మత్స్యగిరి గుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని,యాదగిరిగుట్టడిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేసిన అరూరు గ్రామస్తులు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మత్స్యగిరి గుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని..యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కి, అరూరు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
మత్స్యగిరిగుట్ట దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతూ ,అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కానీ ,ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక భక్తులు ముఖ్యంగా మహిళలు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది .దూర ప్రాంతాల నుంచి హైదరాబాదు ,నల్లగొండ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస్సులు లేక భువనగిరి వలిగొండలో నిలిచి పోతున్నారు.
యాదగిరిగుట్ట నుండి మచ్చ గిరి గుట్ట వరకు ఒక సెటిల్ బస్సు నడపాలని ,మేనేజర్ గారిని కోరడం జరిగింది .సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ అతి త్వరలో బస్సు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు.
వినతి పత్రం అందజేసిన వారిలో బండారు నరసింహారెడ్డి కిసాన్ సెల్ మండల అధ్యక్షులు, లింగయ్య యాదవ్ మాజీ మచ్చ గిరి గుట్ట ధర్మకర్త,
ఆవుల సత్యనారాయణ వార్డు మెంబర్, జనుగల మల్లేష్ హై స్కూల్ చైర్మన్, ఆవుల అంజయ్య ప్రైమరీ స్కూల్ చైర్మన్,
పిట్టల సుధాకర్, కీర్తిశేషులు తుమ్మల నరసయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు కసర బోయిన నరసింహ తదితరులు పాల్గొన్నార
Jan 30 2024, 17:35