ఆదర్శ పాఠశాల పదవ వార్షికోత్సవంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోనీ లోతుకుంట గ్రామం లో ఆదర్శ పాఠశాలలో శనివారం రోజున పదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ....ఆయన మాట్లాడుతూ ,విద్యాసంస్థల కార్యక్రమాలకు మొదటిసారిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదని ,కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఆదర్శ పాఠశాలన్ని ప్రారంభించారు. ఈ పది సంవత్సరాల కాలంలో ఆదర్శ పాఠశాలలు చదివిన విద్యార్థిని విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నత స్థాయిలో ఉండడం చాలా ఆనందకరమైన ...విషయమని ఆయన అన్నారు. పాఠశాలకి 500 మీటర్ల సిసి రోడ్డు అయిందని ఇంకా 300 మీటర్ల సిసి రోడ్ గురించి మన ఏ ఈ తో మాట్లాడుతున్నానని ,చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని ఆటల వలన మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆయన అన్నారు. వలిగొండ లో మినీ స్టేడియం ఏర్పాటు చేయిస్తా నని ఆయన అన్నారు. పాఠశాలకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రాము, ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పిటిసి వాకిటి పద్మానంతరెడ్డి, ఎంపీటీసీ పల్లెర్ల భాగ్యమ్మ రాజు, శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాజాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్, లోతుకుంట మాజీ సర్పంచ్ రాచకొండ బచ్చయ్య, ఆధ్యాపక బృందం ,విద్యార్థిని విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు
Feb 03 2024, 20:18