ఆత్మకూరు మండల కేంద్రంలో ఘనంగా ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవీర్భావ దినోత్సవ వేడుకలను ఆత్మకూరు మండల కేంద్రం కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఉపాధిహామీ కూలీలు, ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గారు కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బడుగు బలహీన వర్గాలను ఆదుకొనే లక్ష్యంతో.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు ...గ్రామాభివృద్ధి మరియు సంక్షేమంలో భాగస్వామ్యం కావడం నేడు ఉపాధి హామీ పథకం 19 వ వసంతంలో అడుగుపెట్టడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నిరంజన్ వలీ, ఏపిఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి,మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం, నాయకులు కట్టేకోల హన్మంతు గౌడ్, ఎద్దు వెంకటేశ్వర్లు , పైళ్ళ దామోదర్ రెడ్డి,రంగ స్వామి,కోరే కనకయ్య, ఎలగందుల సైదులు, కొండపల్లి ముత్యాలు, ఉపాధి హామీ సిబ్బంది యాది రెడ్డి, శ్రీశైలం,సత్యనారాయణ మరియు కూలీలు పాల్గొన్నారు.
Feb 03 2024, 13:21