పద్మశ్రీ పురస్కారం కు ఎన్నికైన కూరెళ్లకు బీఎస్పీ సన్మానం
భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్బంగా సాహిత్య విషిష్ఠ సేవలను గుర్తించి డా. కూరెళ్ళ విఠలాచార్యకు పద్మ శ్రీ పురస్కారం లభించిన సందర్బంగా.. వెల్లంకి గ్రామంలో తన స్వగృహంలో బిఎస్పి ఆద్వర్యంలో ..సన్మానం చేసి అభినందించడం జరిగింది. ఈ సందర్బంగా ..బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ ..తనకు మిగిలిన ఏకైక ఆస్తి ఇంటిని గ్రంథాలయంగా మార్చిన గొప్ప మనిషి ,కవి ,డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అని అన్నారు.కూరెళ్ల అందరివాడని, ఆయన సేవలు మనందరికీ అవసరమని అన్నారు.పెన్షన్ డబ్బులతో మహా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి.. లక్షల పుస్తకాలు సేకరించిన మహోన్నత వ్యక్తి విఠలాచార్య అని కొనియాడారు.చిన్నతనం నుంచే అనేక కష్టాలను చూసిన వ్యక్తి ,ఏడేళ్ల ప్రాయంలోనే రచనలు చేయడం ఆయనకున్న పట్టుదలకు నిదర్శనమన్నారు.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక సాహితీ,విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఆయన సహకారంతో అనేక మంది విద్యార్థులు ...పైకెదిగి ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్నారని తెలిపారు.తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది జీవితాన్నే సాహిత్యానికి అంకితమిచ్చిన డా.కూరేళ్ళ విఠలాచార్య ఈ ప్రాంత వాసులు కావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ లభించడం, చాలా అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేడి సంతోష్, చిట్యాల మండల అధ్యక్షులు జోగు శేఖర్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్,రామన్నపేట మండల ఉపాధక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, మండల మహిళా కన్వీనర్ బందెల అనిత, కొంగరి రాజా లింగం,మేడి నవీన్, కూరెళ్ల వ్యక్తిగత సహాయకులు తాటిపాముల స్వామి బి ఎస్ పి నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు
Feb 02 2024, 15:36