంద్రంలోని ఉజ్వల విద్యాసంస్థలలో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు చదివి చదువులో మొదటి స్థానంలోనే నిలిచేది గ్రామీణ ప్రాంతమైన వలిగొండలో చదివిన అనంతరం బిఎస్సి నర్సింగ్ చదువు కోసం హైదరాబాదులోని జయ నర్సింగ్ కళాశాలలో చదివి ,ఉత్తీర్ణులై 2012 నుండి 2015 వరకు యశోద హాస్పిటల్ హైదరాబాదులో స్టాఫ్ నర్స్ గా పని చేసినది. అనంతరం 2015 -18 వరకు అపోలో హాస్పిటల్ లో పనిచేసి అనంతరం నర్సింగ్ ఆఫీసర్ గా ఎన్ ఎచ్ఎం కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగం పొంది రామన్నపేట ఆసుపత్రిలో ఇప్పటివరకు పనిచేస్తూ ఉన్నది. నర్సింగ్ ఆఫీసర్ గా ఉద్యోగం పొందిన సీలోజు సంధ్య మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్యశాఖ ఉద్యోగం పొందిన సీలోజు సంధ్య గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ గా ఉద్యోగం రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అదేవిధంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు ధన్యవాదములు తెలిపారు. సీలోజు శ్రీరాములు కళమ్మ లకు ముగ్గురు సంతానం ముగ్గురు అమ్మాయిలే మొదటి అమ్మాయి డిగ్రీ చదివినది రెండో అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చదివి ఇప్పటివరకు కాంట్రాక్టు నర్సింగ్ ఆఫీసర్ గా పని చేసినది గత జనవరిలో ప్రకటించిన నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలలో నర్సింగ్ ఆఫీసర్ పొందినది. మూడో అమ్మాయి డిగ్రీ చదివి ఎండోమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నది. మీరు ముగ్గురు అక్కచెల్లెళ్లు వీరు ముగ్గురు అమ్మాయిలు అయినా తల్లిదండ్రులకు ఇద్దరమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకురావడం వారికి ఆనందానికి అవధులు లేవు. సీలోజు కలమ్మ శ్రీరాములు గతంలో కలమ్మ వలిగొండ గ్రామపంచాయతీ ఉపసర్పంచిగా సేవలందించినది. అదేవిధంగా సీలోజు శ్రీరాములు గతంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులుగా మండల పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. అమ్మాయిలు అయినా అబ్బాయిల తో సమానమై వారు గ్రామీణ ప్రాంతంలో విద్యను అభ్యసించి వారి తల్లిదండ్రులకు గ్రామానికి మండలానికి ఆదర్శంగా నిలిచారు. మంచిగా చదివి ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు పుట్టిన ఊరు పేరు చదివిన చదువుకు సార్ధకత ఉంటుందని వారు అన్నారు. మా అమ్మాయిల లాగే అందరూ మంచిగా చదివి ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుందని వారు అన్నారు
Feb 05 2024, 11:18