/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వలిగొండ మండల సిపిఎం కార్యదర్శి సిర్పంగి స్వామిని పరామర్శించిన భువనగిరి మ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి Vijay.S
వలిగొండ మండల సిపిఎం కార్యదర్శి సిర్పంగి స్వామిని పరామర్శించిన భువనగిరి మ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల సిపిఎం పార్టీ ,మండల కార్యదర్శి సిర్పంగి స్వామిని పరామర్శించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇటీవల యాక్సిడెంట్ లో కాలుకు ప్యాక్చర్ కావడంతో ఇంటివద్ద స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి వారి యోగక్షేమాలు తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని అన్నారు. సిర్పంగి స్వామికి మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.

వలిగొండలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎఫ్ ఎస్ సి ఎ సభ్యులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో క్రీడాకారుల సౌకర్యం కోసం మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ...ఫ్రెండ్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ..ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో స్టేడియంకు కావాల్సిన స్థలాన్ని గుర్తించి ,మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. లోతుకుంట గ్రామంలో స్టేడియం నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ సి ఏ అధ్యక్షుడు కొండూరు బాలరాజు, గంజి చండీ ప్రసాద్, కొండూరు భాస్కర్, కాసుల వెంకటేశం, కూర శ్రీనివాస్, యానాల సత్యనారాయణ రెడ్డి, స్వామి రాజ్, పిట్టల రాజు, ఐటిపాముల ప్రభాకర్, కాటేపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ పాఠశాల పదవ వార్షికోత్సవంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోనీ లోతుకుంట గ్రామం లో ఆదర్శ పాఠశాలలో శనివారం రోజున పదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ....ఆయన మాట్లాడుతూ ,విద్యాసంస్థల కార్యక్రమాలకు మొదటిసారిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదని ,కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఆదర్శ పాఠశాలన్ని ప్రారంభించారు. ఈ పది సంవత్సరాల కాలంలో ఆదర్శ పాఠశాలలు చదివిన విద్యార్థిని విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నత స్థాయిలో ఉండడం చాలా ఆనందకరమైన ...విషయమని ఆయన అన్నారు. పాఠశాలకి 500 మీటర్ల సిసి రోడ్డు అయిందని ఇంకా 300 మీటర్ల సిసి రోడ్ గురించి మన ఏ ఈ తో మాట్లాడుతున్నానని ,చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని ఆటల వలన మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆయన అన్నారు. వలిగొండ లో మినీ స్టేడియం ఏర్పాటు చేయిస్తా నని ఆయన అన్నారు. పాఠశాలకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రాము, ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పిటిసి వాకిటి పద్మానంతరెడ్డి, ఎంపీటీసీ పల్లెర్ల భాగ్యమ్మ రాజు, శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాజాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్, లోతుకుంట మాజీ సర్పంచ్ రాచకొండ బచ్చయ్య, ఆధ్యాపక బృందం ,విద్యార్థిని విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు

భువనగిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలి: కుంభం కీర్తి రెడ్డి


భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని యువ నాయకురాలు శ్రీమతి కుంభం కీర్తి రెడ్డి గారు కోరారు..ఈ మేరకు తన దరఖాస్తును ఈరోజు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో అందజేశారు..

తన తండ్రి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపు కోసం బూత్ కమిటీలు వేసి, కష్టపడి గెలుపులో ముఖ్యమైన పాత్ర పోషించారు. 

ఎన్నికల ప్రచార సమయంలో తన తండ్రి ఒకవైపు ప్రచారం నిర్వహిస్తుంటే, తాను ప్రచార శైలిని పరిశీలిస్తూ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలతో మమేకమై, గెలుపు కోసం కృషి చేసిన అనుభవం ఉంది.

వలిగొండ మండలంలోని చిత్తాపురం అంగన్వాడి కేంద్రంలో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో చిత్తాపురం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం 12 గంటలకి నిర్వహించారు. ఈ సందర్భంగా వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం జే వినోద మాట్లాడుతూ.. కుష్టి వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రె వలన వస్తుందని, కుష్టి వ్యాధి ముఖ్యంగా చర్మానికి నరాలకు సోకుతుందని , కుష్టి వ్యాధి చాలా నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి సగటు 3 నుండి 5 సంవత్సరాల వరకు పడుతుందని అన్నారు. కుష్టి వ్యాధి ఎవరికైనా రావచ్చు, దీనికి వయసు ,లింగభేదం లేదు అని అన్నారు. ప్రారంభ దశలో గుర్తించి ఎం డి టి చికిత్స ఇచ్చిన చో కుష్టు వ్యాధి అంగవైకల్యానికి దారి తీయదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ మంజుల, ఆశా వర్కర్ బి కవిత, తల్లులు ,బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు మండల కేంద్రంలో ఘనంగా ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవీర్భావ దినోత్సవ వేడుకలను ఆత్మకూరు మండల కేంద్రం కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఉపాధిహామీ కూలీలు, ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గారు కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బడుగు బలహీన వర్గాలను ఆదుకొనే లక్ష్యంతో.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు ...గ్రామాభివృద్ధి మరియు సంక్షేమంలో భాగస్వామ్యం కావడం నేడు ఉపాధి హామీ పథకం 19 వ వసంతంలో అడుగుపెట్టడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నిరంజన్ వలీ, ఏపిఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి,మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం, నాయకులు కట్టేకోల హన్మంతు గౌడ్, ఎద్దు వెంకటేశ్వర్లు , పైళ్ళ దామోదర్ రెడ్డి,రంగ స్వామి,కోరే కనకయ్య, ఎలగందుల సైదులు, కొండపల్లి ముత్యాలు, ఉపాధి హామీ సిబ్బంది యాది రెడ్డి, శ్రీశైలం,సత్యనారాయణ మరియు కూలీలు పాల్గొన్నారు.

