ఉద్యోగాలైన ఇవ్వండి , నిరుద్యోగ భృతి నైనా కల్పించండి : సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు
అఖిలభారత విద్యార్థి సమాఖ్య-AiSF, అఖిలభారత యువజన సమాఖ్య-AiYF, ఉమ్మడి సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో ఎల్లంకి మహేష్ గారి అధ్యక్షతన జరిగినది .ఈ సమావేశానికి *ముఖ్యఅతిథిగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గోదాశ్రీ రాములు హాజరై మాట్లాడుతూ.... నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ,ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ప్రధానంగా యువకులు ,విద్యార్థులు, లక్షలాదిమంది ఏలాంటి పనులు లేకుండా ఉన్నారని ..నిరుద్యోగులకు ఉద్యోగాలైన ఇవ్వండి లేదా వారికి నిరుద్యోగ భృతి 5000 రూపాయలు ,రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలన్నింటినీ ఈనెల 6న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యువజన,విద్యార్థి సంఘాలు అమలు కోసం ...చలో కలెక్టరేట్ కార్యాలయానికి పిలుపు నిచ్చారు .అలాగే యాదాద్రి జిల్లాలో యాదాద్రి దేవాలయం నిధులతో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయించాలని, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని ,అలాగే రైతులు వ్యవసాయ కూలీలు సాగు త్రాగునీరు కోసం బూనాది గాని కాలువ, పిల్లాయిపల్లి కాలువలు కూడా పూర్తి చేయాలని, గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేయాలని ,మూసి ప్రక్షాళన త్వరగతిన పూర్తి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ,మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం యువజన విద్యార్థి సంఘాలు సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విద్యార్థి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఉప్పులశాంతి కుమార్, పెరబోయిన మహేందర్, వస్తువుల అభిలాష్,మమ్మద్ నయీమ్,సూరారం జానీ, సుద్దాల సాయికుమార్, మేడి దేవేందర్, మారుపాక లోకేష్, మొగుళ్ల శేఖర్ రెడ్డి, బద్దుల శ్రీనివాస్, బూడిద సాయి చరణ్, సునారి భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
Jan 30 2024, 23:24