భువనగిరిలో బీఆర్ఎస్ భువనగిరి నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శ్రీ సాయి కన్వెన్షన్ లో భువనగిరి నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ,సిద్దిపేట శాసనసభ్యులు ,తన్నీరు హరీష్ రావు ,మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు.. గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ... రుణమాఫీ పై మొదటి సంతకం అన్నారు ,4000 పింఛను అన్నారు, కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని, అన్నారు. రైతుబంధు ఇంతవరకు దిక్కు లేదని, రైతులను , పింఛన్దారులను గ్రామాలలో చైతన్యం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.... జైలు తమకు కొత్త కాదని, అక్కడికి వెళ్లి వచ్చామని అన్నారు . గ్రహ పాటు తో కాంగ్రెస్ కు అధికారం వచ్చిందని అన్నారు. భువనగిరి మాజీ శాసనసభ్యులు ఫైళ్ళ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ... రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ,రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, జిట్ట బాలకృష్ణ రెడ్డి, జిల్లా మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Feb 02 2024, 17:45