మాజీ మంత్రి ,సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును సన్మానించిన తెలంగాణ ఉద్యమ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి


భువనగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన మాజీ మంత్రి ,సిద్దిపేట ఎమ్మెల్యే, తన్నీరు హరీష్ రావు సమావేశం అనంతరం తెలంగాణ ఉద్యమ నాయకులు జిట్టా బాలకృష్ణ రెడ్డి నివాసం కి విచ్చేసిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి తెలంగాణ ఉద్యమ నేత జీట్టా బాలకృష్ణ  రెడ్డి , మాజీ మంత్రి హరీష్ రావుని శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో  రాజ్యసభలు మద్ది రాజు రవిచంద్ర , భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ,ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మండలంలోని జాలు కాలువ ,గోకారం గ్రామాలలో సైబర్ నేరాలు, సీసీటీవీ ఉపయోగాలు, నేర నివారణ చర్యలపై అవగాహన కల్పించిన ఎస్సై మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం, జాలు కాలువ గ్రామాలలో శుక్రవారం వలిగొండ ఎస్సై డి మహేందర్ సైబర్ నేరాలు, సీసీటీవీ ఉపయోగాలు, నేర నివారణ చర్యలు పై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకుంటే తర్వాత వాళ్లు బ్యాంక్ అధికారుల వలె నమ్మించి ఓటిపి తెలుసుకొని బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారని తెలిపారు. గ్రామాలలో సిసిటీవీలను ఉపయోగించాలని సిసిటీవీ వలన నేరాలను అరికట్టవచ్చని అన్నారు. దొంగలను, నేరస్తులను గుర్తించడంలో సీసీటీవీలు సహాయపడతాయని... సమాజంలో నేరం చేసే అవకాశాలను తగ్గిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన భారతీయ జనతా పార్టీ మండల శాఖ


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రము లోని పోలీస్టేషన్ కు ,నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరించిన, మహేందర్ ను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నాగెల్లి సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ..మర్యాదపూర్వకంగా కలిసి ,శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ..జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు దంతూరి సత్తయ్య గౌడ్ ,వలిగొండ గ్రామ ఉపసర్పంచ్ మైసొల్ల మత్స్యగిరి ,బచ్చు శ్రీనివాస్ ,ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్ ,బీజేవైఎం మండల అధ్యక్షులు రేగూరి అమరేందర్ ,మండల ఉపాధ్యక్షులు దయ్యాల వెంకటేశం, మందుల నాగరాజు ,వీరాచారి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సౌలభ్యం కోసం ఫంక్షన్ హాల్ లు ఉపయోగపడాలి: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


  ప్రజల యొక్క, అవసరాలకు శుభకార్యాలకు పంక్షన్ హల్ లు అందుబాటులో ఉండి, ఉపయోగపడాలని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం.. భువనగిరి మండలం రాయగిరి శివారులోని జీ పీ ఆర్ గార్డెన్ (పంక్షన్ హాల్)ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పంక్షన్ హల్ లు సామాన్యులకు అందుబాటు ధరలో ఉండి, ఉత్తమ సేవలందించాలని ఆయన కోరారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ చిన్నా , పెద్ద శుభకార్యాలు పంక్షన్ హల్ లోనే జరుపుతున్నారని ఆయన అన్నారు. సామాజిక సేవా దృక్పథంతో, యాజమాన్యం వినియోగదారులకు నాణ్యమైన సేవలందించి మంచిపేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. పంక్షన్ హాల్ ప్రారంభ కార్యక్రమంలో భువనగిరి ఎంపిపి నరాల నిర్మల వెంకటస్వామి, ఆత్మకూరు ఎంపిపి తండ మంగమ్మ శ్రీశైలం, యాదగిరిగుట్ట కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యాస లక్ష్మారెడ్డి , చిక్కుల వెంకటేష్, ఎడ్ల శ్రీను, కోట పెద్ద స్వామి, నుచ్చు నాగయ్య , ఆత్మకూరు మాజీ సర్పంచ్ నగేష్, మాజీ ఉపసర్పంచ్ నవ్య జీ పీ ఆర్ పంక్షన్ హాల్ యాజమాన్యం సి.ఎచ్.తిరుమల్ రెడ్డి, సంగారెడ్డి, బోయిని శ్రీనివాస్, ఎన్ .ఎస్ .రెడ్డి, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్, నరేందర్, గడ్డమీది మల్లేష్, బోయిని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు