వలిగొండ మండలంలోని చిత్తాపురం అంగన్వాడి కేంద్రంలో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో చిత్తాపురం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం 12 గంటలకి నిర్వహించారు. ఈ సందర్భంగా వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం జే వినోద మాట్లాడుతూ.. కుష్టి వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రె వలన వస్తుందని, కుష్టి వ్యాధి ముఖ్యంగా చర్మానికి నరాలకు సోకుతుందని , కుష్టి వ్యాధి చాలా నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి సగటు 3 నుండి 5 సంవత్సరాల వరకు పడుతుందని అన్నారు. కుష్టి వ్యాధి ఎవరికైనా రావచ్చు, దీనికి వయసు ,లింగభేదం లేదు అని అన్నారు. ప్రారంభ దశలో గుర్తించి ఎం డి టి చికిత్స ఇచ్చిన చో కుష్టు వ్యాధి అంగవైకల్యానికి దారి తీయదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ మంజుల, ఆశా వర్కర్ బి కవిత, తల్లులు ,బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
Feb 03 2024, 19:25