వలిగొండ మండలంలోని జాలు కాలువ ,గోకారం గ్రామాలలో సైబర్ నేరాలు, సీసీటీవీ ఉపయోగాలు, నేర నివారణ చర్యలపై అవగాహన కల్పించిన ఎస్సై మహేందర్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం, జాలు కాలువ గ్రామాలలో శుక్రవారం వలిగొండ ఎస్సై డి మహేందర్ సైబర్ నేరాలు, సీసీటీవీ ఉపయోగాలు, నేర నివారణ చర్యలు పై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకుంటే తర్వాత వాళ్లు బ్యాంక్ అధికారుల వలె నమ్మించి ఓటిపి తెలుసుకొని బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారని తెలిపారు. గ్రామాలలో సిసిటీవీలను ఉపయోగించాలని సిసిటీవీ వలన నేరాలను అరికట్టవచ్చని అన్నారు. దొంగలను, నేరస్తులను గుర్తించడంలో సీసీటీవీలు సహాయపడతాయని... సమాజంలో నేరం చేసే అవకాశాలను తగ్గిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Feb 02 2024, 23:26