చిన్నారిని పొట్టన పెట్టుకున్న వీధి కుక్కలు
హైదరాబాద్‌లో విషాధం చోటుచేసుకుంది. వీధి కుక్కలు మరో చిన్నారిని పొట్టనపెట్టుకున్నాయి. నిద్రిస్తున్న చిన్నారిని రోడ్డుపైకి లాక్కెళ్లి చంపేశాయి.ఈఘటన సమా ఎన్ క్లూ కాలనీలో జరిగింది.
మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సమా ఎన్ క్లూ కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాడు.
అయితే గురువారం అర్ధరాత్రి సూర్యకుమార్ నిద్రిస్తున్న సమయంలో సంవత్సరం వయస్సు ఉన్న పెద్ద కుమారుడు నాగరాజును 20 కుక్కలు ఒకేసారి పాసివికంగా దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చు కెళ్లాయి.
అర్ధరాత్రి కావడంతో ఇదంతా తల్లిదండ్రులు గమనించలేకపోయారు. కాసేపటికి పక్కన చిన్నారి కనిపించక పోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు తన కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కన వెతికినా ఎక్కడ కనిపించలేదు. చివరకు రోడ్డుపై కుక్కలు దాడిచేయడం గుర్తించారు.
పరుగెత్తుకుంటూ కుక్కలను తరిమి చూడగా చిన్నారి ఉలుకు పలుకు లేకుండా విగత జీవిగా పడివున్నాడు. చిన్నబాబుకు ఎమైందోనని గుండెలకు తల్లి హత్తుకున్నారు. బాబు వల్లంతా కుక్క కాట్లు ఉండడంతో నాగరాజు అంటూ లేపిన బాబు అప్పటికే మృతి చెందాడు.
బాబును విగతజీవిగా చూసి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుక్కల దాడిలో మృతిచెందిన చిన్నారి నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు.
Feb 02 2024, 14:11