కోదండ రాం, అమీర్ అలీఖాన్ ల ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులైన విషయం తెలిసిందే.కాగా, దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారా యణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జూలైలో బీఆర్ఎస్ మంత్రిమండలి తీర్మానం చేసింది.
ఈ నిర్ణయాన్ని గవర్నర్ తమిళి సై సెప్టెంబర్ 19న తిరస్కరించారు. దీనిపై దాసోజు, కుర్ర సత్యనారాయణలు హైకోర్టు ను అశ్రయించారు.. గవర్నర్ తన పరిధిని అధిగమించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ పిటిషన్‌పై పది రోజుల కింద విచారణ జరిగింది. శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు.
అయితే ఆర్టికల్ 361 ప్రకారం పిటిషనర్ల పిటిషన్‌కు అనుమతి లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ కోర్టుకు తెలిపారు. ఇరువాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్ అర్హతపై వాదనలు వింటామంటూ తదుపరి విచారణ హైకోర్టు వాయిదా వేసింది.
అయితే తమ పిటిషన్ విచారణలో ఉండగా గవర్నర్ కోటాలో కోదండ రాం , అమీర్ ఖాన్ లను ఎమ్మెల్సీగా నియమించా రని నేడు దాసోజు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.. ఆ ఇద్దరూ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని చెప్పారు.. దీంతో ఆ ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది..
తదుపరి విచారణ వరకు స్టేటస్ కో విదించింది.. విచారణను వచ్చే నెల 8వ తేదికి వాయిదా వేసింది..
Feb 01 2024, 09:56